Osmania University CDE Admssions: హైదరాబాద్‌‌లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలోని ప్రొఫెసర్ జి.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (పీజీఆర్ఆర్సీడీఈ), వివిధ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు పీజీఆర్ఆర్‌సీడీఈ డైరెక్టర్ ప్రొఫెసర్ జీబీ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. యూజీసీ నిబంధనల మేరకు వివిధ కోర్సులకు ఏటా రెండు దఫాలుగా ప్రవేశాలు నిర్వహిస్తున్నామని.. అందులో భాగంగా రెండో దఫా మార్చి 31వ తేదీ వరకు ప్రవేశాలు నిర్వహిస్తామని ప్రకటించారు. 


72 కోర్సులు..
దూరవిద్య కేంద్రం పరిధిలో వివిధ పీజీ, యూజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులతో కలిపి మొత్తం 72  కోర్సులను అందిస్తున్నారు. కోర్సుల వివరాలు, నిబంధనలు, ఫీజు వివరాలు అధికారిక వెబ్‌సైట్‌‌లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు ఆన్‌లైన్ విధానంలో నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు 8886111690, 040-27097177, 040-27098350 నంబర్లలో సంప్రదించవచ్చు.


కోర్సుల వివరాలు..


1) డిగ్రీ కోర్సులు...


➥ బీఏ


➥ బీకామ్


➥ బీబీఏ


అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.


2) పీజీ కోర్సులు..


➥ ఎంబీఏ


➥ ఎంసీఏ


➥ ఎంఏ


➥ ఎంకామ్


➥ ఎంఎస్సీ


అర్హత: ఏదైనా డిగ్రీ. ఎంబీ, ఎంసీఏ కోర్సులకు టీఎస్ ఐసెట్/ఏపీ ఐసెట్-2023 ఉత్తీర్ణులై ఉండాలి.


3) అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సులు


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ముఖ్యమైన తేదీలు..


* ఫేజ్-1 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 31.03.2025.


Website 



మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..