జోరుగా, హుషారుగా షికారు చేద్దమా.. హాయిహాయిగా, తీయతీయగా..! ఇది ఓ సినిమా పాట. అయితే ఇలా పాడుకుంటూ జెట్ స్పీడ్ తో రయ్ రయ్ మంటూ దూసుకుపోయే కార్లకు లెక్కేలేదు. అయితే ప్రస్తుతం ఎలక్ట్రికల్ వాహనాలకు డిమాండ్ భారీగా పెరిగింది. అయితే కంఫర్ట్ తో పాటు వేగాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కొత్త కొత్త మోడల్స్ లో ఎలక్ట్రికల్ కార్లు మార్కెట్లోకి వస్తున్నాయి. వీటిని చూస్తే పెట్రోల్ కార్లు కూడా వావ్ అనాల్సిందే. వాటిలో కొన్నింటిని చూద్దాం.


1. ఆడీ RS e- ట్రోన్ జీటీ



ఫాస్టెస్ట్ ఎలక్ట్రికల్ కార్లలో ఆడీ బ్రాండే వేరు. అయితే ఆడీ తీసుకువచ్చిన బ్రాండ్లలో ఈ కారే అత్యంత బరువైనది. దీని బరువు దాదాపు 2300 కేజీలు.



  • ఏక్సలరేషన్: 0-100 Km/hr: 3 సెకండ్స్

  • టాప్ స్పీడ్: 250 km/hr


2. పోర్షే టేకాన్ టర్బో S



జర్మన్ ఆటోమొబైల్స్ ద్వారా తయారైన ఈ కారు ఫాస్ట్ తో పాటు విశాలంగా ఉంటుంది. ముఖ్యంగా దీని ఛార్జింగ్ టెక్నాలజీ వాహన ప్రియులను ఆకట్టుకుంటుంది. 5 నిమిషాలు ఛార్జ్ చేస్తే 100కిమీ వరకు ప్రయాణం చేయొచ్చు.



  • ఏక్సలరేషన్: 0-100 Km/hr: 2.8 సెకండ్స్

  • టాప్ స్పీడ్: 260 km/hr


3. లోటస్ ఇవిజా ఈవీ హైపర్ కార్



ఇవిజా లిమిటెడ్ ఎడిషన్ ఎలక్ట్రికల్ స్పోర్ట్స్ కారు. దీన్ని బ్రిటిష్ ఆటోమేకర్ సంస్థ లోటస్ తయారు చేసింది. 



  • ఏక్సలరేషన్: 0-100 Km/hr: 3 సెకండ్స్

  • టాప్ స్పీడ్: 320 km/hr


4. టెస్లా మోడల్ S ప్లైయిడ్



అమెరికాకు చెందిన విద్యుత్ వాహన తయారీ సంస్థ టెస్లా తయారు చేసిన S ప్లైయిడ్ ట్రై మోటార్ తో ఉంటుంది. టాప్ స్పీడ్ లో పీక్ పవర్ ను మెయింటైన్ చేస్తుంది ఈ వాహనం.



  • ఏక్సలరేషన్: 0-100 Km/hr: 2.1 సెకండ్స్

  • టాప్ స్పీడ్: 322 km/hr


5. నియో EP9



చైనాకు చెందిన ఆటోమొబైల్ తయారీ సంస్థ నియో.. తయారు చేసిన ఈ కారు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైనదిగా సంస్థ చెబుతోంది. 



  • ఏక్సలరేషన్: 0-100 Km/hr: 1.9 సెకండ్స్

  • టాప్ స్పీడ్: 350 km/hr


6. పినిన్ ఫరినా బట్టిస్టా



ఇటాలియన్ కార్ మేకర్స్ తయారు చేసిన బట్టిస్టాను 2019 జెనీవా మోటార్ షో లో ప్రదర్శించారు. ఇది కూడా అత్యంత వేగవంతమైన కార్లలో ఒకటి. 



  • ఏక్సలరేషన్: 0-100 Km/hr: 2 సెకండ్స్

  • టాప్ స్పీడ్: 350 km/hr


7. స్పార్క్ ఓల్



ఈ కారును 2021 ఆటో షాంఘై ఈవెంట్ లో ప్రదర్శించారు. జపాన్ కార్ల తయారీ సంస్థ ఈ కారును తీసుకువచ్చింది. దీనిని ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ హైపర్ కారు గా చెబుతోంది.



  • ఏక్సలరేషన్: 0-100 Km/hr: 1.7 సెకండ్స్

  • టాప్ స్పీడ్: 400 km/hr


8. రిమాక్ నివేరా



క్రొయేటియన్ ఆటోమేకర్ తయారు చేసిన ఈ కారును ప్రపంచలోనే అత్యంత వేగవంతమైన కారుగా భావిస్తున్నారు.



  • ఏక్సలరేషన్: 0-100 Km/hr: 1.8 సెకండ్స్

  • టాప్ స్పీడ్: 412 km/hr