Tata Motors Upcoming Cars: మీరు తక్కువ బడ్జెట్‌లో మంచి, సురక్షితమైన కారు కోసం చూస్తున్నట్లయితే ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉండవచ్చు. వాస్తవానికి టాటా మోటార్స్ ఈ ఏడాది రూ. 10 లక్షల కంటే తక్కువ ధరతో మూడు కొత్త కార్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కార్ల ప్రారంభ ధర రూ.5 నుంచి 6 లక్షల మధ్య ఉంటుంది. ఈ జాబితాలో కంపెనీ అత్యధికంగా విక్రయిస్తున్న టాటా పంచ్, టియాగో, టిగోర్ ఫేస్‌లిఫ్టెడ్ కార్లు కూడా ఉన్నాయి.

జనవరి 17వ తేదీ నుంచి ప్రారంభం అయ్యే ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో టాటా టియాగో, టిగోర్‌లను ఆవిష్కరించవచ్చు. కారు ధర ఎంత ఉండవచ్చు? ఫీచర్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ (Tata Punch Facelift)టాటా మోటార్స్ ఈ సంవత్సరం కొత్త అవతార్‌లో పంచ్‌ను విడుదల చేయనుంది. ఇది మైక్రో ఎస్‌యూవీ అవుతుంది. ఇది ఎలక్ట్రిక్ లాంటి డిజైన్‌ను కలిగి ఉంటుంది. కొత్త పంచ్‌కు అప్‌డేటెడ్ గ్రిల్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడీ డీఆర్ఎల్స్‌ను అందించవచ్చు. ఈ కొత్త ఎస్‌యూవీలో మీరు చాలా గొప్ప ఫీచర్లను పొందవచ్చని భావిస్తున్నారు.

ఈ కారులో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు వైర్‌లెస్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి అనేక ఫీచర్లు ఉంటాయి. అయితే దీని ఇంజన్‌లో ఎలాంటి మార్పులు జరగవు. సమాచారం ప్రకారం ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.6 లక్షల కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

Also Read: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!

టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ (Tata Tiago Facelift)టియాగో ఫేస్‌లిఫ్ట్ కూడా ఈ సంవత్సరం లాంచ్ కావచ్చు. దీని ఎక్స్‌టీరియర్ డిజైన్‌లో కొన్ని మార్పులు కనిపిస్తాయి. మీరు ఇందులో 5 సీట్ల ఆప్షన్‌ను పొందవచ్చని అంచనా. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్‌తో సహా అనేక ఫీచర్లు టియాగో ఫేస్‌లిఫ్ట్‌లో ఇస్తారని తెలుస్తోంది.

టాటా టిగోర్ ఫేస్‌లిఫ్ట్ (Tata Tigor Facelift)టాటా టియాగోతో పాటు, టిగోర్ ఫేస్‌లిఫ్ట్ కూడా ఈ సంవత్సరం లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఈ కారు ఆకర్షణీయమైన డిజైన్, అధునాతన ఫీచర్లతో పాటు అనేక అప్‌డేట్‌లను పొందవచ్చని తెలుస్తోంది. టాటా పంచ్ లాగానే ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర కూడా దాదాపు రూ.6 లక్షలుగా ఉండే అవకాశం ఉంది.

Also Read: రోజువారీ వాడకానికి బెస్ట్ బడ్జెట్ సీఎన్‌జీ కార్లు ఇవే - టాప్-3 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?