Hyderabad Hanuman Temple :పూజారి రంగరాజన్ పై దాడి..ఇప్పుడు శివ లింగం వెనుక మాంసం ముద్దలు - అసలేం జరుగుతోంది!

Hyderabad Temple: హైదరాబాద్ లో హనుమాన్ ఆలయంలో అపచారం జరిగింది. ఆలయంలో శివలింగం వెనుక మాంసం ముద్దలు కనిపించడంతో భక్తులు ఆందోళనకు దిగారు...

Continues below advertisement

Hyderabad Hanuman Temple : హైదరాబాద్ పరిధిలోని ఓ ఆలయంలో మాంసం ముద్దలు కనిపించడం కలకలం రేపుతోంది. భక్తుల నుంచి సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నగర పరిధిలో టప్పాచబుత్ర హనుమాన్ ఆలయంలో జరిగిందీ ఘటన. 

Continues below advertisement

నిత్య పూజలో భాగంగా ఫిబ్రవరి 12 బుధవారం ఉదయం ఆలయాన్ని తెరిచారు. అనంతరం పూజలు నిర్వహించేందుకు వచ్చిన భక్తులు శివ లింగం వెనుక మాంసం ముద్దలు చూసి అవాక్కయ్యారు. వెంటనే తేరుకుని ఆలయ పూజారికి, పోలీసులకు సమాచారం అందించారు. ఆలయం వద్దకు చేరుకున్న పోలీసులు ఘటనపై ఆరా తీస్తున్నారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న హిందూసంఘాల కార్యకర్తలు ఆలయానికి భారీగా చేరుకుని ఆందోళనకు దిగారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

Also Read: స్నానం ఎన్నిరకాలు.. నిత్యం చేసే స్నానానికి, దివ్య స్నానానికి ఏంటి వ్యత్యాసం!

ఆలయం పరిసర ప్రాంతం మొత్తం పోలీసులు,భక్తులు, హిందూ సంఘాలతో నిండిపోయాయి. ఎవరో కావాలనే ఇదంతా చేశారని భక్తులు ఆరోపిస్తున్నారు. కేవలం ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకే ఇలా చేశారని మండిపడుతున్నారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను చెక్ చేస్తున్నారు పోలీసులు. 

ఈ ఘటనపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్..కమిషనర్ ఈ కేసును ప్రత్యేకంగా చూడాలని కోరారు. పోలీసులపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, సీసీ ఫుటేజ్ పరిశీలించి ఇలాంటి ఘటనలకు పాల్పడినవారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.  

అయితే చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్ పై కొందరు వ్యక్తులు దాడి చేశారు. రామరాజ్యం స్థాపనకు మద్దతు ఇవ్వాలని కోరగా అందుకు నిరాకరించారు రంగరాజన్. ఆయనతో పాటూ కుమారుడిని సైతం కొట్టారు. ఈ ఘటన ఓ వైపు కొనసాగుతోంది లేటెస్ట్ గా శివలింగం వెనుక మాంసం ముద్దలు వెలుగుచూశాయ్. దీంతో అసలేం జరుగుతోందనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయ్..

Also Read:  ఒకటి 'మహా శ్మశానం' , మరొకటి 'మనో శ్మశానం' - ఈ క్షేత్రాల్లో అడుగుపెట్టాలంటే శివానుగ్రహం ఉండాల్సిందే!

భక్త కన్నప్ప పరమేశ్వరుడికి మాంసం నైవేద్యంగా సమర్పించాడు కదా..

నోటితో నీళ్లు తీసుకొచ్చి శివలింగంపై అభిషేకం చేశాడు

కాలిని శివలింగంపై పెట్టి..తన కన్ను తీసి అమర్చాడు..

తనని భక్త కన్నప్ప అన్నప్పుడు...ఇప్పుడు శివయ్యకి మాంసం పెడితే ఎందుకు తప్పుపడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయ్...

అయితే...

భక్తి - మూర్ఖత్వం ఈ రెండింటికీ వ్యత్యాసం తెలుసుకుంటే ఈ ప్రశ్న అడగరేమో..!

భక్త  కన్నప్పకి భక్తి తప్ప మరొకటి తెలియదు..తను ఏం చేసినా శివుడిపై భక్తితోనే చేశాడు. అమాయకత్వంతో శివుడిని ఇంటికి రమ్మని పిలిచి రాకపోవడంతో అలిగి అక్కడే ఉండిపోయి శివయ్యకు సపర్యలు చేశాడు. శివలింగం ఉన్న ప్రదేశాన్ని నిత్యం శుభ్రం చేశాడు. నోటితో నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చేశాడు. ఆ పక్కనే ఉన్న ఆకులను శివుడికి సమర్పించాడు..అవే బిల్వ పత్రాలు. వేటాడి తీసుకొచ్చిన మాంసాన్ని నైవేద్యంగా సమర్పించాడు. చివరకు కంట రక్తం కారుతుంటే తన కన్ను తీసి అమర్చాడు. 

ఇదంతా తిన్నడి అపరిమిత భక్తి మాత్రమే...అందులో ఎలాంటి మూర్ఖత్వం  లేదు...

కానీ..ఇప్పుడు జరిగిన చర్య కేవలం మూర్ఖత్వం కాక మరేంటి. సాధారణంగా మాంసాహారం తిన్న రోజున ఆలయానికి వెళ్లరు, ఆ రోజు కనీసం ప్రసాదం కూడా తీసుకోరు కొందరు. అలాంటిది నేరుగా పవిత్రమైన అలయంలోకి మాంసాహారాన్ని ఎలా తీసుకెళ్తారన్నదే హిందూ సంఘాల వాదన.

మాంసాహారాన్ని నైవేద్యంగా సమర్పించే ఆలయాలూ ఉన్నాయి..కానీ..ప్రతి ఆలయానికి కొన్ని నియమాలుంటాయి..భక్తులు వాటిని పాటించాలి. అధిగమిస్తే ఇలానే ఆందోళనలు జరుగుతాయ్...

Continues below advertisement