Cybercab And RoboVan Launched by Tesla: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఎటువంటి డ్రైవర్ లేకుండా నడిచే రోబోటాక్సీని ప్రపంచానికి పరిచయం చేశారు. అదే టెస్లా సైబర్ క్యాబ్. ఈ రోబోట్యాక్సీలో ఎలాన్ మస్క్ కూడా ప్రయాణిస్తూ కనిపించారు. మస్క్ ఈ వాహనంలో ప్రయాణిస్తున్న వీడియోను కూడా షేర్ చేశారు. ఈ రోబో టాక్సీ తలుపులు ఆటోమేటిక్‌గా తెరుచుకుంటాయి. ఈ టెస్లా కారు స్టీరింగ్ వీల్, పెడల్స్ లేకుండా రోడ్డుపై నడుస్తున్నట్లు కనిపిస్తుంది.


ఎలాన్ మస్క్ రోబో ఈవెంట్
లాస్ ఏంజిల్స్‌లో జరిగిన టెస్లా రోబోట్ ఈవెంట్‌లో ఎలాన్ మస్క్ రోబోట్ టాక్సీ, సైబర్‌క్యాబ్‌లను ప్రపంచానికి పరిచయం చేశాడు. ఎలాన్ మస్క్ లాంచ్ చేయనున్న ఈ రోబోట్ టాక్సీ గురించి ప్రపంచం  మొత్తం చాలా కాలంగా ఎదురుచూస్తోంది. ఈ రోబో ట్యాక్సీ తయారీ 2026 సంవత్సరం నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉందని ఎలాన్ మస్క్ తెలిపారు.


ఎలాన్ మస్క్ రోబోబస్ గ్లింప్స్ కూడా ప్రపంచానికి చూపించాడు. ఆటోమేటిక్‌గా నడిచే ఈ బస్సులో 20 మంది కలిసి ప్రయాణించవచ్చు. ఈ బస్సును వాణిజ్య వాహనంగానూ, ప్రైవేట్ వాహనంగానూ ఉపయోగించవచ్చు. దీనిని స్కూల్ బస్సుగా కూడా ఉపయోగించవచ్చు.


రోబోటాక్సీ అంటే ఏమిటి?
రోబోటాక్సీ అనేది ఆటోమేటిక్ వాహనం. దీనిని ఆపరేట్ చేయడానికి డ్రైవర్ అవసరం లేదు. ఈ వాహనంలో చిన్న క్యాబిన్ ఉంది. ఈ టెస్లా కారులో ఇద్దరు వ్యక్తులు కూర్చునే సామర్థ్యం ఉంది. భవిష్యత్తులో వచ్చే వాహనాలను దృష్టిలో ఉంచుకుని ఈ వాహనం డిజైన్‌ను సిద్ధం చేశారు. ప్రస్తుతం దీని ప్రోటోటైప్‌ను మాత్రమే ఎలాన్ మస్క్ పరిచయం చేశాడు. ఈ రోబోటాక్సీని మొబైల్ ఫోన్ లాగా వైర్‌లెస్ ఛార్జర్‌తో ఛార్జ్ చేయవచ్చు.





Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే


టెస్లా సైబర్ క్యాబ్ ఫీచర్లు
సైబర్ క్యాబ్‌తో టెస్లా కూడా రోబో ట్యాక్సీ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. టెస్లా రోబో ట్యాక్సీలో ఎటువంటి పెడల్స్, స్టీరింగ్ వీల్స్ ఉండవు. ఇది పూర్తిగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా పని చేస్తుంది. ఇందులో కొన్ని సెన్సార్లు, కెమెరాలు ఉంటాయి. మీరు జస్ట్ డెస్టినేషన్ ఎంటర్ చేస్తే చాలు. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ లెవల్ 2  ఫీచర్‌ను కూడా ఇందులో అందించారు.


ఇది కూపే తరహా రెండు డోర్ల డిజైన్‌తో మార్కెట్లోకి వచ్చింది. బటర్‌ఫ్లై తరహా డోర్ల డిజైన్‌‌ను ఇందులో అందించారు. పెద్ద టచ్ స్క్రీన్ డిస్‌ప్లేను సెంటర్ కన్సోల్‌లో అందించారు. టెస్లా వాహనాల్లో దీన్ని డీఫాల్ట్‌గా ఇస్తారు. సైబర్ ట్రక్‌లో కూడా డీఫాల్ట్‌గా దీన్ని చూడవచ్చు. మిగతా ఇంటీరియర్ అంతా చాలా సింపుల్‌గా ఉంది. సెంట్రల్ కన్సోల్‌లో కూడా బటన్స్‌ను అస్సలు లేవు. సైబర్ క్యాబ్‌కు ముందు, వెనక సింగిల్ ఎల్ఈడీ స్ట్రిప్స్‌ను అందించారు. పైభాగం డిజైన్ మాత్రం టెస్లా సైబర్ ట్రక్ తరహాలో ఉంది. 


ధర ఎంత ఉండవచ్చు?
టెస్లా సైబర్ క్యాబ్ ధర 30 వేల డాలర్లలోపే (మనదేశ కరెన్సీలో సుమారు రూ.25 లక్షలు) ఉండవచ్చని ఎలాన్ మస్క్ తెలిపాడు. 2026 నాటికి టెస్లా సైబర్ ట్రక్ ప్రొడక్షన్‌లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉందని హింట్ ఇచ్చాడు.



Also Read: New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?