Safest Cars In India: భారతదేశంలో ఎప్పటికప్పుడు అనేక కొత్త కార్లు మార్కెట్లోకి వస్తూనే ఉన్నాయి. కార్లలో సరికొత్త ఫీచర్లతో పాటు సేఫ్టీపై కార్ల తయారీ కంపెనీలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. నేటి కాలంలో ప్రజలు కారు కొనే ముందు ఫీచర్లతో పాటు సెక్యూరిటీ కూడా బాగుండాలని అనుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్న ఈ కార్లు ఎంత సురక్షితమైనవో, కార్ల సేఫ్టీ రేటింగ్‌ను తెలుసుకోవడం ద్వారా తెలుసుకోవచ్చు.


గ్లోబల్ ఎన్‌సీఏపీ నుంచి క్రాష్ టెస్ట్‌ల్లో కార్లు సెక్యూరిటీ రేటింగ్‌లను పొందుతాయి. ఇది వాహనాలకు సంబంధించిన అన్ని సేఫ్టీ ఫీచర్లను పరిశీలిస్తుంది. వాటి సేఫ్టీ లెవల్స్‌‌ను బట్టి రేటింగ్‌ను ఇస్తుంది. గ్లోబల్ ఎన్‌ఏపీ నుంచి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన కొన్ని కార్లు భారతదేశంలో కూడా అందుబాటులో ఉన్నాయి.



Also Read: సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకుంటున్నారా? - ఈ టిప్స్ పాటించకపోతే దెబ్బ అయిపోతారు!


టాటా మోటార్స్ కార్లు సూపర్ సేఫ్
గ్లోబల్ ఎన్‌సీఏపీ నుంచి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందిన అనేక టాటా మోటార్స్ కార్లు భారతదేశంలో ఉన్నాయి. ఈ జాబితాలో టాటా హారియర్, టాటా సఫారీ, టాటా నెక్సాన్, టాటా పంచ్, టాటా ఆల్ట్రోజ్ ఉన్నాయి. టాటా టిగోర్, టాటా టియాగో కూడా క్రాష్ టెస్ట్‌ల్లో 4 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందాయి. టాటా మోటార్స్ ఇటీవల కొత్త వెహికల్ కర్వ్‌ను విడుదల చేసింది. ఈ కారు గ్లోబల్ ఎన్‌సీఏపీ నుంచి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కూడా పొందింది.


ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన మహీంద్రా కార్లు
5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన వాహనాల జాబితాలో మహీంద్రా కార్లు కూడా ఉన్నాయి. మహీంద్రా ఎక్స్‌యూవీ700, ఎక్స్‌యూవీ300, స్కార్పియో ఎన్, మూడు వాహనాలు క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్‌ను పొందాయి. అదే సమయంలో మహీంద్రా అత్యంత ప్రజాదరణ పొందిన కారు థార్... గ్లోబల్ ఎన్‌సీఏపీ నుంచి క్రాష్ టెస్ట్‌లో 4 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది.


భారతీయ మార్కెట్లో ఉన్న అనేక ఇతర వాహనాలు కూడా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందాయి. ఈ వాహనాల జాబితాలో ఫోక్స్‌వ్యాగన్ వర్ట్యూస్, టిగన్ ఉన్నాయి. హ్యుందాయ్ వెర్నా గ్లోబల్ ఎన్‌సీఏపీ నుంచి 5 స్టార్‌లను కూడా అందుకుంది. స్కోడా స్లావియా, స్కోడా కుషాక్... ఈ రెండు కార్లు కూడా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందాయి.


సేఫ్‌గా ఉండే కార్లకు మనదేశంలో మంచి డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం మనదేశంలో చాలా కార్లలో తక్కువ ధరలోనే మంచి ఫీచర్లను అందిస్తున్నారు. త్వరలో ఇంకెన్ని కార్లు వస్తాయో చూడాల్సి ఉంటుంది.



Also Read: రెండు 650 సీసీ బైక్‌లు లాంచ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - ఇండియాని ఊపేయడం ఖాయం!