Car Tyre Tips: మీరు కారు ఉపయోగిస్తూ ఉంటే ఆ టైర్‌పై కొన్ని నంబర్లు, లెటర్లు కనిపిస్తాయి. వాటి ద్వారా ఆ టైర్ గురించి దాదాపు మొత్తం సమాచారాన్ని పొందవచ్చు. టైర్ సైడ్‌వాల్‌పై ఈ నంబర్లు కనిపిస్తాయి. ఇందులో చాలా కోడ్‌లు ఉన్నాయి. వాటిని చదవడం ద్వారా టైర్ గురించి వివరాలను పొందవచ్చు. ఈ సంఖ్యలను అర్థం చేసుకోవడానికి ఇక్కడ కోడ్ గురించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
టైర్ పరిమాణం
కారు టైర్‌పై P215/65 R16 95H అని రాసి ఉందనుకుందాం. ఇక్కడ మొదటి అక్షరం P అని రాసి ఉంది. అంటే ఈ టైర్ ప్యాసింజర్ వెహికిల్ కోసం తయారు చేశారన్న మాట. LT అని రాసి ఉంటే ఈ టైర్ తేలికపాటి ట్రక్కుల కోసం తయారు చేశారని అర్థం. ఇచ్చిన ఉదాహరణలో P తర్వాత 215 అని రాసి ఉంది. ఈ సంఖ్య సైడ్‌వాల్ నుంచి సైడ్‌వాల్ వరకు మిల్లీమీటర్‌లలో టైరు వెడల్పు.
ఎత్తు ఎంత?
పైన చెప్పిన సంఖ్యలో స్లాష్ తర్వాత సంఖ్య 65గా ఉంది. ఇది టైర్ రేషియో. ఇది టైర్ వెడల్పుకు సంబంధించి సైడ్‌వాల్ ఎత్తు శాతాన్ని చెబుతుంది. అంటే సైడ్‌వాల్ ఎత్తు టైర్ వెడల్పులో 65 శాతం అన్నమాట. ఎక్కువ సైడ్‌వాల్స్ ఉన్న టైర్లు రైడ్‌కు మరింత సౌకర్యవంతంగా ఉంటాయి. పైన చెప్పిన సంఖ్యలో R అంటే రేడియల్. కానీ దాని స్థానంలో B అని రాసినట్లయితే టైర్ బయాస్డ్ టైప్ అని అనుకోవాలి.
రిమ్ సైజు ఎంత?
టైర్ రిమ్ సైజు దానిపై రాసిన చివరి రెండు సంఖ్యల నుంచి తెలుస్తుంది. ఉదాహరణకు 15 అని రాశారు అంటే ఈ టైర్ 15 అంగుళాల వ్యాసం కలిగిన రిమ్ కోసం తయారు చేశారని అర్థం.
టైర్ స్పీడ్ రేటింగ్ ఎలా తెలుసుకోవాలి?
ఇది టైర్ స్పీడ్ రేటింగ్ ఇస్తుంది. H రేటెడ్ టైర్ గరిష్టంగా 210 kmph వేగంతో నడపవచ్చు. టైర్ల నుండి అత్యుత్తమ పనితీరును, వాహనం నుండి ఉత్తమ మైలేజీని పొందడానికి, టైర్లను సరిగ్గా చూసుకోవాలి. అందుకు సరైన నంబర్‌ను పీఎస్‌ఐ వెల్లడిస్తుంది. కారు టైర్లకు డైరెక్షనల్ యారోస్ కూడా ఉంటాయి. ఇది ముఖ్యమైనది కానీ తరచుగా పట్టించుకోని గుర్తు. ఇది టైర్ ఏ దిశలో తిరుగుతుందో తెలియజేస్తుంది. యూనిడైరెక్షనల్ టైర్‌లపై ఈ సింబల్ ఉంటుంది.
ప్రస్తుతం మనదేశంలో ప్రతి నెలా లక్షల కార్లు అమ్ముడవుతున్నాయి. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది కూడా. కొత్త కారు కొనుగోలుపై ఎక్స్-షోరూమ్ ధరతో పాటు వినియోగదారులు చాలా పన్నులు, ఇతర ఛార్జీలు చెల్లించాలి. కార్ల తయారీదారులు తమ అనేక మోడళ్లపై తరచుగా వివిధ రకాల ఆఫర్‌లను అందిస్తారు. వీటిని డీలర్‌షిప్‌లో కస్టమర్లకు ఎక్కువగా వెల్లడించరు. అటువంటి పరిస్థితిలో వాహనం కొనుగోలు చేయడానికి ముందు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి మీకు ఇష్టమైన కారుపై అందుబాటులో ఉన్న డిస్కౌంట్ ఆఫర్‌ను చెక్ చేసుకోండి.