Skoda Kylaq Scored 5 Star Rating: స్కోడా ఇండియా ఇటీవల భారతదేశంలో తన అత్యంత చవకైన ఎస్‌యూవీ స్కోడా కైలాక్‌ను విడుదల చేసింది. ఈ ఎస్‌యూవీ క్రాష్ టెస్ట్ లో 5 స్టార్లను సాధించింది. స్కోడా కైలాక్ పిల్లలు, పెద్దలు ఇద్దరికీ సురక్షితమైనది అని చెప్పవచ్చు. ఇండియా ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో పిల్లలు, పెద్దల భద్రత కోసం స్కోడా కైలాక్ కు 5-స్టార్ రేటింగ్ వచ్చింది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ అడల్ట్ ప్యాసింజర్ సేఫ్టీ కోసం 32కి 30.88 మార్కులు, పిల్లల భద్రత కోసం 49కి 45 స్కోర్ సాధించింది.

స్కోడా కైలాక్ ధర ఎంత?స్కోడా కైలాక్ రూ. 7.89 లక్షల ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ఈ కారు టాప్ వేరియంట్ ధర రూ. 14.4 లక్షల వరకు పెరుగుతుంది. ఈ కారు డెలివరీ 2025 జనవరి 27వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. మారుతి బ్రెజ్జా, టాటా నెక్సాన్, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో వంటి కార్లు కూడా స్కోడా కైలాక్ ధరల రేంజ్‌లోనే వస్తాయి. మారుతి సుజుకి బ్రెజ్జా ఎక్స్ షోరూమ్ ధర రూ. 8.34 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. టాటా నెక్సాన్ ధర రూ. 7.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో ఎక్స్ షోరూమ్ ధర రూ. 7.79 లక్షల నుంచి ప్రారంభమై రూ. 15.49 లక్షల వరకు ఉంటుంది.

Also Read: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!

స్కోడా కైలాక్ పవర్‌ట్రెయిన్స్కోడా లాంచ్ చేసిన ఈ కొత్త కారు పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్... ఇలా అన్ని వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. స్కోడా కైలాక్ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో మార్కెట్లోకి వచ్చింది. కారులోని ఈ ఇంజిన్ 113 బీహెచ్‌పీ పవర్‌ని ఇస్తుంది. 179 ఎన్ఎం టార్క్‌ను డెలివర్ చేస్తుంది. ఈ స్కోడా కారు ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్‌తో వస్తుంది. ఇదే ఇంజిన్ స్కోడా కుషాక్‌లో కూడా అందించారు.

స్కోడా కైలాక్ ఫీచర్లు ఎలా ఉన్నాయి?స్కోడా కైలాక్ మోడర్న్ డిజైన్‌తో వస్తుంది. ఈ కారులో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్‌ల్యాంప్‌లు ఉన్నాయి. ఈ కారులో డ్యూయల్ స్పోక్ మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ కూడా ఉన్నాయి. ఈ కారులో వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్‌లతో కూడిన 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఉంది. ఈ కారులో 446 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. దీనిని 1,265 లీటర్ల వరకు విస్తరించవచ్చు.

Also Read: రోజువారీ వాడకానికి బెస్ట్ బడ్జెట్ సీఎన్‌జీ కార్లు ఇవే - టాప్-3 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?