Tata Punch EV: భారతదేశంలోని కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్ ఒక్కసారిగా బూమ్‌లోకి వచ్చింది. ప్రజలు కార్లను కొనుగోలు చేయడాన్ని మార్చింది. ఇప్పుడు ఇండస్ట్రీ మరో మార్పును ఎంచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే దేశీయ మార్కెట్లో అతి చిన్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అయిన పంచ్ ఈవీతో టాటా మోటార్స్ ఈ విభాగంలో పెద్ద ఇన్నింగ్స్‌ను ప్రారంభించబోతోంది.


టాటా పంచ్ ఎలక్ట్రిక్ కాంపాక్ట్ ఎస్‌యూవీ జనవరి 17వ తేదీన విడుదల కానుంది. దీని బుకింగ్ ఇప్పటికే రూ. 21,000 టోకెన్ అమౌంట్‌తో ప్రారంభమైంది. ఇది స్మార్ట్, అడ్వెంచర్, ఎంపవర్డ్, ఎంపవర్డ్+ అనే నాలుగు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.


టాటా పంచ్ ఈవీ డిజైన్
కంపెనీ ఇప్పటికే ఈ కారును రివీల్ చేసింది. ఇది టాటా జెన్ 2 ఈవీ ఆర్కిటెక్చర్‌పై తయారయింది. ఇది డిజైన్ పరంగా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌ని పోలి ఉంటుంది. ముఖ్యంగా ముందువైపు పూర్తి వెడల్పు ఎల్ఈడీ లైట్ బార్‌తో కూడా వచ్చింది. బంపర్, గ్రిల్ డిజైన్ కూడా నెక్సాన్ తరహాలో ఉంది. ప్రత్యేక ఫీచర్ల గురించి చెప్పాలంటే... ఫ్రంట్ బంపర్‌లో స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్‌లైట్లు, వర్టికల్ స్ట్రెక్‌లతో కూడిన కొత్త దిగువ బంపర్, సిల్వర్ ఫాక్స్ స్కిడ్ ప్లేట్ ఉన్నాయి.


పంచ్ ఈవీ గురించి మరొక ప్రత్యేక విషయం ఏమిటంటే టాటా ఇందులో ఫ్రంట్ మౌంటెడ్ ఛార్జర్ అందించింది. అంటే కారును ముందు వైపు నుంచి ఛార్జ్ చేయవచ్చన్న మాట. ఈ ఛార్జింగ్ పోర్టును బ్రాండ్ లోగో కింద తెలివిగా హైడ్ చేశారు.


టాటా పంచ్ ఈవీ రేంజ్
కంపెనీ ఇంకా దీని ఇంజిన్ వివరాలను వెల్లడించలేదు. అయితే వీటిని స్టాండర్డ్, లాంగ్ రేంజ్ అనే రెండు వేరియంట్‌లలో అందించవచ్చని భావిస్తున్నారు. దీని పరిధి 300 నుంచి 375 కిలోమీటర్ల మధ్య ఉండవచ్చు.


టాటా పంచ్ ఈవీ అంచనా ధర
దేశీయ మార్కెట్లో టాటా పంచ్ ఈవీ సిట్రోయెన్ ఈసీ3తో పోటీపడుతుంది. అందువల్ల దీని ధర రూ.11-13 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా.


Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!