Tata Stryder Zeeta Plus E: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ ట్రెండ్ క్రమంగా ఊపందుకుంటోంది. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతూ ఉండటంతో పాటు దాని వల్ల కలిగే కాలుష్యం కారణంగా ఇప్పుడు వినియోగదారులు ఎలక్ట్రిక్ సైకిళ్లను కూడా విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు.
దీంతో కంపెనీలు ఇప్పుడు కొత్త సైకిళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. టాటా స్ట్రైడర్ కొత్త ఎలక్ట్రిక్ సైకిల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. అదే టాటా స్ట్రైడర్ జీటా ప్లస్. ఇది ఒక బడ్జెట్ ఎలక్ట్రిక్ సైకిల్.
టాటా స్ట్రైడర్ జీటా ప్లస్ ధర
దీని ధర రూ.26,995 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఇది ప్రారంభ ధర మాత్రమే. ఈ ధరకు కేవలం కొద్ది మంది ప్రారంభ వినియోగదారులకు మాత్రమే దీన్ని విక్రయించనున్నారు. ఆ తర్వాత రూ. ఆరు వేలు పెంచనున్నట్లు కంపెనీ తెలిపింది. అధికారిక వెబ్ సైట్ నుంచి ఈ సైకిల్‌ను కొనుగోలు చేయవచ్చు.
టాటా స్ట్రైడర్ జీటా ప్లస్ ఫీచర్లు
ఈ సైకిల్‌లో కంపెనీ 250W బీఎల్డీసీ మోటారును ఉపయోగించింది. ఇది అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ పని చేయగలదు. ఈ సైకిల్‌లో 36V-6Ah బ్యాటరీ ప్యాక్ అందించారు. ఇది 216 డబ్ల్యూహెచ్ పవర్ అవుట్‌పుట్‌ను ఇస్తుంది.
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 30 కిలోమీటర్ల వరకు ఈ సైకిల్ ప్రయాణించగలదు. గంటకు 25 కిలోమీటర్లు దీని టాప్ స్పీడ్. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ సైకిల్‌లో డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లను అందించింది. దీని కారణంగా ఈ సైకిల్‌ను బాగా కంట్రోల్ చేయవచ్చు.
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial