Tata Curvv EV: 2024లో టాటా.ఈవీ కంపెనీ కర్వ్ ఎస్‌యూవీ రూపంలో పెద్ద లాంచ్‌కు సిద్ధం అవుతోంది. టాటా కర్వ్ 4 మీటర్ ప్లస్ కాంపాక్ట్ ఎస్‌యూవీ స్పేస్‌లో పోటీపడుతుంది. హారియర్, నెక్సాన్ మధ్య స్థానంలో ఉంటుంది. మొదటగా కర్వ్ ఈవీ లాంచ్ అవుతుంది. దాని పెట్రోల్ వేరియంట్ తరువాత ఎంట్రీ ఇవ్వనుంది. జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2023లో దీన్ని మొదట ప్రదర్శించారు.


కర్వ్‌ను మిగతా ఎలక్ట్రిక్ కార్ల నుంచి ప్రత్యేకంగా చేసే ఒక పెద్ద విషయం దాని అద్భుతమైన రేంజ్. నెక్సాన్ ఈవీ కంటే కర్వ్ సింగిల్ ఛార్జ్‌తో ఎక్కువ దూరాన్ని కవర్ చేయగలదు. నెక్సాన్ ఈవీ లాగానే కర్వ్ ఈవీ కూడా ఎంఆర్ (మీడియం రేంజ్), ఎల్ఆర్ (లాంగ్ రేంజ్) వేరియంట్‌ల్లో అందుబాటులో ఉంటుంది. మీడియం రేంజ్ నెక్సాన్ 40.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో మార్కెట్లోకి వస్తుంది.


అలాగే లాంగ్ రేంజ్ 50 కేడబ్ల్యూహెచ్ లేదా అంతకంటే పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఇది 550 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తుంది. మీడియం రేంజ్ వేరియంట్ దాదాపు 460 కి.మీ పరిధిని ఇస్తుందని అంచనా. అయితే లాంగ్ రేంజ్ వేరియంట్లో కోసం ఈ రేంజ్ 500 లేదా 550 కిలోమీటర్ల వరకు ఉండవచ్చు. దీని అద్భుతమైన రేంజ్ కారణంగా ఈ ఎలక్ట్రిక్ కారు మారుతి ఈవీఎక్స్ వంటి రాబోయే ఈవీలతో సమానంగా నిలుస్తుంది. దీని పెరిగిన రేంజ్ కర్వ్ ఈవీకి ప్లస్ పాయింట్ అవుతుంది.


టాటా మోటార్స్ ఇటీవలే ఈవీ కోసం కొత్త షోరూమ్‌ను ప్రారంభించింది. కర్వ్ లాంచ్ దృష్ట్యా కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన స్పై షాట్స్‌ కూడా ఇటీవల లీక్ అయ్యాయి. నెక్సాన్ ఈవీ తరహా స్టైలింగ్ టచ్‌ కర్వ్‌లో కనిపిస్తుంది. ఇందులో ఫుల్ విడ్త్ డీఆర్ఎల్, కొన్ని కాన్సెప్ట్ టచ్‌లు కూడా ఉంటాయి. ఇవి కాన్సెప్ట్ కర్వ్‌లో చూడవచ్చు.


ఇంటీరియర్‌లు ఒకే స్క్రీన్, పెద్ద డిజిటల్ డయల్స్‌ను కలిగి ఉంటాయని భావిస్తున్నారు. ఇది కాకుండా 360 డిగ్రీ కెమెరా ప్లస్ ఏడీఏఎస్ వంటి ఫీచర్లను కూడా చూడవచ్చు. ఇవి ఇతర SUVలలో ప్రామాణిక ఫీచర్లుగా కనిపిస్తాయి. కర్వ్ ఈవీ లాంచ్ కొన్ని నెలల్లో ఉండే అవకాశం ఉంది.


మరోవైపు టాటా మోటార్స్ సరికొత్త వాహనాల తయారీలో దూసుకెళ్తోంది. పెట్రోలు వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలను కూడా మార్కెట్లోకి తీసుకొస్తోంది. టాటా మోటార్స్ అందిస్తున్న ఎలక్ట్రిక్​ వాహనాల పోర్ట్ ​ఫోలియోకు వినియోగదారుల నుంచి ఒక రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో టాటా సంస్థ ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. కేవలం ఎలక్ట్రిక్ వాహనాల కోసమే ఎక్స్‌​క్లూజివ్​ షోరూమ్‌​లను సైతం ఏర్పాటు చేస్తోంది.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply


Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!