చాలా మంది తమ కార్లను వీలైనంత వరకు శుభ్రంగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. తరచుగా శుభ్రం చేసినా, ఒక్కోసారి కొన్ని వాసనలు కారులో నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. ఎలుకలు చనిపోయిన వాసన, సిగరెట్ పొగ వాసన, తడిచిన దుస్తుల వాసన అప్పుడప్పుడు వస్తుంటుంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. కారు ఏసీ వల్ల లేదా కారులోని సీట్ల వల్ల ఈ వాసనలు వస్తుంటాయి. అలాగే కార్లలో ఆహార పదార్థాలు లేదా, కార్పెట్‌పై చెత్త పేరుకుపోయినా ఈ వాసనలు వస్తాయి. కారులో వచ్చే చిన్న చిన్న సమస్యల వల్ల కూడా ఈ వాసన ఏర్పడుతుంది. అయితే, వాసనలను తొలగించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో చూసేయండి మరి. 


వైట్ వెనిగర్, వాటర్ సొల్యూషన్‌తో సర్ఫేస్ క్లీనింగ్


వెనిగర్ ఆమ్ల స్వభావం వాసనలను తటస్తం చేయడంలో సహాయపడుతుంది. నీటితో కలిపినప్పుడు, మీ కారు డాష్‌ బోర్డ్, ప్లాస్టిక్ మ్యాట్‌లు సహా గట్టి బాగాలను చక్కగా శుభ్రపర్చుతుంది. ఇది అంతర్నిర్మిత ధూళి, గ్రీజును కూడా ఇట్టే తొలగించేస్తుంది. వైట్ వెనిగర్, వెచ్చని నీటిని సమాన భాగాలుగా కలపాలి. మిశ్రమంలో ఒక గుడ్డను ముంచి, దానిని ఆయా బాగాలపై తుడవాలి. ఇలా చేయడం వల్ల కారులోని దుర్వాసన పోగొట్టే అవకాశం ఉంటుంది. 


కార్పెట్ల వాక్యూమింగ్ 


అప్హోల్స్టరీ, మ్యాట్లు, కార్పెట్ల కారణంగానే కారులో ఎక్కువగా చెడు వాసన వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వాటిలోని మురికి, పెంపుడు జంతువుల వెంట్రుకలు, దుమ్ము,  చెత్తను తొలగించడానికి వాటిని క్రమం తప్పకుండా వాక్యూమ్ చేయాలి. అలా చేయకపోతే, కాలక్రమేణా పేరుకుపోయి దుర్వాసనకు కారణమవుతాయి. అన్ని మ్యాట్‌లు, ఫ్లోర్ లైనర్లు, కార్ సీట్లను తీసివేసి పూర్తిగా వాక్యూమ్ చేయాలి. వాక్యూమింగ్ కారు తాజా వాసనను కలిగిస్తుంది.


బేకింగ్ సోడా, బొగ్గును ఉపయోగించడం


బేకింగ్ సోడా, బొగ్గు రెండూ సహజ వాసన శోషకాలు. ఫ్లోర్ మ్యాట్‌లు, కార్ సీట్లు, ఇతర ఫాబ్రిక్ ఉపరితలాలపై బేకింగ్ సోడాను పలుచగా చల్లుకోవాలి. బొగ్గు వాసనలను గ్రహించడంలో కూడా సహాయపడుతుంది. వీటిన కారులో ఉంచడం మూలంగా అవాంఛిత వాసనలను తగ్గించడంలో సహాయపడుతుంది. అందుకే బొగ్గు ముక్కలను రాత్రిపూట కారులో ఉంచడం మంచిది.


ఎసెన్షియల్ ఆయిల్స్, ఎయిర్ ఫ్రెషనర్లను ఉపయోగించడం


ఎసెన్షియల్ ఆయిల్స్ మీ కారులో వాసనలను తగ్గించడంలో ఉపయోగపడతాయి. మీ కారులో తాజా వాసనను కలిగిస్తుంది. కాటన్ బాల్స్, టిష్యూ పేపర్ ముక్కలపై కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్స్ వేసి కారులో ఉంచడం వల్ల సువాసన వస్తుంది. చెడు వాసనలు వదిలించుకోవడానికి ఎయిర్ ఫ్రెషనర్లు కూడా బాగా ఉపయోగపడతాయి.  


ఎయిర్ ఫిల్టర్‌లను మార్చడం, AC సిస్టమ్‌ని డియోడరైజ్ చేయడం


బయటి నుంచి వచ్చే గాలి ద్వారా చెడు వాసన వస్తే ఎయిర్ ఫిల్టర్‌లను మార్చవలసి ఉంటుంది. అలాగే AC సిస్టమ్‌ను సర్వీసింగ్ చేయించాలి. ఎయిర్ ఫిల్టర్‌లను మార్చడం వల్ల చెడు వాసనలకు కారణమయ్యే  ధూళి, దుమ్ము, చెత్తను తొలగించడంలో సహాయపడుతుంది. AC సిస్టమ్‌ కూడా క్లీన్ చేయించడం ఉత్తమం.


నిపుణులకు చూపించండి 


కారులో చెడు వాసన తొలగించేందుకు ఎంత ప్రయత్నించినా, సాధ్యం కాకపోతే నిపుణులను పిలవడం మంచిది. వారు మీ కారు నుంచి వచ్చే ఎలాంటి దుర్వాసనలను అయినా ప్రత్యేకమైన సాంకేతికతలు, ఓజోన్ ట్రీట్మెంట్ తో తొలగించే అవకాశం ఉంటుంది.   


కిటికీలు తెరిచి ఉంచండి


స్వచ్ఛమైన గాలిని లోపలికి వచ్చేలా చేయడం వల్ల వాసనలను తగ్గించడంలో సహాయపడుతుంది. వీలైనంత వరకు స్వచ్ఛమైన గాలి లోపలికి వచ్చేలా మీ కారు విండోలను ఓపెన్ చేయడం మంచిది. 


కారులో పొగతాగడం మానుకోండి


సిగరెట్ పొగ అనేది చాలా ఘాటు వాసనను కలిగి ఉంటుంది. అందుకే, కారులో వీలైనంత వరకు పొగ తాగకపోవడం మంచిది.    


Read Also: మీ కారు మంచి మైలేజీ ఇవ్వాలా? ఈ 5 టిప్స్ పాటించండి!


ముఖ్యమైనమరిన్ని ఆసక్తికర కథనాల కోసం టెలిగ్రామ్లో ఏబీపీ దేశంలో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial