Kia Syros on Down Payment and EMI: కియా మోటార్స్ సైరోస్ SUVని ఈ నెల మొదట్లో విడుదల చేసింది. 9 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరకు అందిస్తోంది. ఇప్పటికే ఈ SUV కోసం బుకింగ్ ప్రారంభించింది. బుకింగ్స్ ప్రారంభించిన మొదటి రోజే  5,500 బుకింగ్స్‌లో సంచలన సృష్టించింది. కియా సైరోస్ SUV డిజైన్‌లో ఒక విప్లవాత్మక ముందడుగుగా కియా భావిస్తోంది. ఇది ఒక ఉద్యమంగా అభివర్ణించింది. సొగసైన అవుట్‌ లుక్ నుంచి అత్యాధునిక హంగులతో ఉన్న ఇంటీరియర్‌ వరకు ప్రతి ఇంచ్‌ కూడా కొత్త తరం SUVలు ఎలా ఉండాలో చెబుతుందని పేర్కొంది. 


ఈఎంఐ ఆప్షన్ ద్వారా కొనాలనుకుంటే పూర్తి వివరాలు ఇక్కడ ఇస్తున్నాం. డౌన్‌ పేమెంట్‌ ఎంత చెల్లించాలి, నెలకు ఈఎంఐ ఎంత కట్టాలనే పూర్తి వివరాలు మీకు ఇక్కడ అందిస్తారు. అయితే 13 వేర్వేరు వేరియంట్లలో లభించే కియా సైరోస్ రూ. 10.77 నుంచి రూ. 21.94 లక్షల మధ్య ఖర్చు చేయాల్సి ఉంటుంది. 



కియా సైరోస్ ఆన్-రోడ్ ధర ఎంత? 
కియా సైరోస్ HTK, HTK (O) HTK ప్లస్, HTX మరియు HTX ప్లస్ (O) వేరియంట్లలో లభిస్తుంది. హైదరాబాద్‌లో దీని బేస్ వేరియంట్ ఆన్-రోడ్ ధర దాదాపు రూ. Rs. 10లక్షల 77 వేలు. ఇందులో దాదాపు లక్షన్నర వరకు రిజిస్ట్రేషన్ ఛార్జ్‌ ఉంది. ఇన్సూరెన్స్‌ మొత్తాన్ని 41వేలు కూడా ఉంది. 


సైరోస్‌కు EMI మొత్తం ఎంత అవుతుంది? 
మీరు సైరోస్ బేస్ వేరియంట్ కోసం రూ.1,76,559డౌన్ పేమెంట్ చేయాలి. ఇది మినిమమ్‌. అంతకు మించిన డబ్బులు కూడా మీరు డౌన్‌పేమెంట్ చేయవచ్చు. అలా చేస్తే మీకు లోన్ అమౌంట్ తగ్గుతుంది. దీంతో ఈఎంఐ భారం తగ్గించుకోవచ్చు. మినిమమ్‌ అమౌంట్‌ డౌన్‌ పేమెంట్ చేస్తే మిగిలిన 9 లక్షలను లోన్‌ రూపంలో తీసుకొవచ్చు. దీనికి 8 శాతం వడ్డీ రేటుతో కారు రుణం తీసుకుంటే, టెన్యూర్‌ ఆధారంగా ఈఎంఐ ఉంటుంది. 


కారు లోన్‌ టెన్యూర్‌ గరిష్టంగా ఏడేళ్లు. అంటే ఒక సంవత్సరం నుంచి ఏడేళ్లే వరకు ఎన్ని సంవత్సరాలకైనా కారు లోన్ తీసుకోవచ్చు. సాధారణంగా కారు కొనే వాళ్లు ఐదేళ్లకు మించి తీసుకోరు. మీరు కూడా ఐదేళ్లకు కారు లోను 9 లక్షలు తీసుకుంటే దాదాపు నెలకు రూ.18,248 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా నెల నెల చెల్లించే అమౌంట్‌లో మొదటి ఏడాది వరకు రూ. 66,488 వేలు వడ్డీకి పోతుంది. మిగిలిన రూ. 1,52,496 ప్రిన్సిపల్ అమౌంట్‌లో కట్ అవుతుంది. తర్వాత రెండో ఏడాదిలో 53,831 రూపాయలు వడ్డీగా కట్ అయితే 1,65,153 రుణంలో కట్ అవుతుంది. ఇది మూడో ఏడాది 40,124+1,78,860, నాల్గో ఏడాది 25,278+1,93,706గా, ఐదో ఏడాది రూ. 9,201 +2,09,783గా ఉంటుంది. 


