Compact SUV Sales Report: భారతదేశంలో సబ్ 4 మీటర్ ఎస్‌యూవీ / క్రాస్ఓవర్ సెగ్మెంట్‌లోనే అత్యధిక వాహనాలు అమ్ముడుపోయాయి. ఈ విభాగంలో మార్కెట్‌లో చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. 2023 జూన్‌లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 ఎస్‌యూవీ కార్ల గురించి తెలుసుకుందాం.


టాప్‌లోనే నెక్సాన్
టాటా నెక్సాన్ గత నెలలో ఈ విభాగంలో 13,827 యూనిట్లు అమ్ముడుపోయాయి. 2022 జూన్‌లో అమ్ముడు పోయిన 14,295 యూనిట్ల కంటే ఇది 3.27 శాతం తక్కువ. దీని తర్వాత మారుతి సుజుకి బ్రెజా ఎస్‌యూవీ 10,578 యూనిట్ల విక్రయాలతో రెండో స్థానంలో ఉంది. దీని మార్కెట్ వాటా 12.04 శాతంగా ఉంది.


11,606 యూనిట్లతో హ్యుండాయ్ వెన్యూ ఈ విభాగంలో మూడో స్థానంలో నిలిచింది. దీని తర్వాత టాటా పంచ్ 10,990 యూనిట్ల విక్రయాలతో నాలుగో స్థానంలో ఉంది. దీని తర్వాత 8,686 యూనిట్ల అమ్మకాలతో సుదీర్ఘ ప్రజాదరణ పొందిన బొలెరో ఎస్‌యూవీ ఉంది. ఇటీవల విడుదల చేసిన మారుతి సుజుకి ఫ్రాంక్స్‌కు కూడా మార్కెట్‌లో మంచి స్పందన లభించింది. దీనికి సంబంధించి గత నెలలో 7,991 యూనిట్లు అమ్ముడుపోయాయి.


కియా సొనెట్ అమ్మకాలు గతేడాది కంటే 3.58 శాతం పెరిగి 7,772 యూనిట్లకు చేరుకున్నాయి. గతేడాది జూన్‌లో అమ్ముడుపోయిన 7,455 యూనిట్ల కంటే ఇది కాస్త ఎక్కువ. దీని తర్వాతి స్థానంలో 5,094 యూనిట్లతో మహీంద్రా ఎక్స్‌యూవీ300 నిలిచింది.


థార్ వర్సెస్ జిమ్నీ అనేది ప్రస్తుతం ఈ సెగ్మెంట్‌లో ఎక్కువగా వినిపించే అంశం. కానీ గత నెలలో థార్ అమ్మకాల పరంగా ముందంజలో నిలిచింది. గత నెలలో థార్‌కు సంబంధించి 3,899 యూనిట్లు, జిమ్నీకి సంబంధించి 3,071 యూనిట్లు అమ్ముడుపోయాయి. నిస్సాన్ మాగ్నైట్, రెనో కిగర్ టాప్ 10 జాబితాలో చివరన నిలిచాయి. నిస్సాన్ మాగ్నైట్ 2,552 యూనిట్లు, రెనో కైగర్ 1,844 యూనిట్లు అమ్ముడుపోయాయి.


టాటా నెక్సాన్ మనదేశంలో తక్కువ సమయంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కారుగా మారింది. కొత్త కస్టమర్లకు ఇది ఫేవరెట్ ఆప్షన్‌గా మారింది. అలాగే అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారుగా మారింది. కేవలం మూడు సంవత్సరాల స్వల్ప వ్యవధిలోనే టాటా నెక్సాన్ 50,000 యూనిట్ల అమ్మకాలు సాధించింది. మనదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయిన ఈవీగా నిలిచింది. మొత్తమ్మీద నెక్సాన్, దాని వేరియంట్‌లు దేశీయ మార్కెట్‌లో 15 శాతం అమ్మకాలను సొంతం చేసుకున్నాయి.


టాటా ప్రస్తుతం నెక్సాన్‌కు సంబంధించి విభిన్న రకాల మోడళ్లను విక్రయిస్తుంది. ఇందులో ఈవీ ప్రైమ్, ఈవీ మ్యాక్స్ అలాగే దాని డార్క్ ఎడిషన్ ఉన్నాయి. మరోవైపు నెక్సాన్ ఈవీ ప్రైమ్ ధర గురించి చెప్పాలంటే దీనిని ప్రారంభ ధర రూ. 14.49 లక్షలుగా ఉంది. నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 18.79 లక్షలుగా నిర్ణయించారు. ఈ కారు ఇటీవలే 50,000 ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇంతకు ముందు నెక్సాన్ ఈవీ మ్యాక్స్ మరో రికార్డును సృష్టించింది. ఇది కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అత్యంత వేగంగా డ్రైవ్ చేసిన కారుగా నిలిచింది. అంటే 4,003 కిలోమీటర్ల ప్రయాణాన్ని కేవలం 95 గంటల 46 నిమిషాల్లో (4 రోజులలోపు) పూర్తి చేసింది. దీని ద్వారా ఈ కారు అనే నగరాలను తక్కువ కాలంలో కవర్ చేయగలదని ప్రూవ్ అయింది. అదే సమయంలో నెక్సాన్ ఈవీ మ్యాక్స్ 453 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందించగలదు. అంటే ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 453 కిలోమీటర్ల రేంజ్ లభించనుందన్న మాట.


Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?


Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial