Tata Punch Facelift Launch Soon: టాటా పంచ్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా మారింది. ఈ విజయం దృష్ట్యా, టాటా మోటార్స్ త్వరలో పంచ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. పంచ్ ఫేస్‌లిఫ్ట్ 2025లో వస్తుందని టాటా మోటార్స్ ఇంతకుముందు చెప్పింది. అంటే మరికొన్ని నెలల్లోనే ఈ కారు మన ముందుకు రానుందన్న మాట.


కొత్త డిజైన్, ఫీచర్లతో...
టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ కొత్త లుక్‌తో మార్కెట్లోకి రానుంది. నెక్సాన్, నెక్సాన్ ఈవీల్లో చూసినట్లుగా పంచ్ ఈవీకి సంబంధించిన కొన్ని డిజైన్ పరమైన మార్పులు కూడా ఇందులో చూడచవ్చు. కొత్త ఎల్ఈడీ డీఆర్ఎల్స్, కొత్త హెడ్‌లైట్లు, కొత్త బంపర్‌తో కొత్త పంచ్‌ను చూడవచ్చు. దీని లోపల డ్యాష్‌బోర్డ్ కోసం కొత్త అప్హోల్స్టరీ, అలాగే కొత్త కలర్ వేరియంట్‌లు కూడా ఉంటాయి.


టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్‌లో కొత్త ఫీచర్లను చేర్చే అవకాశం పుష్కలంగా ఉంది. ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే ఫీచర్‌ని కలిగి ఉండే పెద్ద 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ను పొందవచ్చు. ఇది మాత్రమే కాకుండా వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, సీ-టైప్ ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. కొత్త డిజైన్‌లో సెంటర్ కన్సోల్, వెనుక ఏసీ వెంట్‌లను కూడా చూడవచ్చు.


కొత్త వేరియంట్లు కూడా...
పంచ్ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్‌లు కూడా మారతాయని తెలుస్తోంది. ప్యూర్ రిథమ్, సన్‌రూఫ్, క్రియేటివ్ ఫ్లాగ్‌షిప్ వంటి పాత వేరియంట్‌లు ఇకపై అందుబాటులో ఉండవు. వీటిని కొత్త వేరియంట్లు భర్తీ చేయనున్నాయట. ప్యూర్ (వో), అడ్వెంచర్ ఎస్, అడ్వెంచర్ + ఎస్ అనే కొత్త వేరియంట్లు ఇందులో రానున్నాయని తెలుస్తోంది. ఇది మాత్రమే కాకుండా ఇప్పటికే ఉన్న వేరియంట్ల ఫీచర్లను కూడా మార్చవచ్చని సమాచారం.


Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే


పంచ్ ఇంజిన్‌లో మార్పు ఉంటుందా?
టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్‌లో మెకానికల్ ఛేంజెస్ ఏమీ ఉండకపోవచ్చు. అదే 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుందని సమాచారం. ఇది 86 హెచ్‌పీ పవర్‌ని, 113 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్‌ను కలిగి ఉంటుంది. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న పంచ్ మాదిరిగానే సీఎన్‌జీ వేరియంట్ కూడా ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో అందుబాటులో ఉంటుంది. సీఎన్‌జీతో ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్ కూడా ఉండవచ్చు.


పంచ్ ఫేస్‌లిఫ్ట్ వేటితో పోటీ పడుతుంది?
టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్... హ్యుందాయ్ ఎక్స్‌టర్, సిట్రోయెన్ సీ3, నిస్సాన్ మాగ్నైట్, రెనో కిగర్ లో ఎండ్ వేరియంట్‌లతో పోటీపడుతుంది. టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్‌తో కొత్త మోడల్‌ను మార్కెట్లో చూడవచ్చు. ప్రస్తుతం భారత మార్కెట్లో టాటాటా పంచ్ ఎక్స్-షోరూమ్ ధర రూ.6,12,900 నుంచి మొదలవుతుంది. అలాగే హై ఎండ్ వేరియంట్ ధర రూ.10.20 లక్షల వరకు ఉంది. త్వరలో లాంచ్ కానున్న టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ ధర ఎంత ఉంటుందో చూాడాలి మరి!


Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?