San Francisco: అక్కడ దర్జాగా దొంగతనాలు చేసేయొచ్చు

పది రూపాయల దొంగతనం చేస్తే.. రచ్చ రచ్చే కదా. ఏదైనా షాపుకి వెళ్లి  ఒక గుడ్డు దొంగతనం చేస్తే.. పది గుడ్ల డబ్బులైనా వసూలు చేస్తారు. కానీ వేల రూపాయల దొంగతనం చేసినా ఓ ప్లేస్ లో అస్సలు పట్టించుకోరు.

Continues below advertisement

అక్కడికెళ్తే.. దర్జాగా రూ.71 వేల రూపాయల వరకు ఎత్తుకెళ్లొచ్చు. సెక్యూరిటీ వాళ్లు చూస్తారు... నో ప్రాబ్లమ్. సీసీ టీవీలో రికార్డ్ అవుతుంది.. అయినా ఎవరూ పట్టించుకోరు. చూస్తూ ఉంటారంతే.. వెనక వెనక వచ్చి పరిగెత్తించుకుంటూ కొట్టడం.. పోలీసులకు ఫోన్ చేసి కుళ్లబొడిచేయండి అని చెప్పాడం ఉండదు. ఎందుకలా అనుకుంటున్నారా? అక్కడో చట్టం ఉంది. ఆ చట్టం పరిధిలోకి వచ్చే కాస్ట్‌లో ఏదైనా చోరీ చేసేయోచ్చు.. అడిగే వాడు ఉండడు. ఓ సారీ చదివేయండి.. ఎక్కడ? ఎందుకలా? అని..  

Continues below advertisement

అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో. ప్రముఖ వాల్ గ్రీన్స్ రిటైల్ స్టోర్. ముసుగేసుకుని ఓ వ్యక్తి వచ్చాడు. ఏదో కారు.. బైక్ కాదు.. జస్ట్ సైకిల్ పైనే. భూజన ఓ పాలథిన్ కవర్ పట్టుకుని షాపులోకి వెళ్లాడు. తనకు కావాల్సిన వస్తువులను బ్యాగులో వేసుకున్నాడు. ఏదో డబ్బులు పెట్టి కొన్నట్లు దర్జాగా బయటకు వచ్చాడు. మళ్లీ అదే సైకిల్ మీద ఎక్కి.. హాయిగా వెళ్లాడు. ఈ తతంగం అంతా.. భద్రతా సిబ్బంది చూశారు. అయినా అడ్డుకోలేదు... ఇదంతా సీటీ టీవీలో రికార్డ్ అయింది. అయినా పోలీసులకు చెప్పలేదు. దానికి సంబంధించిన సీసీ టీవీ వీడియో వైరల్ అయింది.

అసలు ఎందుకలా...?
అసలు విషయం ఏంటంటే.. శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో చిన్న దొంగతనాలను పట్టించుకోరు. నిజం చెప్పాలంటే. చూసీ చూడనట్లు వదిలేస్తారు. 2014లో ప్రొపొజిషన్ 47 అనే వివాదస్పద చట్టం తీసుకొచ్చారు. ఈ లెక్కన..  950 డాలర్ల లోపు అంటే.. రూ.71 వేలు విలువైన వస్తువులను దొంగిలించడం అరెస్టు చేయదగిన నేరం కాదు అక్కడ. ఇలాంటి చోరీలు వాల్ గ్రీన్స్ షాపుల్లోనే 4 నెలల్లో 18 జరిగాయంట. ఈ దెబ్బకు వాల్ గ్రీన్స్ సంస్థ, శాన్ ఫ్రాన్సిస్కోలోని 17 షాపులను మూసివేసింది.

చిన్న చిన్న దొంగతనాలను నేరంగా పరిగణించరని అక్కడి వారికి తెలుసు.. ఇలాంటివాటిని డీక్రిమినలైజ్ చేసేశారు. ఒకవేల లిమిట్ దాటి.. దొంగతనం చేస్తే మాత్రం అది నేరమే అవుతుంది. అలా లిమిట్‌లోపు చోరీ చేసి వెళ్లిపోతున్న వీడియోలు మనం చాలా చూడొచ్చు. ఓపెన్ గా చేసే ఈ చోరీలు చూస్తే ఆశ్చర్యమేస్తుంది. షాపుల యజమానులు మాత్రం లబోదిబో మంటున్నారు. ఇలా స్టోర్లు ఖాళీ చేస్తే మా పరిస్థితి ఏంటన్నది వారి మాట. ఒక్కసారిగా అయిదారుగురో లేదా అంతకంటే ఎక్కువమందో తమ స్టోర్స్ లోకి చొరబడి ఇలా చేస్తే క్షణాల్లో తమ షాపులు మాయం అయిపోతాయేమోనని భయపడుతున్నారు. తరచూ ఇలా దొంగతనాలు చేసేవారికి మాత్రం ఇది పండగే. హాయిగా ఓనర్ల ముందే దొంగతనం చేసి వెళ్లొచ్చు.

Continues below advertisement
Sponsored Links by Taboola