Skoda Kylaq Bookings: స్కోడా తన కొత్త కారును ఇటీవలే భారతదేశంలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. స్కోడా కైలాక్ బుకింగ్స్ డిసెంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభం అయ్యాయి. కారు మార్కెట్లో లాంచ్ అయి కేవలం పది రోజులే అయింది. ఈ కారు కోసం ఇప్పటికే 10 వేల యూనిట్ల బుకింగ్‌లు వచ్చాయని కంపెనీ అంటోంది. ఈ కొత్త సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీకి ఇంత ఎక్కువ డిమాండ్ రావడానికి కారణం ఈ కారు ధర. ఈ స్కోడా కారు బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్‌లో మార్కెట్లోకి విడుదల అయింది.


స్కోడా కైలాక్ ధర ఎంత?
స్కోడా కైలాక్ రూ.7.89 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్లో విడుదల అయింది. ఈ కారు టాప్ వేరియంట్ ధర రూ. 14.40 లక్షల వరకు ఉంది. కారు డెలివరీలు 2025 జనవరి 27వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. మారుతి బ్రెజ్జా, టాటా నెక్సాన్, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో వంటి కార్లు కూడా స్కోడా కైలాక్ ధర రేంజ్‌లోనే వస్తాయి.


Also Read: ప్రతి నెలా లక్షల్లో అమ్ముడుపోతున్న బైక్‌లు - ఇండియాలో టాప్-5 కంపెనీలు ఇవే!


మారుతి సుజుకి బ్రెజా ఎక్స్ షోరూమ్ ధర రూ. 8.34 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. టాటా నెక్సాన్ ధర రూ.7.99 లక్షల నుంచి మొదలవుతుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో ఎక్స్ షోరూమ్ ధర రూ. 7.79 లక్షల నుంచి మొదలై రూ. 15.49 లక్షల వరకు ఉంటుంది.


స్కోడా కైలాక్‌ ఇంజిన్ ఇదే...
స్కోడా లాంచ్ చేసిన ఈ కొత్త కారు పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ అన్ని వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. స్కోడా కైలాక్ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో మార్కెట్లోకి వచ్చింది. కారులోని ఈ ఇంజన్ 113 బీహెచ్‌పీ పవర్, 179 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ స్కోడా కారు ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్‌తో వస్తుంది. స్కోడా కుషాక్‌లో కూడా ఇదే ఇంజన్ అందించారు.


స్కోడా కైలాక్ ఫీచర్లు ఇవే...
స్కోడా కైలాక్ ఆధునిక సాలిడ్ డిజైన్‌తో వస్తుంది. ఈ కారులో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్‌ల్యాంప్‌లు ఉన్నాయి. డ్యూయల్ స్పోక్ మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ కూడా ఉన్నాయి. వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్‌లతో కూడిన 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఈ కారులో ఉంది. కారు 446 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంది. దీనిని 1,265 లీటర్ల వరకు పెంచవచ్చు.



Also Read: మహీంద్రా థార్‌పై భారీ ఆఫర్ - ఏకంగా రూ.మూడు లక్షల వరకు తగ్గింపు!