By Somnath Chatterjee:

ఆటో  Enthusiast గా నేను  ఇప్పటికే చాలా కార్లు నడిపాను.  కానీ Tesla ను నడపడం అనేది పూర్తిగా పూర్తిగా వేరు.. అమెరికన్ ఈవీ మార్కెట్‌లో ఓ సంచలనంగా మారిన టెస్లాను ఇండియన్ రోడ్లపై నడపడం ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్‌లో లేని టెస్లాను.. విదేశాల నుంచి చాలా కొద్ది మంది ఇంపోర్ట్ చేసుకుని వాడుతున్నారు. అలాంటి ఓ కారును నడిపే అవకాశం వచ్చింది. లగ్జరీ ఈవీ కార్లతో పోలిస్తే.. టెస్లా డ్రైవింగ్ పూర్తిగా వేరే లెవల్‌లో ఉంది.

అదిరిపోయే ఫీచర్లు

తొందర్లోనే టెస్లా భారత్‌కు రావొచ్చు. ఆ కార్లు రోడ్లపైన తిరగొచ్చు. కానీ నాకు మాత్రం ఈ ఎక్స్‌పీరియెన్స్ చాలా బాగుంది. టెస్లా ఫీచర్లను వేరే కారుతో పోల్చడానికి కూడా కూడా లేదు. ఒక భారీ టచ్ స్క్రీన్ లో మనం ఊహించని ఫంక్షన్స్ అనేకం ఉన్నాయి. నేను డ్రైవ్ చేసిన మోడల్ X. ఇది టెస్లా సిరీస్‌లో హై అండ్ కాబట్టి ఫీచర్లు కూడా ఆ రేంజ్‌లోనే ఉన్నాయి. దీనికి ఉన్న పానారోమిక్ విండ్ స్క్రీన్‌ నుంచి చూస్తుంటే డ్రైవింగ్ చాలా ఆహ్లాదకరంగా ఉంది. దీనికి మన రెగ్యులర్‌ కార్లలాంటి కీ కాదు. దాని ఫంక్షనింగ్ కూడా పూర్తిగా డిఫరెంట్. ఈ టాప్ ఎండ్ మోడల్ పూర్తిగా ఇంపోర్ట్ చేసుకున్న కారు.

Performance ఓ రేంజ్‌లో ఉంది

ఎలక్ట్రిక్ కార్ అనగానే రేంజ్ ఉంటే పవర్ ఉండదు.. పవర్ ఉంటే రేంజ్ ఉండదు. కానీ Tesla  కంప్లీట్లీ పవర్ ప్యాక్. అద్భూతమైన రేంజ్, అదరగొట్టే పెర్‌ఫార్మెన్స్ రెండూ టెస్లా సొంతం. అందుకే ఈవీ మార్కెట్‌లో దానికి తిరుగులేదు. ఓ సూపర్ కార్ రేంజ్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొడుతుంది అది. ఇతర ఈవీలతో పోలిస్తే రేంజ్ కూడా ఎక్కువ. కారు ఇంటీరియర్స్‌, ఇంజిన్ పెర్‌ఫార్మెన్స్‌ తీసుకున్నప్పుడు.. ఇది కచ్చితంగా పోటీదారులకు టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. నేను డ్రైవ్ చేసిన Model X లుక్ కంప్లీట్లీ డిఫరెంట్. అది చిన్న క్యాబిన్, ఫాల్కన్ డోర్స్ ఉంటాయి,

ఇండియాకు వచ్చే కార్లు అవే

టెస్లాలో కొన్ని మోడల్స్ ఉన్నప్పటికీ.. ఇండియాకు ముందుగా Model 3 Model Y  వస్తాయనుకుంటున్నారు.  ఇవి వస్తే.. Mercedes-Benz, BYD, BMW EVలకు గట్టిపోటీనే ఉంటుంది. మిగతా కాంపిటీటర్స్‌తో పోలిస్తే.. డిజైన్ మినిమలిస్టిక్‌గా, ఫీచర్స్ ఫ్యూచరిస్టిక్‌గా ఉండటం టెస్లా అడ్వాంటేజ్  Model 3 , Y  ఇప్పటికే ప్రపంచంలోని వివిధ మార్కెట్లలో బెస్ట్ సెల్లింగ్ కార్లుగా నిలిచాయి. ఇండియా తప్ప మిగతా మార్కెట్లలో టెస్లా దూసుకెళ్తుంది. మరి ఇండియాలో వాటి ఫ్యూచర్ ఎలా ఉంటుందన్నది ఇప్పుడే పూర్తిగా చెప్పలేం. ఎందుకంటే ఇండియాలో బ్రాండ్, లగ్జరీ కన్నా ప్రైస్ నే ముందుగా చూస్తారు. కాంపిటీటర్స్‌తో పోలిస్తే.. టెస్లా ఖరీదు కాస్త ఎక్కువుగానే ఉండొచ్చు. మార్కెట్‌లోకి రాకముందు ఇప్పుడు తీసుకోవాలంటే.. పూర్తిగా దిగుమతి చేసుకోవాలి కాబట్టి  ఇంపోర్ట్ డ్యూటీలతో కలిపి  అసలు ధర 100శాతం  ఎక్కువుగా ఉండొచ్చు. ఇక లోకల్ టాక్సులు అదనంగా ఉంటాయి. ఆ రకంగా ప్రస్తుతానికి ఇవి అందరికీ అందుబాటులో లేవు అనుకోవలసిందే.

టెస్లా యూనిట్ను ఇండియాలో పెట్టడం గురించి చాలాసార్లు ప్రస్తావనకు వచ్చింది. ఎలాన్‌మస్క్ ఇండియాకు వచ్చినప్పుడల్లా ఈ చర్చ జరుగుతూనే ఉంటుంది. అయితే అవన్నీ ఇంకా కార్యరూపం దాల్చలేదు. త్వరలోనే టెస్లా ఇండియాకు వస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతానికైతే అతికొద్ది టెస్లా కార్లు ఇండియాలో అందుబాటులో ఉన్నాయి. వాటిలో టాప్ మోడల్‌ను డ్రైవ్ చేసే అవకాశం నాకు వచ్చింది.