Yamaha Fascino S With Ansewr Back Feature: మార్కెట్ లో స్కూటీల హవా నడుస్తోంది. జండర్ తో సంబంధం లేకుండా ఎక్కువ శాతం స్కూటీనే ఎంచుకుంటున్నారు. ఇంట్లో వాళ్లకి, తమకి ఉపయోగపడుతుందని, ట్రాఫిక్ లో నడిపేందుకు సులభంగా ఉంటుందని ఆ ఆలోచన చేస్తున్నారు. దీంతో స్కూటీల అమ్మకాలు బాగా పెరిగిపోయాయి. అందుకే, ఆయా కంపెనీలు కొత్త కొత్ ఫీచర్స్ తో స్కూటీలను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నారు. సుజుకీ యాక్సిస్, యాక్టివా, జుపిటర్, వెస్పా ప్రస్తుతం ఉన్న స్కూటీల్లో ఇవి టాప్ అనే చెప్పాలి. చాలామంది వీటిని తీసుకునేందుకే ఇష్టపడుతుంటారు. అయితే, వాటికి పోటీగా యమహా వచ్చేస్తోంది. ఇప్పటికే మార్కెట్ లో ఉన్న ఫెసినో కి నెక్స్ట్ వెర్షన్ గా యమహా ఫెసినో ఎస్ మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు సరికొత్త కలర్లు, ఫీచర్స్ తో యూజర్సకి అందుబాటులోకి వచ్చింది. మరి ఫీచర్స్ ఏంటి? ధర ఎంత? ఒకసారి చూద్దామా?
'ఆన్సర్ బ్యాక్'..
ఫెసినో ఎస్ అందరికి అందుబాటులో ఉండేలా తీసుకొచ్చారు. తక్కువ రేట్ కి మంచి ఫీచర్స్ తో రిలీజ్ చేశారు ఈ ఎడిషన్ ని. ముఖ్యంగా దీంట్లోని 'ఆన్సర్ బ్యాక్' ఆప్షన్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఫీచర్ ద్వారా మన బండి ఎక్కడుందో ఈజీగా కనిపెట్టొచ్చు. యమహా యాప్ ద్వారా ఇది వర్క్ అవుతుంది. బండి ఎక్కడుందో వెతికేందుక యాప్‌ను ఓపెన్ చేసి.. ఫైండ్ మీద క్లిక్ చేస్తే చాలు.. బండి రెండు పార్కింగ్ లైట్లు వెలుగుతాయి. హారన్ కొన్ని సెకన్ల పాటు మోగుతుంది. దీంతో బండి ఎక్కడున్నా మనకు తెలుస్తుంది.
125 సీసీ..
ఈ బండి 125 సీసీ ఇంజిన్‌తో వస్తుంది. మొత్తం 99 కేజీలు వెయిట్ తో.. సీట్ కింద 21 లీటర్ల స్టోరేజ్ ఉంటుంది. దీనికి ఎల్ సీడీ ఇన్స్ ట్రూమెంట్ కన్సోల్, కాల్స్, మెసేజస్ అలర్ట్ కి బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. ఇది డ్రమ్, డిస్క్, ఎస్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
ధర..
ఎంట్రీ లెవెల్ డ్రమ్ రేటు రూ.79,900 (ex-showroom Delhi), డిస్క్ వేరియంట్ రూ. 91,130 (ex-showroom Delhi), ఎస్ వేరియంట్ రూ.93,730 (ex-showroom Delhi)గా ఉంది. దీంతో రెడ్, బ్లాక్, మ్యాటెడ్ డార్క్ బ్లూ రంగులు ఉన్నాయి. అయితే, మ్యాటెడ్ డార్క్ బ్లూ రంగు కావాలంటే రూ.94,530 పడుతుంది. ఈ బండికి ఆటోమెటిక్ స్టార్ట్ అండ్ స్టాప్ సిస్టమ్ (SSS), ట్రాఫిక్ రైడింగ్ మోడ్స్ కూడా ఉన్నాయి.
యమహా మోటర్ ఇండియా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ ఈషిన్ చిహానా ఈ బండి గురించి మాట్టాడుతూ.. “యమహా ఎప్పుడూ కస్టమర్ల అవసరాలు, వాళ్ల రైడ్ ఎక్స పీరియెన్స్ గురించి ఆలోచిస్తుంది. దాంట్లో భాగంగానే ఆన్సర్ బ్యాక్ ఆప్షన్ తీసుకొచ్చాం. ఫెసినో ఎస్ ని కచ్చితంగా ప్రతి ఒక్కరు ఆనందిస్తారు. ఇలానే ఇనోవేటివ్ గా మరిన్ని ఆవిష్కరణలు తెచ్చి ప్రజలకు అందిస్తాం అని అన్నారు”.
Also Read: మహీంద్రా బీఈ.05 ఎలక్ట్రిక్ కారు లాంచ్ త్వరలో - ఏఆర్ రెహమాన్ సౌండ్ డిజైన్‌తో!