CM Chandrababu : ప్రభుత్వం మారడంతో ఆంధ్రప్రదేశ్ లో కొంత మంది అధికారులకు గడ్డు పరిస్థితులు తప్పేలా లేవు. జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్ చెప్పినట్లుగా చేసి టీడీపీ నేతల్ని తప్పుడు కేసుల్లో ఇరికించడంతో పాటు చంద్రబాబుపైనా కుట్రలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను కలిసేందుకు కూడా చంద్రబాబు అంగీరించడం లేదు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బాధ్యతలు చేపట్టేందుకు సచివాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌లు ఆయనను అభనదించేందుకు క్యూ కట్టారు. ఇలా వచ్చిన వారిలో కొంత మందిని  భద్రతా సిబ్బంది వెనక్కి పంపేశారు. 


ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, సునీల్ కుమార్ర వంటి వారు బోకేలతో చంద్రరబాబు వద్దకు  వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ వారి పేర్లకు ఆమోదం లేదని చెప్పడంతో నిరాశగా వెనుదిరిగారు. గతంలో టీడీపీ హయాంలో వీరు సిన్సియర్ అధికారులుగా పేరు తెచ్చుకున్నారు. చంద్రబాబుతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో వీరు.. టీడీపీకి వ్యతిరేకంగా జరిగిన రాజకీయ కుట్రల్లో భాగమయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. రవణా శాఖ కమిషనర్ గా.. ఇంటలిజెన్స్ చీఫ్ గా సీతారామాంజనేయులు టీడీపీ నేతల్ని వేధించడమే పనిగా పెట్టుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జేసీ కుటుంబ ట్రావెల్స్ వ్యాపారం ఆగిపోవడానికి.. కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకూ సీతారామాంజనేయులే కారణమని టీడీపీ నేతలు భావిస్తూ ఉంటారు. ఇక ఐజీ సునీల్ కుమార్ సీఐడీ చీఫ్ గా ఎంతో మంది టీడీపీ నేతల్ని అరెస్టు చేశారు. ఒక్కరిపై కూడా ఆధారాలు చూపించి చార్జిషీటు దాఖలు చేయలేదు.               


అలాగే కొంత మంది ఐఏఎస్ అదికారులు కూడా పరిధి దాటి వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు హయాంలో కీలక బాధ్యలు నిర్వర్తించిన అజయ్ జైన్ అనే అధికారి.. వైసీపీ హయాంలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ఆయనకు వ్యతిరేకంగా స్టేట్ మెంట్ ఇచ్చారు. తనను బెదిరించి ఇలాంటి స్టేట్ మెంట్ ఇప్పించారని తర్వాత ఆయన వివరణ ఇచ్చారని అంటున్నారు. అయితే బెదిరిస్తే.. ఏ తప్పు చేయని చంద్రబాబుకు వ్యతిరేకంగా స్టేట్ మెంట్ ఇస్తారా అన్న ఆగ్రహంఆయనపై  చంద్రబాబులో ఉందని అంటున్నారు. ఇక మరో ఐపీఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మికి కూడా చంద్రబాబు అపాయింట్ మెంట్ లభించలేదు.                           


జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక నిందితురాలు అయిన ఆమె చాలా కాలం జైల్లో ఉన్నారు. తర్వాత తెలంగాణ క్యాడర్ లో పనిచేశారు. జగన్ గెలిచిన తర్వాత ఏపీకి వచ్చారు. జగన్ మరోసారి గెలిచి ఉంటే చీఫ్ సెక్రటరీ పోస్టు వస్తుందని ఆమె అనుకున్నారు.అందుకే మున్సిపల్ శాఖ ఉన్నతాధికారిణిగా ఆమె అనేక రకాల తప్పుడు జీవోలు జారీ చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తూ ఉంటారు. రాజధాని రైతులకు కౌలు  కూడా రెండేళ్లుగా నిలిపివేశారని..కోర్టు ఉత్తర్వులు కూడా ధిక్కరించారని భావిస్తుంది. 


వీరితో పాటు నిబంధనలు ఉల్లంఘించిన  పలువురు అధికారులపై చర్యలు ఖాయమని.. టీడీపీ వర్గాలంటున్నాయి.