దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ నుంచి సరికొత్త మోడల్ భారత మార్కెట్‌లోకి లాంచ్ కానుంది. దీని పేరు టాటా టియాగో ఎన్ఆర్‌జీ (Tata Tiago NRG). దీనిని ఆగస్టు 4వ తేదీన విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ కారుకి సంబంధించిన టీజర్ ఇమేజ్‌ను సైతం విడుదల చేసింది. ఈ కార్లు ఇప్పటికే డీలర్ల వద్దకు చేరినట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించిన ఫీచర్లు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. చూడటానికి మంచి స్టైలిష్ లుక్‌లో ఉన్న ఈ కారు.. మారుతి సుజుకీ సెలెరియో ఎక్స్, ఫోర్డ్ ఫ్రీస్టైల్ కార్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.
బ్లాక్ కలర్ రూఫ్..
ఇప్పటివరకు అందిన లీకుల ప్రకారం.. కొత్త టియాగో ఎన్‌ఆర్‌జీ ఫేస్‌లిఫ్ట్ కారు రూఫ్ నలుపు రంగులో ఉంటుంది. ఇది నలుపు, తెలుపు డ్యూయల్ టోన్ రంగుల్లో లభించనుంది. ఇందులో ఏసీ ఎయిర్ వెంట్ బెజెల్స్, గేర్ షిఫ్ట్ నాబ్, సెంటర్ కన్సోల్ కాంట్రాస్ట్ ఎసెంట్‌తో ఉన్నట్లు తెలుస్తోంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హర్మన్ సౌండ్ సిస్టమ్‌తో పాటు మరిన్ని హైటెక్ ఫీచర్లను దీనిలో అందించనున్నారు.
ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ..
టియాగో ఎన్‌ఆర్‌జీలో రిమోట్ లాకింగ్ / అన్‌లాకింగ్‌తో 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లేలను సపోర్ట్ చేస్తుంది. ఈ కారుకి 14 అంగుళాల అల్లోయ్ వీల్స్ అందించారు. దీని అంచులలో బ్లాక్ క్లాడింగ్ అందించే సౌకర్యం కూడా ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ 200 నుండి 205 మిమీ ఇచ్చే అవకాశం ఉంది. దీనిపై రూఫ్ టెయిల్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: ఆగస్టులో విడుదల కానున్న బైక్స్ ఇవే..
డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు..
సేఫ్టీ ఫీచర్ల గురించి చెప్పాలంటే, ఈ టియాగో ఎన్‌ఆర్‌జీ కారుకు డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఏబీడీ, కెమెరాతో కూడిన రేర్ పార్కింగ్ సెన్సార్ వంటి ఫీచర్లు అందించారు. ఇందులో 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 84 బీహెచ్‌పీ పవర్, గరిష్టంగా 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌లో 5 స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్ ఉంటాయి.
ఈ టాటా టియాగో ఎన్ఆర్‌జీ డిజైన్ స్టాండర్డ్ టాటా టియాగో మోడల్ మాదిరిగానే ఉండనుంది. ఇందులోని ఫీచర్లు కూడా చాలా వరకు దాని స్టాండర్డ్ మోడల్ లోని ఫీచర్స్ మాదిరిగానే ఉండనున్నాయి. ఇందులో బ్లాక్ ఓఆర్వీఎంలు, బ్లాక్డ్ అవుట్ బీ పిల్లర్స్, బ్లాక్డ్ అవుట్ సీ పిల్లర్లు ఉండనున్నాయి.
Also Read: రయ్.. రయ్.. ప్రపంచంలో ఏది ఫాస్టెస్ట్ కార్!