Royal Enfield Himalayan 450 Price Hike: 2023 నవంబర్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 అడ్వెంచర్ మోటార్‌సైకిల్ ధరలను ప్రకటించింది. మోటార్‌సైకిల్ మూడు ట్రిమ్ స్థాయిలలో మార్కెట్లోకి వచ్చింది. బేస్, పాస్, సమ్మిట్‌ వేరియంట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 2.69 లక్షల నుంచి రూ. 2.84 లక్షల మధ్య ఉండనుంది. ఇది ప్రారంభ ధర. ఇప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ ధరలు రూ. 16,000 పెరిగాయి.


రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 కొత్త ధరలు (Royal Enfield Himalayan 450 New Price)
ఎంట్రీ లెవల్ హిమాలయన్ 450 కాజా బ్రౌన్ పెయింట్ స్కీమ్ ధర ఇప్పుడు రూ. 16,000 పెరిగింది. ఇప్పుడు దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.2.69 లక్షల నుంచి రూ.2.85 లక్షలకు పెరిగింది. కంపెనీ స్లేట్ బ్లూ, సాల్ట్ వేరియంట్‌ల ధరలను రూ. 15,000 పెంచగా, ఇప్పుడు దాని ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.89 లక్షలుగా మారింది. హిమాలయన్ 450 కామెట్ వైట్, హెన్లీ బ్లాక్ ఎంపికల ధర ఇప్పుడు రూ. 14,000 పెరిగింది. కామెట్ వైట్ ధర ఇప్పుడు రూ. 2.93 లక్షలు కాగా, హాన్లీ బ్లాక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.98 లక్షలుగా ఉంది.


కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్‌లో కొత్త 451.65 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను అమర్చారు. దీనిని షెర్పా 450 అని పిలుస్తారు. ఈ సింగిల్ సిలిండర్ ఇంజన్. 8,000 ఆర్పీఎం వద్ద 40 బీహెచ్‌పీ పవర్‌ని, 5,500 ఆర్పీఎం వద్ద 40 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్‌తో 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో పెయిర్ అయింది. ఈ మోటార్‌సైకిల్ మూడు విభిన్న రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంది. వీటిలో ఎకో, పెర్ఫార్మెన్స్ (వెనుక ఏబీఎస్‌తో), పెర్ఫారెన్స్ (వెనుక ఏబీఎస్ విడదీసినవి) మోడ్స్ ఉన్నాయి.


కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 (Royal Enfield Himalayan 450)
కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 అడ్వెంచర్ మోటార్‌సైకిల్ ఓపెన్ కాట్రిడ్జ్ USD ఫ్రంట్ ఫోర్క్, ప్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ రియర్ సస్పెన్షన్‌తో పెయిర్ అయిన కొత్త ట్విన్ స్పార్ ఫ్రేమ్‌పై బేస్ అయి ఉంటుంది. మోటార్‌సైకిల్‌లో 21 అంగుళాల ఫ్రంట్, 17 అంగుళాల వైర్ స్పోక్ రిమ్‌లు ఉన్నాయి. ఇవి కస్టమ్ ట్యూబ్డ్ సియట్ టైర్‌లతో వస్తాయి.


మరోవైపు చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షావోమీ తన మొదటి ఎలక్ట్రిక్ కారును పరిచయం చేసింది. ప్రస్తుతం ప్రపంచంలోని టాప్ ఫైవ్ ఆటోమేకర్ల జాబితాలో చేరాలనే ఆకాంక్షను కూడా వ్యక్తం చేసింది. షావోమీ ఎస్‌యూ7 అనే సెడాన్ కారును ప్రపంచానికి పరిచయం చేసింది. షావోమీ ఎస్‌యూ7 సెడాన్ సంస్థ లాంచ్ చేస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మోడల్. అత్యంత ప్రజాదరణ పొందిన షావోమీ స్మార్ట్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఈ కారులో ఉపయోగించవచ్చని భావిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లలో ధరల విషయంలో కంపెనీ సాధారణంగా చాలా అగ్రెసివ్‌గా ఉంటుంది. మరి కార్ల విషయంలో ఎలా ఉంటుందో వేచి చూడాలి.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply


Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!