Tata Punch and Nexon EV Crash Test Rating: ప్ర‌యాణికుల సేఫ్టీ విష‌యంలో టాటా ఎప్పుడూ కాంప్ర‌మైజ్ అవ్వ‌దు. టాటా కార్లు సేఫ్టీకి మారుపేరు అని ఇప్ప‌టికే మార్కెట్ లో టాక్. అయితే, ఈ విష‌యం మ‌రోసారి నిరూపించింది టాటా కంపెనీ. సెప్టెంబ‌ర్ 2023లో లాంచ్ చేసిన టాటా నెక్సాన్ ఈవీ ఎస్ యూవీ మ‌రోసారి సేఫ్టీ టెస్ట్ లో 5 స్టార్ రేటింగ్ సంపాదించింది. గ్లోబల్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్స్ (GNCAP) లో కూడా ఈ కార్ కి 5స్టార్ రేటింగ్ వ‌చ్చింది. ఇదే వాహనాల భద్రతకు అందించే హయ్యెస్ట్ రేటింగ్. కారు భ‌ద్ర‌త‌ను ప‌రీక్షించిన భార‌త్ ఎన్ సీఏపీ(BNCAP) ఈ బండికి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చింది. పిల్ల‌లు, పెద్ద‌ల ఆక్యుపెన్సీకి ఇది సేఫ్ అని కితాబు ఇచ్చింది. 


భార‌త్ న్యూ కార్ అసెస్ మెంట్ ప్రోగ్రామ్ ని (BNCAP) మ‌న దేశంలో అక్టోబ‌ర్ 2023లో ప్రారంభించారు. ఆ ఏజ‌న్సీ టెస్ట్ చేసిన మొద‌టి ఈవీ టాటా నెక్సాన్. యూ రేంజ్ -టాంపింగ్ ఎంప‌వ‌ర్డ్ ప్ల‌స్ లాంగ్ రేంజ్ వేరియంట్ ని క్రాష్ టెస్ట్ చేసిన బీఎన్ సీఏపీ ఎస్ ఈ రిజ‌ల్ట్ ఇచ్చింది. మిగతా అన్నీ వేరియంట్ల‌కు కూడా ఇదే రేటు వ‌ర్తింస్తుంద‌ని చెప్పింది. 


స్కోర్ ఎంతంటే? 


టాటా నెక్సాన్ ఈవీ ఎస్ యూవీకి బీఎన్ సీఏపీ ఇచ్చిన స్కోర్ ఇలా ఉంది. ఈ కారు పెద్దల సేఫ్టీకి సంబంధించి 3 పాయింట్లకు గాను 29.86 పాయింట్లు సాధించింది. ఇక పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ విషయంలో 49 పాయింట్లకు 44.95 పాయింట్లు సాధించింది. ఈ స్కోర్లు 5-స్టార్ రేటింగ్స్‌ కిందికి వస్తాయి. 18 ఏళ్ల పిల్లల సేఫ్టీ విష‌యానికొస్తే.. 12 పాయింట్ల‌కు గాను నెక్సాన్ ఈవీకి 11.95 పాయింట్లు వ‌చ్చాయి. ఇక మూడేళ్ల పిల్ల‌ల విష‌యానికొస్తే 12 పాయింట్ల‌కు గాను 12 పాయింట్లు వ‌చ్చాయి. అయితే, త‌ల‌, ఛాతి, మెడ భాగంలో ఎలాంటి సేఫ్టీ ఇంపాక్ట్ ఉంటుందో మాత్రం BNCAP వెల్ల‌డించ‌లేదు. 


ఫ్రెంట్ ఇంపాక్ట్.. 


నెక్సాన్ ఎస్ యూవీ సైడ్ పోల్ ఇంపాక్ట్, ఫ్రంట్ ఇంపాక్ట్ టెస్ట్ లో కూడా మంచి స్కోర్ చేసింది. ఉదాహ‌ర‌ణ‌కు మ‌న‌కు యాక్సిడెంట్ అయిన‌ప్పుడు ముందు వెనుక కూర్చున్న వాళ్ల‌కి, డ్రైవ‌ర్ కి గాయాల‌య్యే ప్ర‌మాదం ఉంటుంది క‌దా. ఆ ప్ర‌మాదం నుంచి మ‌న‌ల్ని ఎంత‌మేర‌కు కాపాడ‌గ‌ల‌రో చేసేదే ఇంపాక్ట్ టెస్ట్. అలా ఫ్రెంట్ ఇంపాక్ట్ టెస్ట్ లో నెక్సాన్ 16 పాయింట్ల‌కు గాను.. 14.26 పాయింట్లు సాధించింది. అది కూడా గంట‌కు 64 కిలోమీట‌ర్ల వేగంలో, పెద్ద‌వాళ్లు ముందు సీట్ లో కూర్చున్న‌ప్పుడు. ప్యాసింజ‌ర్, డ్రైవ‌ర్ కి త‌ల‌, మెడకి మంచి ర‌క్ష‌ణ క‌లిపిస్తుంది. డ్రైవ‌ర్ ఛాతికి త‌గినంత ర‌క్ష‌ణ లేదు. ప్యాసింజ‌ర్ ఛాతికి మాత్రం మంచి ర‌క్ష‌ణ క‌ల్పిస్తున్నట్లుగా ఈ రేటింగ్ లో వెల్ల‌డించింది. డ్రైవ‌ర్ర‌, ప్ర‌యాణికుల తొడ‌లు, పెల్విక్ ప్రాంతానికి ర‌క్ష‌ణ అందించ‌డంతో నెక్సాన్ ఈవీ బాగున్న‌ట్లు తేలింది. టిబియాస్ ర‌క్ష‌ణ మాత్రం అంతంత మాత్రంగానే ఉంద‌ని ఈ క్రాష్ టెస్ట్ లో తేలింది. సైడ్ పోల్ ఇంపాక్ట్ లో కూడా దాదాపు అదే రిజ‌ల్ట్ వ‌చ్చింది. అయితే, సైడ్ పోల్ ఇంపాక్ట్ లో ఛాతి భాగానికి బాగా ర‌క్ష‌ణ ఉంద‌ని వెల్ల‌డించారు. 


ఫీచ‌ర్లు చూస్తే.. 


టాటా నెక్సాన్ ఈవీ స్టాండ‌ర్డ్ సేఫ్టీ టెక్నాల‌జీతో రూపొందించింది. కారుకి ఆరు ఎయిర్ బ్యాగ్స్, ఎల‌క్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), బ్రేక్ అస్టిస్ట్, రివ‌ర్సింగ్ క‌మెరా విత్ రేర్ పార్కింగ్ సెన్సార్ తో ఇచ్చారు. 360-డిగ్రీ వ్యూ సిస్టమ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, రేర్ డిస్క్ బ్రేక్స్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్ ఉన్నాయి. ఇక దీని ధ‌ర చూస్తే.. రూ.14.49 ల‌క్ష‌ల నుంచి రూ.19.49 ల‌క్షల (ex-showroom Delhi) మ‌ధ్య ఉంది. దీంట్లో రెండు బ్యాట‌రీ సైజులు అందుబాటులో ఉన్నాయి. నెక్సాన్ ఈవీ 30 kWh and 40.5 kWh.  


Also Read: ఆన్సర్ బ్యాక్ ఫీచర్‌‌తో వచ్చేసిన ‘యమహా ఫెసినో ఎస్’ న్యూ బైక్ - ఇంతకీ అది ఎలా పనిచేస్తుంది.. ధర ఎంత?