Maruti Ertiga On Road Price In Hyderabad: మారుతి సుజుకి ఉత్పత్తి చేస్తున్న వివిధ కార్ల ధరలను పెంచూతూ నిర్ణయం తీసుకుంది. వివిధ మోడళ్ల ధరలను ఈ నెల నుంచి అమలులోకి తెస్తున్నట్టు ప్రకటించింది. ఎర్టిగా బేస్ LXi (O) వేరియంట్ కొనాలనుకుంటే ఇప్పుడు ఉన్న రేటు కంటే రూ.15,000 ఎక్కువ పెట్టి కొనాల్సి ఉంటుంది. అన్ని ఇతర వేరియంట్లపై కూడా పదివేలు చొప్పున పెంచుతూ మారుతి నిర్ణయం తీసుకుంది.
అయితే ఇప్పుడు మారుతి ఎర్టిగా కొనాలనుకుంటే ఎంత చెల్లించాలి. ఈఎంఐ పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. ఈ ఎర్టిగాలో చాలా వేరియంట్స్ ఉన్నాయి. ఇది ఒక స్మార్ట్ హైబ్రిడ్ కారు. ఈ కారులో 1462 సిసి ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ 6,000 rpm వద్ద 75.8 KW పవర్‌ను జనరేట్ చేస్తుంది. 4,400 rpm వద్ద 136.8 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మారుతి కారు 45 లీటర్ల ఆయిల్ ట్యాంక్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ 7-సీటర్ కారు పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో 20.51 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. పెట్రోల్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ 20.30 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. CNG మోడ్‌లో కిలోకు 26.11 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వగలదు.
ఈ ఎర్టిగా కారు LXi (O) వేరియట్ బేసిక్ ప్రైస్ 10.64 లక్షలు ఉంటుంది. ఈ కారును హైదరాబాద్‌లో కొనాలంటే ఎంత డౌన్ పేమెంట్ చెల్లించాలి. నెల నెలకు ఎంత ఈఎంఐ కట్టాలో ఇక్కడ చూద్దాం. ఈ కారు ఈ ఎంఐఐగా కొనాలంటే ముందుగా రెండు లక్షల రూపాయలు డౌన్‌పేమెంట్ చెల్లించాలి.
రెండు లక్ష రూపాయలు డౌన్ పేమెంట్ చెల్లించిన చెల్లించాల్సిన మిగతా 8,64,316 రూపాయలు లోన్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ లోన్ 8 శాతం వడ్డీతో ఏడేళ్లకు తీసుకుంటే నెలకు 13,471 రూపాయలు చెల్లించాలి. ఏడేళ్లకు 11,31,564 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. సంవత్సరాలు మారుతున్న నెల నెల చెల్లించాల్సిన ఈఎంఐ మారుతూ ఉంటుంది.
ఎన్ని సంవత్సరాలకు ఎంత ఈఎంఐ చెల్లించాలో ఇక్కడ చూడండి
SN No | మొత్తం టెన్యూర్ | నెలకు చెల్లించాల్సిన ఈఎంఐ |
1 | 7 ఏళ్లు | రూ. 13,471 |
2 | 6 ఏళ్లు | రూ. 15,154 |
3 | 5 ఏళ్లు | రూ. 17,525 |
4 | 4 ఏళ్లు | రూ. 21,100 |
5 | 3 ఏళ్లు | రూ. 27,084 |
6 | 2 ఏళ్లు | రూ. 39,090 |
ఎర్టిగా కొనేందుకు అనూకలమైన అంశాలు ఏంటంటే?
కారు లోపల స్పేస్ ఎక్కువ ఉంటుంది. సీట్ల మధ్య గ్యాప్ కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. డ్రైవింగ్ సౌలభ్యత కోసం మెరుగైన ఫీచర్స్ కలిగి ఉంది. ఫ్లాట్ రైడ్ క్వాలిటీ ఎంత దూరం ప్రయాణం చేసిన అలసట రాకుండా ఉంటుంది. థర్డ్ రో సీట్లు మడిచిన తర్వాత 550 లీటర్ల బూట్ స్పేస్ కలిసి వస్తుంది. కారు తక్కువ ఉండటం కూడా ఇంధన ఆదాకు, మైలేజ్‌కు కలిసి వచ్చే అంశం
ప్రతికూల అంశాలు ఏంటీ?
ఎర్టిగాకు GNCAP నుంచి ఒకే ఒక స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉండటం ఆలోచించదగ్గ విషయం. అన్ని సీట్లలో జనం కూర్చున్నప్పుడు బూట్ స్పేస్ తక్కువగా ఉంటుంది. క్యాబిన్ చుట్టూ ఉండే డిజైన్ క్వాలిటీ లేదనే విమర్శ ఉంది. పొడవైన వ్యక్తులు మూడో వరుసలో కూర్చోవలంటే మాత్రం ఇబ్బంది పడతారు. వీటిని పట్టించుకోకుంటే మాత్రం మధ్యతరగతి వాళ్లకు ఎర్టిగా మంచి ఎంపిగా చెప్పవచ్చు.
Also Read: నెలకు రూ. 17 వేలు చెల్లిస్తే లగ్జరీ హ్యుందాయ్ క్రెటా మీ సొంతం!, డౌన్ పేమెంట్ ఎంతో తెలుసా?