Also Read: నెలకు రూ. 17 వేలు చెల్లిస్తే లగ్జరీ హ్యుందాయ్ క్రెటా మీ సొంతం!, డౌన్‌ పేమెంట్ ఎంతో తెలుసా?


ఇదే 9 లక్షల రుణం టెన్యూర్ మారిస్తే ఎంత ఈఎంఐ చెల్లించాలో ఇకక్కడ చూద్దాం... 



  • కారు లోను ఏడేళ్లకు తీసుకుంటే నెలకు చెల్లించాల్సిన ఈఎంఐ రూ.14,027

  • కారు లోను ఆరేళ్లకు తీసుకుంటే నెలకు చెల్లించాల్సిన ఈఎంఐ రూ.15,779

  • కారు లోను ఐదేళ్లకు తీసుకుంటే నెలకు చెల్లించాల్సిన ఈఎంఐ రూ.18,248 

  • కారు లోను నాలుగేళ్లకు తీసుకుంటే నెలకు చెల్లించాల్సిన ఈఎంఐ రూ.21,971

  • కారు లోను మూడేళ్లకు తీసుకుంటే నెలకు చెల్లించాల్సిన ఈఎంఐ రూ.28,202

  • కారు లోను రెండేళ్లకు తీసుకుంటే నెలకు చెల్లించాల్సిన ఈఎంఐ రూ.40,704

  • కారు లోను ఏడాదికి తీసుకుంటే నెలకు చెల్లించాల్సిన ఈఎంఐ రూ.78,289


ప్రధాన వేరియంట్ వారీగా ఆన్-రోడ్ ధర పరిశీలిస్తే... 



  • HTX 1.0 టర్బో 6MT : ₹16.20 లక్షలు

  • HTX 1.5 డీజిల్ 6MT : ₹17.48 లక్షలు

  • HTX 1.0 టర్బో 7DCT : ₹17.77 లక్షలు

  • HTX ప్లస్ 1.0 టర్బో 7DCT : ₹19.49 లక్షలు


ఆయల్ ట్యాంక్ మోడల్ ఆధారంగా ఆన్-రోడ్ ధర   



  • పెట్రోల్ : ₹10.64 లక్షల నుంచి ప్రారంభమవుతుంది

  • డీజిల్ : ₹13.48 లక్షల నుంచి ప్రారంభమవుతుంది


ట్రాన్స్మిషన్ ద్వారా ఆన్-రోడ్ ధర   



  • ఆటోమేటిక్ : ₹15.74 లక్షల నుంచి ప్రారంభమవుతుంది

  • మాన్యువల్ : ₹10.64 లక్షల నుంచి ప్రారంభమవుతుంది


కియా సైరోస్ ఫీచర్స్‌ 
కియా సైరోస్ 1.0-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌ కలిగి ఉంది. దీని 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 118bhp, 172Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కియా సైరోస్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ DCT ట్రాన్స్‌మిషన్‌తో అటాచ్ చేసి ఉంది.  


డీజిల్ పవర్‌ట్రెయిన్ కోసం, ఈ కారులో 1.5-లీటర్, 4-సిలిండర్ ఇంజిన్ అమర్చి ఉంది. ఈ ఇంజన్ 116 బిహెచ్‌పి పవర్, 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ప్రామాణిక మోడల్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ కలిగి ఉంది.  


Also Read: మారుతి ఎర్టిగా కొనాలంటే ఈఎంఐ ఎంత? డౌన్ పేమెంట్‌ ఎంత చెల్లించాలి?