గత కొంత కాలంగా ప్రపంచ దేశాల్లో తలెత్తిన సమస్యల కారణంగా ఇంధన ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది ఎలక్ట్రిక్ వెహికల్స్ (EV) కొనుగోలు వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, కొత్త EVల ధరలను పెంచే అవకాశం ఉండటంతో పాటు ఉక్రెయిన్ యుద్ధం ఫలితంగా బ్యాటరీలకు అవసరమైన నికెల్ ధర రికార్డు స్థాయిలో పెరిగింది. EVలు కొనుగోలు చేసినప్పటికీ, విద్యుత్ ధర పెరుగుతోంది. అయితే, మీరు పెట్రోల్, డీజిల్ వాహనాలు ఉపయోగిస్తే ఇంధన ఖర్చులను తగ్గించుకునే కొన్ని టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1. యాక్సిలరేటర్‌ని పరిమితి మేరకు వాడండి
వాహనదారులు యాక్సిలరేటర్ పెడల్‌ను ఎంత ఎక్కువగా ప్రెస్ చేస్తే, ఇంధనం అంత ఎక్కువగా ఖర్చు అవుతుంది. అందుకే ఎక్కువ వేగంతో వెళ్లాలి అనుకున్నప్పుడు మూడవ గేర్ లో కాకుండా నాల్గవ గేర్ లో వెళ్లడం మంచిది. తక్కువ గేర్లలో ఎక్కువ వేగంతో వెళ్లడం మూలంగా అధికంగా ఇంధనం అయిపోతుంది.
2. బరువులను తగ్గించాలి
కారు ఎంత బరువు ఉంటే, అది కదలడానికి అంత ఎక్కువ ఇంధనాన్ని ఉపయోగిస్తుంది. మీరు ఎప్పుడూ ఉపయోగించని టూల్ బాక్స్ లాంటి వాటిని కారులో నుంచి తొలగించడం మంచింది. మీ కారులో ఎంత బరువు తగ్గితే అంత ఇంధన ఆదా అవుతుందంటారు నిపుణులు.
3. వేగ పరిమితిని పాటించాలి
వాహనాన్ని నిర్దిష్ట వేగంలో నడపటం వల్ల ఇంధనాన్ని ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ, వేగంలో పరిమితి లేకుండా ఒకచోట అడ్డగోలుగా వేగం పెంచడం, తగ్గించడం చేస్తే ఎక్కువ ఇంధనం ఖర్చు అవుతుంది.
4. ఏసీ వినియోగం తగ్గించాలి
ఏసీ వినియోగం పెరగడం వల్ల ఇంధన ఖర్చు పెరుగుతుంది. అందుకే వీలైనంత తక్కువగా ఏసీ వినయోగించడం మంచింది. 45mph కంటే తక్కువ, విండోలు తెరిచి ఉంచడం వల్ల ఎయిర్ కాన్ కంటే తక్కువ ఇంధనం ఉపయోగించబడుతుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి.
5. టైర్లను ఎప్పటికప్పుడు పరిశీలించండి
వాహన టైర్లు ఎంత మెరుగ్గా ఉంటే వాహనం అంత ఈజీగా ముందుకు కదులుతుంది. వాహన హ్యాండ్లింగ్, ఎకానమీని పెంచడానికి సరైన టైర్లు అవసరం. అందుకే తరచుగా టైర్లను పరిశీలించాలి. అవసరం అయితే, కొత్త టైర్లను వాడాలి.
6. మీ కారును సర్వీస్‌లో ఉంచుకోండి
రెగ్యులర్ సర్వీస్డ్ కారు చాలా ఇంధన ఆదా చేస్తుంది. షెడ్యూల్ ప్రకారం సర్వీస్ చేయబడిన కారు చాలా కండీషన్ లో ఉంటుంది. తక్కువ ఇంధనాన్ని కూడా ఉపయోగిస్తుంది.
7. తక్కువ RPM ఉండేలా చూసుకోండి
ఇంజిన్ చక్కగా ఉండాలంటే వాహనాన్ని 2,000rpm కంటే తక్కువగా ఉండేలా చూడాలి. తక్కువ revs, ఇంజిన్ తక్కువ ఇంధనాన్ని ఉపయోగిస్తుంది.
8. మంచి ప్లానింగ్‌తో ప్రయాణాలు చేయండి
మీరు మీ కారును ఎంత తక్కువ డ్రైవ్ చేస్తే, అంత తక్కువ ఇంధనాన్ని వినియోగిస్తారు. కొన్ని ట్రిప్‌లను ఆపలేము. కానీ, ప్రయాణాలను మెరుగ్గా ప్లాన్ చేసుకోవడం ద్వారా తక్కువ కిలో మీటర్లు ప్రయాణం చేసి ఎక్కువ ఇంధనం ఆదా చేసుకోవచ్చు.
Read Also: కారులో బ్యాడ్ స్మెల్‌కు కారణం ఏమిటీ? ఆ వాసన పోవాలంటే ఏం చేయాలి?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial