Andhra News :  ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై తెలుగుదేశం పార్టీ చాలా కాలంగా ఆరోపణలు చేస్తోంది. వైసీపీ హయాంలో లక్షల కోట్ల అప్పులు చేశారని అనేక సార్లు ఆరోపించారు. అసలైన వివరాలు బయట పెట్టడం లేదని గవర్నర్‌కు అనేక సార్లు ఫిర్యాదులు కూడా చేశారు. పదమూడు లక్షల కోట్ల అప్పులు చేశారని తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. అయితే ఇంత వరకూ పూర్తి వివరాలు మాత్రం వెల్లడి కాలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. పూర్తి స్థాయి లెక్కలను బయట పెట్టేందుకు సిద్దమయింది.  ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని అసెంబ్లీలో ప్రకటించే అవకాశం ఉంది. 


ఈ ఆర్థిక సంవత్సరంలోనే పాతిక వేల కోట్లకుపైగా అప్పు 


కొత్త ఆర్థిక సంవత్సరంలో ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఏపీ ప్రభుత్వం ప్రతీ వారం రెండు నుంచి నాలుగువేల కోట్ల వరకూ అప్పు తీసుకు వస్తోంది. యభై రోజుల్లోనే పాతిక వేల కోట్ల వరకూ తీసుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం మారింది. వైసీపీ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో చేసిన అప్పులపై కూటమి ప్రభుత్వం శ్వేత ప్రభుత్వం వెలువరించాలని ఇప్పటికే చంద్రబాబు నిర్ణయించారు. ఏడాదిలో పదకొండు నెలల పాటు ఓడీలో ఉండటం లాంటి తప్పుడు ఆర్థిక విధానాలను కూడా పాటించారు. వీటన్నింటికి చెక్ పెట్టాలనుకుంటున్నారు. 


టీడీపీ కేబినెట్‌లో కమ్మ సామాజికవర్గానికి ప్రాధాన్యత తగ్గిందా ? సీనియర్ నేతలకు పదవుల యోగం లేదా ?


ఆర్బీఐ కాకుండా బయట నుంచి లెక్క తెలియని అప్పులు


వైసీపీ హయాంంలో  ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులు, ఎక్కడి నుంచి ఎంతెంత తెచ్చారు? వాటిని ఏ పథకాలకు వినియోగించారు? వాటికి సంబంధించిన దస్త్రాలు, అప్పులకు సంబంధించిన వడ్డీలు...ఈ వివరాలన్నీ చాలా సీక్రెట్ గా ఉన్నాయి. ఆర్థిక శాఖలో ఈ ఐదేళ్లు రావత్, సత్యనారాయణ అనే ఇద్దరు అధికారులు చక్రం తిప్పారు. ఆయా శాఖలకు, పథకాలకు నిధుల విడుదల, కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు, పెండింగ్‌ బకాయిల విడుదల, కొత్త అప్పులు తేవడం వంటి బాధ్యతలన్నింటినీ వీరిద్దరే చక్కబెట్టారు. మిగతా వివరాలేమీ బయటకు రాలేదు.                                 


పవన్ కల్యాణ్‌ చదివింది పదో తరగతి- పుట్టింది చీరాలలో - ఇదిగో క్లారిటీ!


అప్పులు ఎలా తెచ్చారు.. ఎక్కడ ఖర్చు పెట్టారన్నది కీలకం !


ఆంధ్రప్రదేశ్‌ అప్పులు ఏకంగా రూ.13 లక్షల కోట్లకు చేరిపోయాయని   తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.   రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్లు, విలువైన ప్రభుత్వ భూములు, వివిధ సంస్థలను కూడా తనఖా పెట్టి వైసీపీ ప్రభుత్వం అప్పులు తెచ్చిందనే విమర్శలు ఉన్నాయి. అలాగే రాబోయే సంవత్సరాలకు సంబంధించి మద్యం ఆదాయాన్ని చూపి.. ఆ ఆదాయంపైనా అప్పులు తెచ్చారు. వీటి లెక్కలన్నీ బయటకు రావాల్సి ఉన్నాయి. శ్వేతపత్రం ద్వారా మొత్తం వివరాలను ప్రభుత్వం వెల్లడిస్తే వైసీపీ చేసిన నిర్వాకం తేలిపోతుందని టీడీపీ నేతలంటున్నారు.