Tata Nexon Facelift: కొత్త టాటా నెక్సాన్ ఇప్పుడు గతంలో కంటే ఎక్కువ ప్రజాదరణ పొందింది. దీన్ని భారీగా అప్‌డేట్ చేసిన కొత్త వెర్షన్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా నిలిచింది. డిసెంబర్‌లో టాటా నెక్సాన్ అత్యధికంగా 15,284 యూనిట్లు అమ్ముడుపోయింది. నంబర్ల పరంగా ఇది దేశంలో అమ్ముడు పోతున్న ప్రతి ఇతర కారును దాటేసిందన్న మాట.
కొత్త నెక్సాన్ గత ఏడాది నవంబర్‌లో కూడా 14,916 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇది 2022 నవంబర్‌తో పోలిస్తే పెరిగింది. ఈ కొత్త మోడల్‌ను లాంచ్ చేయడంతో దాని అమ్మకాలు కూడా విపరీతంగా పెరిగాయి. ఇందులో ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.
ఫీచర్లు ఎలా ఉన్నాయి?
ఇటీవల లాంచ్ అయిన కొత్త టాటా నెక్సాన్ పూర్తిగా కొత్త లుక్‌తో వస్తుంది. ఇది ఇతర టాటా కార్లకు కొత్త డిజైన్ థీమ్, దాని ఈవీ వెర్షన్ కూడా చాలా భిన్నంగా కనిపిస్తుంది. కొత్త నెక్సాన్ పెద్ద డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పెద్ద టచ్‌స్క్రీన్, 360 డిగ్రీ కెమెరా, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్, వాయిస్ అసిస్టెడ్ సన్‌రూఫ్, మరిన్ని ప్రీమియం ఫీచర్లతో సహా అనేక అదనపు ఫీచర్లతో వస్తుంది. ఇందులో స్టాండర్డ్‌గా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు కూడా ఉన్నాయి.
ఇంజిన్ ఎలా ఉంది?
అప్‌డేట్ చేసిన నెక్సాన్ ఈవీ ఇప్పుడు పెద్ద టచ్‌స్క్రీన్‌తో పాటు కొత్త బ్యాటరీ, మెరుగైన రేంజ్‌ను కలిగి ఉంది. ప్రామాణిక ఐసీఈ నెక్సాన్ 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్‌తో వస్తుంది. ఇటీవల అప్‌డేట్ చేసిన మోడల్‌లో ఏఎంటీ/మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు కొత్త డీసీటీ గేర్‌బాక్స్‌కు యాడ్ అయింది.
ఐసీఈ నెక్సాన్ ఎక్స్ షోరూమ్ ధరలు రూ. 8.10 లక్షల నుంచి ప్రారంభం అయి రూ. 15.5 లక్షలకు చేరుకోగా, ఈవీ వెర్షన్ ధర రూ. 14.7 లక్షల నుంచి రూ. 19.9 లక్షల మధ్య ఉంటుంది. పెరుగుతున్న నెక్సాన్ అమ్మకాలు, కస్టమర్లు ఎక్కువగా ఎస్‌యూవీల వైపు మొగ్గు చూపేలా చేస్తుంది.
మరోవైపు భారతదేశంలోని కాంపాక్ట్ ఎస్‌యూవీ మార్కెట్ ఒక్కసారిగా పెరిగింది. ప్రజలు కార్లను కొనుగోలు చేసే విధానాన్ని ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగం మార్చింది. ఇప్పుడు ఇండస్ట్రీ మరో మార్పు వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం మన భారతదేశ మార్కెట్లో అతి చిన్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అయిన పంచ్ ఈవీతో టాటా మోటార్స్ ఈ విభాగంలో కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించబోతోంది. టాటా పంచ్ ఎలక్ట్రిక్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మన దేశంలో జనవరి 17న విడుదల కానుంది. దీని బుకింగ్ ఇప్పటికే రూ. 21,000 టోకెన్ అమౌంట్‌తో స్టార్ట్ అయింది. ఇది స్మార్ట్, అడ్వెంచర్, ఎంపవర్డ్, ఎంపవర్డ్+ అనే నాలుగు వేరియంట్‌లలో మార్కెట్లోకి రానుంది.
Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!