Tata Nexon Offer: టాటా నెక్సాన్ ఏడో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని టాటా మోటార్స్ దాని వివిధ వేరియంట్‌లపై ప్రత్యేక తగ్గింపులను అందిస్తోంది. దీనిపై రూ. లక్ష వరకు తగ్గింపు లభించనుంది. ఈ ప్రత్యేక ఆఫర్ జూన్ 15వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.


టాటా నెక్సాన్ సెలబ్రేషన్ ఆఫర్
టాటా నెక్సాన్ లాంచ్ అయినప్పటి నుంచి భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీలలో ఒకటిగా ఉంది. ఇప్పటివరకు ఏడు లక్షల యూనిట్ల విక్రయాల మార్కును దాటింది. అయితే నెక్సాన్ అమ్మకాలు ఇటీవలి కాలంలో కాస్త క్షీణించాయి. గత రెండు నెలల్లో ఈ మోడల్ టాప్ 10 కార్ల జాబితాలో కూడా లేదు. ఇటీవల విడుదల చేసిన మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓకు పెరుగుతున్న ప్రజాదరణ దీనికి కారణమని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 


మీకు ఎంత డిస్కౌంట్ లభిస్తుంది?
తగ్గిపోతున్న అమ్మకాలను పెంచడానికి టాటా మోటార్స్ నెక్సాన్‌పై ఆకర్షణీయమైన తగ్గింపును అందించింది. ఈ ఆఫర్ కింద క్రియేటివ్ + ఎస్ వేరియంట్‌పై గరిష్టంగా రూ. 1 లక్ష తగ్గింపు లభిస్తుంది. దాని స్మార్ట్ వేరియంట్‌పై రూ. 16,000, స్మార్ట్+ పెట్రోల్‌ వేరియంట్‌పై రూ.20,000, స్మార్ట్+ ఎస్ వేరియంట్‌పై రూ.40,000, ప్యూర్ పెట్రోల్‌ వేరియంట్‌పై రూ.30,000, ప్యూర్ డీజిల్‌పై రూ.20,000, ప్యూర్ ఎస్ పెట్రోల్‌ వేరియంట్‌పై రూ.40,000, ప్యూర్ ఎస్ పెట్రోల్, డీజిల్ వేరియంట్‌లపై రూ.40,000 తగ్గింపు ఉంది.


క్రియేటివ్ పెట్రోల్/డీజిల్‌పై రూ.60,000, క్రియేటివ్ + పెట్రోల్/డీజిల్‌ వేరియంట్‌పై రూ.80,000, క్రియేటివ్+ ఎస్ పెట్రోల్/డీజిల్‌ వేరియంట్‌పై రూ. 1,00,000, ఫియర్‌లెస్ పెట్రోల్/డీజిల్‌ వేరియంట్లపై రూ.60,000, ఫియర్‌లెస్ పెట్రోల్/డీజిల్‌ వేరియంట్లపై రూ.60,000, ఫియర్‌లెస్ + పెట్రోల్/డీజిల్‌ వేరియంట్లపై, ఫియర్‌లెస్+ ఎస్ పెట్రోల్/డీజిల్‌ వేరియంట్లపై రూ.60,000 వరకు తగ్గింపు లభించనుంది.


Also Read: 2024 స్కోడా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ త్వరలో - ఫీచర్లు ఎలా ఉండనున్నాయి?


పనోరమిక్ సన్‌రూఫ్ త్వరలో...
టాటా మోటార్స్ తీసుకున్న ఈ వ్యూహాత్మక చర్య నెక్సాన్ అమ్మకాలను మెరుగుపరుస్తుందని, పోటీ ఉన్న ఎస్‌యూవీ మార్కెట్‌లో దాని స్థానాన్ని తిరిగి పొందుతుందని భావిస్తున్నారు. ఇది కాకుండా కార్లలో పనోరమిక్ సన్‌రూఫ్ అనేది భారతీయ ఆటోమోటివ్ మార్కెట్లో ప్రధాన ఆకర్షణగా మారినందున, టాటా నెక్సాన్ పనోరమిక్ సన్‌రూఫ్‌తో అప్‌డేట్ కానుంది.


టాటా నెక్సాన్ పవర్‌ట్రెయిన్
టాటా నెక్సాన్‌లోని ఇంజన్ ఆప్షన్లలో 120 పీఎస్, 170 ఎన్ఎం పీక్ టార్క్‌లను ఉత్పత్తి చేసే 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 115 పీఎస్, 260 ఎన్ఎం పీక్ టార్క్‌లను ఉత్పత్తి చేసే 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ ఉన్నాయి.






Also Read: మహీంద్రా బీఈ.05 ఎలక్ట్రిక్ కారు లాంచ్ త్వరలో - ఏఆర్ రెహమాన్ సౌండ్ డిజైన్‌తో!