Tata Motors Vehicle Price Hike: టాటా మోటార్స్ తన వాణిజ్య వాహనాల ధరలను మూడు శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త ధరలు అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ తెలిపింది. ఈ పెంపు మొత్తం కంపెనీ వాణిజ్య వాహనాల శ్రేణికి వర్తిస్తుంది.


టాటా మోటార్స్ ధరలు పెంచడానికి కారణం ఏమిటి?
కంపెనీ వాణిజ్య వాహనాల ఉత్పత్తి వ్యయం పెరుగుదల ప్రభావాన్ని తగ్గించేందుకు, టాటా మోటార్స్ వాణిజ్య వాహనాల ధరను పెంచుతున్నట్లు టాటా మోటార్స్ ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి కంపెనీ తన వాణిజ్య వాహనాల ధరలను ఐదు శాతం వరకు పెంచిన విషయం గుర్తుంచుకోవాలి.


ఈ సంవత్సరం టాటా మోటార్స్ వాహనాల ధరలలో ఇది మూడో పెరుగుదల. ఇంతకు ముందు పెరిగిన ఉత్పత్తి ఖర్చులను కవర్ చేయడానికి కంపెనీ ఈ ధరలను పెంచింది. కంపెనీ ఇంతకుముందు జనవరిలో తన వాహనాల ధరలను 1.2 శాతం పెంచింది. ఏప్రిల్‌లో ఐదు శాతం పెరుగుదలను అమలు చేసింది. ఇప్పుడు మరో మూడు శాతం పెరిగింది.


భారత్ స్టేజ్ 6 నియమాలు 2023 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. దాని రెండో దశ కింద దేశంలో రియల్ టైమ్ డ్రైవింగ్ ఎమిషన్ టెస్టింగ్ అమలు చేయడం వంటి మరింత కఠినమైన నియమాలు కూడా అమలు అవుతున్నాయి. ఇది వాహన తయారీదారులకు మరింత ఖర్చులను పెంచాయి.


టాటా కొత్త వాహనాల గురించి చెప్పాలంటే టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 2023 సెప్టెంబర్ నాటికి లాంచ్ కానుంది. ఇది ప్రస్తుత మోడల్ లాగా 30.2 కేడబ్ల్యూహెచ్, 40.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను పొందుతుందని అంచనా. వీటిలో మొదటి వేరియంట్ 312 కిలోమీటర్లు, రెండో వేరియంట్ 453 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుంది. దీని ప్రస్తుత మోడల్ అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కాంపాక్ట్ ఎస్‌యూవీల్లో ఒకటి. ఈ కొత్త మోడల్ కర్వ్ కాన్సెప్ట్ నుంచి ప్రేరణ పొందింది. అలాగే ఇది కొత్త డిజైన్‌తో వస్తుంది.


Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?


Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial