Andhra Vidya kanuka kits : ఆంధ్రాలో రాజకీయం అంతా మారిపోయింది. రాజకీయ ప్రత్యర్థుల నీడ కూడా పడకూడదని భావించే పరిస్థితి నుంచి.. ఫోటోలు ఉన్నా పర్వాలేదు ప్రజాధనం వృధా కాకూడదనే నిర్ణయాలు తీసుకుంటున్నారు. జగన్ ప్రభుత్వం ప్రతి ఏడాది విద్యాకానుక పేరుతో విద్యార్థులకు కిట్లను పంపిణీ చేస్తుంది. ఇవన్నీ జగన్ బొమ్మలతో నిండి ఉంటాయి. ఎన్నికలు జరిగే నాటికే టెండర్లు ఇచ్చి రెడీ చేయించారు. లఇప్పుడు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం మరింది.అందుకే కొత్త సీఎం ఏమంటారో అని అధికారులు విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లరా ? వైఎస్ జగన్ వ్యూహం ఏమిటి ?
కిట్లు మొత్తం పంపిణీ చేయాలని చంద్రబాబు ఆదేశం
చంద్రబాబు ఏ మాత్రం ఆలోచించకుండా విద్యా కానుక కిట్లను త్వరితగతిన పంపిణీ చేయాలని ఆదేశించారు. స్కూల్ బ్యాగులపై పార్టీ గుర్తులు ఉన్నప్పటికీ వాటిని సైతం పంపిణీ చేయాలని ప్రజాధనం వృధా కాకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వం స్కూల్ బ్యాగులను పార్టీ రంగులతో ముద్రించినా వృథా చేయకుండా విద్యార్థులకు అందజేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. స్కల్స్ ప్రారంభం కావడంతో విద్యా కానుక ద్వారా అందాంచే కిట్లను ఎప్పటిలాగే విద్యా సంవత్సరం ప్రారంభం రోజే అందజేస్తున్నారు.
విద్యా కాను కిట్లలో అవినీతిపై విచారణ చేయించే అవకాశం
ప్రభుత్వం విద్యా కానుక కిట్ల కోసం రూ.700 కోట్లు ఖర్చు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలలో చదివే 36 లక్షల మంది విద్యార్థులకు విద్యా కానుక కిట్లు పంపిణీ చేయనున్నారు. కొంతకాలంగా కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం రోజే విద్యా కానుక కిట్లు అందజేస్తుండడంతో కొత్త ప్రభుత్వం కూడా అలానే పంపిణీ చేస్తుంది. ఈ టెండర్లలో అక్రమాలు జరిగాయని టీడీపీ తరచూ ఆరోపణలు చేస్తూ వస్తోంది. క్వాలిటీ లేనివి పంపిణీ చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటిపై టీడీపీ సర్కార్ విచారణకు ఆదేశించే అవకాశం ఉంది.
పవన్ కల్యాణ్ చదివింది పదో తరగతి- పుట్టింది చీరాలలో - ఇదిగో క్లారిటీ!
టీడీపీ హయాంలో రెడీ చేియంచిన ఆదరణ కిట్లు, ఆడపిల్లల సైకిళ్లను పంపిణీ చేయని జగన్ ప్రభుత్వం
మరో వైపు గతంలో టీడీపీ ఓడిపోయిన అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి.. ఆదరణ పథకం కింద బీసీలకు ఇచ్చే పని ముట్లు, విద్యార్థినులకు ఇచ్చే సైకిళ్లు ఇలా అన్నింటినీ మూలనపడేశారు. ప్రజా వేదిక వంటివి కూలగొట్టిన సంగతి చెప్పాల్సిన పని లేదు. దీనికి భిన్నంగా చంద్రబాబు ఒక్క రూపాయి కూడా ప్రజాదనం వృధా కాకూడదని పంపిణీ చేయాలని సూచిస్తున్నారు.