Tata Nexon On Rad Price Hyderabad: పది లక్ష రూపాయల్లో కారు కోసం చూస్తున్న వాళ్లకు టాటా నెక్సాన్ కూడా ఒక మంచి కారు. ఇది 9.62 లక్షల రూపాయల నుంచి 19.26 లక్షల రూపాయల మధ్య మొత్తం 49 వేరియెంట్స్‌లో ఈ కారు లభిస్తుంది.  

టాటా నెక్సాన్‌ను మొత్తంగా చెల్లించి తీసుకోవచ్చు. లేదా ఈఎంఐ ద్వారా కూడా తీసుకోవచ్చు. ఈఎంఐ ద్వారా తీసుకుంటే కొత్త అడ్నాన్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. హైదరాబాద్‌లో టాటా నెక్సాన్ కొనాలంటే ఎంత డౌన్‌పేమెంట్ చెల్లించాలి... నెలకు ఈఎంఐ ఎంత పడుతుందో ఇక్కడ చూద్దాం.

టాటా నెక్సాన్ బేసిక్ మోడల్‌ కారు ఎక్స్‌ షోరూమ్‌ ప్రైస్‌ 7,99,990 రూపాయలే. దీనికి ఇండివిడ్యువల్‌ రిజిస్ట్రేషన్ 1,16,999 దీనికి ఇన్సూరెన్స్‌ 43,465 రూపాయలు. ఇతర ఛార్జెస్‌ రెండు వేల రూపాయలు మొత్తంగా కలుపుకుంటే బేసిక్ మోడల్ కారు రోడ్డుపైకి వచ్చేసరికి 9 లక్షలు దాటిపోతుంది. 

Also Read: హైదరాబాద్‌లో కొత్త కియా సైరోస్ ప్రైస్‌ ఎంత? డౌన్ పేమెంట్, EMI లెక్కలేంటి?

టాటా నెక్సాన్ బేసిక్ మోడల్‌ తీసుకుంటే డౌన్ పేమెంట్ ఎంత?

ఈఎంఐలో బేసిక్ మోడల్‌ టాటా నెక్సాన్ తీసుకోవాలంటే 2,42,463 డౌన్‌ పేమెంట్ చెల్లించాలి. ఇంత కంటే ఎక్కువ చెల్లిస్తే ఈఎంఐ రేటు తగ్గుతుంది. 2,42,463 డౌన్‌పేమెంట్ చెల్లిస్తే 7,19,991 రూపాయలు లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి 8 శాతం వడ్డీతో ఐదేళ్లకు లోన్ తీసుకుంటే నెలకు 14,598 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 

8శాతం వడ్డీతో 7,19,991 రూపాయలను 7 ఏళ్ల టెన్యూర్ వరకు తీసుకోవచ్చు. టెన్యూర్ ఆధారంగా నెలసరి ఈఎంఐ ఆధారపడి ఉంటుంది. వడ్డీ మారినా నెలసరి కట్టాల్సిన ఈఎంఐ కూడా మారిపోతుంది. 

  • 7 ఏళ్లకు లోన్ తీసుకుంటే నెలకు చెల్లించాల్సిన వడ్డీ రూ.11,221
  • 6 ఏళ్లకు లోన్ తీసుకుంటే నెలకు చెల్లించాల్సిన వడ్డీ రూ.12,623
  • 5 ఏళ్లకు లోన్ తీసుకుంటే నెలకు చెల్లించాల్సిన వడ్డీ రూ.14,598
  • 4 ఏళ్లకు లోన్ తీసుకుంటే నెలకు చెల్లించాల్సిన వడ్డీ రూ.17,577
  • 3 ఏళ్లకు లోన్ తీసుకుంటే నెలకు చెల్లించాల్సిన వడ్డీ రూ.22,561
  • 2 ఏళ్లకు లోన్ తీసుకుంటే నెలకు చెల్లించాల్సిన వడ్డీ రూ.32,563
  • 1 ఏళ్లకు లోన్ తీసుకుంటే నెలకు చెల్లించాల్సిన వడ్డీ రూ.62,630

టాటా నెక్సాన్ CNG రెడ్ డార్క్ ఫియర్‌లెస్+ PS, క్రియేటివ్+ PS , క్రియేటివ్+S లాంటి 49 వేరియంట్లలో అందుబాటులో ఉంది. నెక్సాన్, హారియర, సఫారీ  కొత్త బందీపూర్ ఎడిషన్‌లు భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2025లో ఆవిష్కరించారు. కర్ణాటకలోని బందీపూర్ నేషనల్ పార్క్‌కు అంకితం చేస్తూ ఆమోడల్ తీసుకొచ్చారు.  

ఆధునికమైన డిజైన్‌, ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌ కలిగి ఉన్న ఈ కారు ఫైవ్‌ స్టార్ రేటింగ్ కలిగి ఉంది. నెక్సాన్ పెట్రోల్/డీజిల్ వెర్షన్‌ల మాదిరిగానే CNG మోడల్ కూడా బూట్ స్పేస్‌ను కలిగి ఉంది. 113bhp/260Nm 1,497cc, నాలుగు సిలిండర్ల, టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉన్న కారు ఆరు-స్పీడ్ మాన్యువల్ లేదా ఆరు-స్పీడ్ AMT ట్రాన్స్‌మిషన్‌కు ఉపయోగపడుతుంది. ఇందులో ఎకో, సిటీ, స్పోర్ట్ డ్రైవ్ మోడ్‌లు కలిగి ఉంది. 

Also Read: టెస్లా ఇండియా వచ్చేసింది. డ్రైవింగ్ ఎలా ఉందో తెలుసా..?