Electric Cars in India: టాటా కర్వ్ ఈవీ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ధర పరంగా ఈ కారు తన ప్రత్యర్థి కార్లకు గట్టి పోటీనిస్తోంది. టాటా కొత్త ఎలక్ట్రిక్ కారు నెక్సాన్ ఈవీకి కూడా కర్వ్ ఈవీ డైరెక్ట్‌గా కాంపిటీషన్ ఇవ్వనుంది. ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసేటప్పుడు ప్రజలు వాహనం రేంజ్, ధర గురించి తెలుసుకోవాలి. కర్వ్ ఈవీ మనదేశంలో లాంచ్ అయిన తర్వాత దాని రేంజ్, ధర వివరాలు కూడా బయటకు వచ్చాయి. కాబట్టి టాటా కంపెనీ నుంచే వచ్చిన రెండు ఎలక్ట్రిక్ కార్లు కర్వ్ ఈవీ, నెక్సాన్ ఈవీల మధ్య తేడా ఏంటో తెలుసుకుందాం.
దేని రేంజ్ ఎంత?
టాటా కర్వ్ ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. ఈ కారులోని 45 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ సింగిల్ ఛార్జింగ్‌తో 502 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. అదే సమయంలో టాటా కర్వ్ ఈవీ 55 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ 585 కిలోమీటర్ల రేంజ్‌ని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. నిజానికి టాటా లాంచ్ చేసిన ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు 400 నుంచి 450 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని ఆశించవచ్చు.
Also Read: 4 లక్షల స్కూటర్లు వెనక్కి తీసుకుంటున్న సుజుకి- మీ దగ్గర ఉంటే వెంటనే షోరూమ్‌కి తీసుకెళ్లండి
ఇక టాటా నెక్సాన్ ఈవీ 30 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఈ బ్యాటరీ ప్యాక్‌తో టాటా నెక్సాన్ ఈవీ సింగిల్ ఛార్జింగ్‌తో 325 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. టాటా నెక్సాన్ ఈవీలో మరో పవర్ ఫుల్ 40.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ కూడా ఉంది. ఇది సింగిల్ ఛార్జింగ్‌తో 465 కిమీల రేంజ్‌ను డెలివర్ చేస్తుంది.
దేని ధర తక్కువ?
టాటా కర్వ్ 45 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ధర రూ. 17.49 లక్షల నుంచి మొదలై రూ. 19.29 లక్షల వరకు ఉంటుంది. ఈ కారుకు సంబంధఇంచిన 55 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ధర 19.25 లక్షల నుంచి 21.99 లక్షల మధ్య ఉంచారు. టాటా నెక్సాన్ ఈవీ ఎక్స్ షోరూమ్ ధర రూ. 14.4 లక్షల నుంచి మొదలై రూ. 19.4 లక్షల వరకు ఉంటుంది.
దేని ఫీచర్లు ఎలా ఉన్నాయి?
టాటా రెండు ఎలక్ట్రిక్ వాహనాలు కర్వ్, నెక్సాన్ మధ్య చాలా పోలికలు ఉన్నాయి. ఈ రెండు ఎలక్ట్రిక్ కార్లు 12.3 అంగుళాల స్క్రీన్, వెంటిలేటెడ్ సీట్లు కలిగి ఉంటాయి. దీంతో పాటు ఈ వాహనాలలో 360 డిగ్రీ కెమెరా ఫీచర్ కూడా అందించారు. టాటా కర్వ్ ఈవీలో వేరే రకమైన షిఫ్టర్, ఫ్రంక్ ఉన్నాయి. ఇది నెక్సాన్ ఈవీలో లేదు.
కాబట్టి మీరు ధర మెయిన్ ఫ్యాక్టర్, కాస్త రేంజ్, మిగతా ఫీచర్లు తక్కువ ఉన్నా పర్వాలేదు అనుకుంటే టాటా నెక్సాన్ ఈవీ తీసుకోవచ్చు. ధర కాస్త అటూ ఇటయినా పర్లేదు. మంచి రేంజ్, లేటెస్ట్ ఫీచర్లు, డిఫరెంట్ లుక్ ఉన్న కారు కావాలనుకుంటే టాటా కర్వ్ ఈవీ వైపు మొగ్గు చూపడం బెటర్.
Also Read: మహీంద్రా థార్ 5 డోర్స్ వెర్షన్ ROXXలో అదిరిపోయే ఫీచర్ - సేల్స్ దుమ్ములేపాలని టార్గెట్