Tata Motors CNG Cars: 2024 సంవత్సరం మొదటి ఆరు నెలల్లో టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో టాటా నెక్సాన్ చేరింది. ఇప్పుడు టాటా మోటార్స్ ఈ బ్లాక్‌బస్టర్ కారు సీఎన్‌జీ వేరియంట్‌ను విడుదల చేయడం ద్వారా ఈ కారు అమ్మకాలను మరింత పెంచాలనుకుంటోంది. సెప్టెంబర్‌లో టాటా నెక్సాన్ సీఎన్‌జీ మార్కెట్లో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ కొత్త వేరియంట్ లాంచ్‌తో కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో మోస్ట్ వెర్సటైల్ కారుగా టాటా నెక్సాన్ అవతరిస్తుంది.


ఏ విభాగంలో చూసినా కనిపించనున్న నెక్సాన్...
సీఎన్‌జీ వేరియంట్‌లో టాటా నెక్సాన్ లాంచ్ అయిన తర్వాత ఈ కారు అన్ని వేరియంట్‌ల్లో లభ్యమవుతుంది. టాటా నెక్సాన్ పెట్రోల్, డీజిల్ వేరియంట్‌లు ఇప్పటికే మార్కెట్‌లో ఉన్నాయి. దీని తరువాత ఎలక్ట్రిక్ వేరియంట్‌ను కూడా మార్కెట్లోకి తీసుకువచ్చారు. ఇప్పుడు మార్కెట్లో సీఎన్‌జీ ఆప్షన్‌ను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో టాటా నెక్సాన్ సీఎన్‌జీ లాంచ్ అయింది.


Also Read: మహీంద్రా థార్ 5 డోర్స్‌ వెర్షన్‌ ROXXలో అదిరిపోయే ఫీచర్ - సేల్స్ దుమ్ములేపాలని టార్గెట్


నెక్సాన్ సీఎన్‌జీ ప్రత్యేకత ఏమిటి?
టాటా నెక్సాన్ భారతదేశపు మొట్టమొదటి టర్బో పెట్రోల్ సీఎన్‌జీ వేరియంట్. ఈ కారులో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ రెవోట్రాన్ ఇంజన్‌ను అమర్చవచ్చు. ఇది ఈ విభాగంలో అత్యంత శక్తివంతమైన సీఎన్‌జీ వాహనంగా మారింది. ఈ కారు ఇంజన్‌తో 5 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఇవ్వవచ్చు. అదే సమయంలో టియాగో, టిగోర్ మాదిరిగానే, ఈ కారులో ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఫీచర్ కూడా అందించనున్నారు.


ఒకే ఈసీయూ సహాయంతో ఈ కారు ఇంజిన్‌ను సీఎన్‌జీ నుంచి పెట్రోల్‌గా, పెట్రోల్‌ నుంచి సీఎన్‌జీగా సులభంగా మార్చవచ్చు. టాటా మోటార్స్ తన కారులో ట్విన్ సిలిండర్ సీఎన్‌జీ ట్యాంక్‌ను అమర్చిన మొదటి కంపెనీగా నిలిచింది. ఇప్పుడు ఈ ఫీచర్ హ్యుందాయ్ కార్లలో కూడా అందుబాటులో ఉంది. ఇదే ఫీచర్‌ను టాటా నెక్సాన్‌లో కూడా చేర్చే అవకాశం ఉంది. టాటా మోటార్స్ తీసుకువచ్చిన ఈ కారు 230 లీటర్ల బూట్ స్పేస్ కలిగి ఉంటుంది. భారతీయ మార్కెట్లో టాటా నెక్సాన్ సీఎన్‌జీ వెర్షన్ మారుతి సుజుకి బ్రెజ్జాకు గట్టి పోటీని ఇవ్వనుంది.



Also Read: 4 లక్షల స్కూటర్లు వెనక్కి తీసుకుంటున్న సుజుకి- మీ దగ్గర ఉంటే వెంటనే షోరూమ్‌కి తీసుకెళ్లండి