Royal Enfield Electric Bike: రాయల్ ఎన్‌ఫీల్డ్ తన హిమాలయన్ ఎలక్ట్రిక్ మోడల్‌తో ఎలక్ట్రిక్ బైకుల విభాగంలోకి కూడా ప్రవేశించడానికి సిద్ధం అవుతోంది. ఈ బైకును ఈఐసీఎంఏ షోలో కంపెనీ ప్రదర్శించింది. ఇది ఎలక్ట్రిక్ ప్రోటోటైప్. భవిష్యత్ మోడళ్లకు ఒక టెస్టింగ్ మ్యూల్ కానుంది.


ఈ ఎలక్ట్రిక్ హిమాలయన్ కాన్సెప్ట్ మోటార్‌సైకిల్ ఇన్ హౌస్ ఇంజిన్‌ను పొందుతుంది. అయితే బ్యాటరీ సైజు, రేంజ్ గురించి పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ ప్యాకేజింగ్‌పై కూడా విస్తృతంగా పనిచేసింది. అంటే ఈ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్‌లో ఆర్గానిక్ ఫ్లాక్స్ ఫైబర్ కాంపోజిట్ బాడీవర్క్ వంటి కొత్త మెటీరియల్‌ల అందించారు. దీంతో పాటు ఎలక్ట్రిక్ బైకులకు ప్రధానమైన బ్యాటరీని కూడా కంపెనీ స్వయంగా తయారు చేయనుంది.


బైక్ పెద్ద విండ్‌స్క్రీన్, ఎల్ఈడీ లైట్లతో కొత్త 452 హిమాలయన్‌ను పోలి ఉంటుంది. ఇది ప్రోటోటైప్ కాబట్టి ఎలక్ట్రిక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ అధికారికంగా లాంచ్ అవ్వడానికి ముందు చాలా పరీక్షలు జరుగుతాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ ఇప్పుడు డిస్‌ప్లే అయిన మోడల్ కంటే మార్కెట్లో లాంచ్ అయ్యే మోడల్ వేరుగా ఉండే అవకాశం ఉంది.


ఇది ఎలక్ట్రిక్ కాంపోనెంట్‌లతో టెస్టింగ్ మోడల్‌గా పనిచేస్తుంది. ప్రస్తుతానికి ఈ ఎలక్ట్రిక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ లాంచ్ టైమ్‌లైన్ గురించి ఎటువంటి వివరాలు షేర్ చేయలేదు. 2025 నాటికి మొదటి ఎలక్ట్రిక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ బైక్ టెస్టింగ్ కూడా ఇంకా చాలా వరకు జరగాల్సి ఉంది.


రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ తీసుకురావడం నిజంగా సాహసోపేతమైన చర్య అని చెప్పవచ్చు. ఈ బైక్ డిజైన్ క్లాసిక్ టచ్‌తో ఉండగా... ప్రివ్యూ మోడల్ విభిన్నంగా ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త హిమాలయన్ 452ని EICMA 2023 షోలో ప్రదర్శించింది. ఇందులో అనేక కొత్త అప్‌డేట్‌లు కూడా ఉన్నాయి.


మరోవైపు దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ ఈ మధ్యనే భారతదేశంలో తన కొత్త అప్‌డేటెడ్ టాటా సఫారీ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. దీని ధర రూ. 16.29 లక్షల నుంచి రూ. 27.34 లక్షల మధ్య ఉంది. ఇది ఎక్స్ షోరూమ్ ధర అన్నది గుర్తించాలి. ఈ కారు బుకింగ్ ఇప్పటికే ఓపెన్ అయింది. కొత్త టాటా సఫారీని కొనుగోలు చేయాలనుకునే ఏ కస్టమర్ అయినా సమీపంలోని డీలర్‌షిప్‌లో కొనుగోలు చేయవచ్చు లేదా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. దీని కోసం రూ. 25,000 బుకింగ్ అమౌంట్ చెల్లించాలి. టాటా ఇప్పటికే బుక్ చేసిన సఫారీ ఫేస్‌లిఫ్ట్ డెలివరీని కూడా ప్రారంభించింది. కొత్త టాటా సఫారీ... స్మార్ట్ (ఓ), ప్యూర్ (ఓ), అడ్వెంచర్, అడ్వెంచర్+, అడ్వెంచర్+ డార్క్, అకాంప్లిష్డ్, అకాప్లిష్డ్ డార్క్, అకాంప్లిష్డ్+ డార్క్, అడ్వెంచర్+ ఎ, అకాంప్లిష్డ్+ పేరున్న 10 ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది.


Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?


Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!