కరోనావైరస్ పాండమిక్ తర్వాత ప్రజలు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కంటే వ్యక్తిగత వాహనాలకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు. దీంతో కొత్త వాహనాలకు డిమాండ్ పెరిగింది. ప్రత్యేకంగా ద్విచక్రవాహనాల మార్కెట్ బాగా పెరిగింది. అయితే కొంతమంది ఎంట్రీ లెవల్ వాహనాల కంటే కాస్త మెరుగైన పెర్ఫార్మెన్స్ ఇచ్చే వాహనాలకు ప్రాధాన్యతను ఇస్తున్నారు. మీరు కూడా మంచి పవర్ ఫుల్ బైక్ కోసం చూస్తున్నారా? రూ.1.3 లక్షల్లో మనదేశంలో అందుబాటులో ఉన్న టాప్-5 బైకులు ఇవే..


1. హీరో ఎక్స్‌పల్స్ 200, ఎక్స్‌పల్స్ 200 4వీ
ఈ ధరలో హీరో ఎక్స్‌పల్స్ 200 కచ్చితంగా మంచి ఆప్షనే. ప్రస్తుతం మనదేశంలో అందుబాటులో ఉన్న చవకైన అడ్వెంచర్ మోటార్ సైకిల్ ఇదే. మీరు రోజువారీ వాడుకోవడానికి, వారాంతాల్లో బయటకు వెళ్లడానికి కూడా ఈ బైక్ ఉపయోగపడుతుంది. ఇందులో 199.6 సీసీ ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌ను అందించారు. 18 బీహెచ్‌పీ, 16 ఎన్ఎంను ఈ ఇంజిన్ అందించనుంది. ఒకవేళ ఇంతకంటే శక్తివంతమైన బైక్ కావాలంటే.. ఎక్స్‌పల్స్ 200 4వీ కొనుగోలు చేయవచ్చు. ఈ ఇంజిన్ 19 బీహెచ్‌పీ, 17 ఎన్ఎంను అందించనుంది. ఎక్స్‌పల్స్ 200లో ఎల్సీడీ క్లస్టర్, టర్న్ బై టర్న్ నేవిగేషన్ కోసం ఎల్‌సీడీ క్లస్టర్ కూడా ఉంది. కొత్త దారుల్లో ప్రయాణించేటప్పుడు ఇది మీకు కచ్చితంగా సాయపడనుంది.


హీరో ఎక్స్‌పల్స్ 200 పెర్ఫార్మెన్స్ స్పెసిఫికేషన్లు: 18 బీహెచ్‌పీ, 16 ఎన్ఎం
హీరో ఎక్స్‌పల్స్ 200 4వీ పెర్ఫార్మెన్స్ స్పెసిఫికేషన్లు: 19 బీహెచ్‌పీ, 17 ఎన్ఎం 
హీరో ఎక్స్‌పల్స్ 200 ధర: రూ.1.23 లక్షల నుంచి రూ.1.28 లక్షల వరకు (ఎక్స్-షోరూం)


2. హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్
ఈ బైక్ చూడటానికి అంత అందంగా ఉండకపోవచ్చు. కానీ చాలా పవర్‌ఫుల్. ఇందులో 199.6 సీసీ ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌ను అందించారు. దీని బీహెచ్‌పీ 18గానూ, ఎన్ఎం 16గానూ ఉంది. ఇందులో కూడా ఎల్సీడీ క్లస్టర్‌ను అందించారు. టర్న్ టై టర్న్ నేవిగేషన్ కోసం ఈ ఎల్సీడీ క్లస్టర్ ఉపయోగపడనుంది.


హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ పెర్ఫార్మెన్స్: 18 బీహెచ్‌పీ, 16 ఎన్ఎం 
హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ ధర: రూ.1.27 లక్షలు(ఎక్స్-షోరూం)


3. టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 180
టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 180లో కూడా మంచి ఫీచర్లు ఉన్నాయి. ఇది కూడా మంచి ఇంట్రస్టింగ్ ఆప్షన్. ఇందులో సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ ఉంది. ఈ బైక్‌లో గ్లైడ్ త్రూ టెక్నాలజీ కూడా అందించారు. దీని ద్వారా తక్కువ వేగంగా డ్రైవ్ చేసేటప్పుడు.. ట్రాఫిక్‌లో రైడర్ ఎక్కువగా అలిసిపోకుండా ఉంటారు. దీని ఇంజిన్ సామర్థ్యం 177.4 సీసీగా ఉంది. దీని బీహెచ్‌పీ 17 కాగా, పీక్ టార్క్ 15.5 ఎన్ఎంగా ఉంది. ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్‌ను ఇందులో అందించారు.


టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 180 పెర్ఫార్పెన్స్ స్పెసిఫికేషన్లు: 17 బీహెచ్‌పీ, 15.5 ఎన్ఎం
టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 180 ధర: 1.15 లక్షలు(ఎక్స్-షోరూం)


4. టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 160 4వీ
ఈ జాబితాలో ఎక్కువ ఫీచర్లు ఉన్న బైక్ ఇదే. ఇందులో ఎల్సీడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంది. స్మార్ట్ఎక్స్‌కనెక్ట్ సిస్టం కూడా ఇందులో ఉంది. దీంతో మీ స్మార్ట్ ఫోన్‌ను కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అర్బన్, రెయిన్, స్పోర్ట్ అంటూ మూడు మోడ్స్ ఇందులో అందించారు. ఇందులో 159.7 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను అందించారు. ఫైవ్ స్పీడ్ గేర్‌బాక్స్‌ను ఇందులో అందించారు.


టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 160 4వీ పెర్ఫార్పెన్స్ స్పెసిఫికేషన్లు: 17 బీహెచ్‌పీ, 15 ఎన్ఎం
టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 160 4వీ ధర: 1.15 లక్షల నుంచి 1.21 లక్షల మధ్య(ఎక్స్-షోరూం)


5. బజాజ్ పల్సర్ ఎన్ఎస్160
ఇందులో పవర్‌ఫుల్ 160 సీసీ ఇంజిన్‌ను అందించారు. ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్‌ను ఇందులో అందించారు. స్పీడ్, ఓడోమీటర్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, క్లాక్ వంటివి ఎల్సీడీలో చూసుకోవడానికి వీలయ్యేలా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను ఇందులో అందించారు.


బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 పెర్ఫార్మెన్స్ స్పెసిఫికేషన్లు: 17 బీహెచ్‌పీ, 15 ఎన్ఎం
బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 ధర:  రూ.1.16 లక్షలు(ఎక్స్-షోరూం)


Also Read: Bikes Under Rs.1 Lakh: రూ.లక్షలోపు మంచి బైక్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇవే.. స్పోర్ట్స్ బైకులు కూడా!


Also Read: TVS Raider: కొత్త బైక్ వచ్చేసింది.. రూ.80 వేలలో బెస్ట్.. అదిరిపోయే లుక్, ఫీచర్లు!


Also Read: Ola Electric Scooter: అమ్మకాల్లో ఓలా స్కూటర్ రికార్డు.. మొత్తం టూవీలర్ ఇండస్ట్రీనే మించేలా.. ఎన్ని అమ్ముడుపోయాయంటే?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి