Renault Duster: ఫ్రెంచ్ ఆటోమొబైల్ తయారీదారు రెనో ప్రస్తుతం ట్రైబర్, కిగర్, క్విడ్ హ్యాచ్‌బ్యాక్‌లతో సహా మూడు ఎంట్రీ లెవల్ కార్లను భారతీయ మార్కెట్లో విక్రయిస్తోంది. అయితే రెనో దేశంలో ప్రస్తుతం ఉన్న లైనప్‌ను అప్‌గ్రేడ్ చేయడం కొనసాగిస్తుంది. కొత్త రెనో డస్టర్, కొత్త 7 సీటర్ SUV, కొత్త ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ కారుతో సహా అనేక కొత్త మోడళ్లను 2025 నుంచి విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది.


కొత్త రెనో డస్టర్
కొత్త డస్టర్ ఇటీవలే డాసియా నేమ్‌ప్లేట్‌తో గ్లోబల్ మార్కెట్‌లోకి ప్రవేశించింది. డాసియా లేని దేశాల్లో ఈ ఎస్‌యూవీ రెనో నేమ్‌ప్లేట్ కింద అందుబాటులో ఉంది. కొత్త ప్లాట్‌ఫారమ్, కొత్త డిజైన్, కొత్త పవర్‌ట్రెయిన్‌ల ఆధారంగా ఈ కొత్త మోడల్ రూపొందింది. 2024 చివరిలో మూడో తరం డస్టర్ ఎస్‌యూవీ భారతదేశంలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇది 2025 నాటికి దేశంలో విక్రయానికి అందుబాటులో ఉంటుంది. కొత్త రెనో డస్టర్ హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఫోక్స్‌వాగన్ టైగన్, స్కోడా కుషాక్‌, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, హోండా ఎలివేట్, ఎంజీ ఆస్టర్‌లతో పోటీపడుతుంది.


కొత్త ప్లాట్‌ఫారమ్, హైబ్రిడ్ ఇంజిన్‌
కొత్త తరం డస్టర్ రెనో, నిస్సాన్ అలయన్స్‌లో తయారైన CMF-B మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్‌పై రూపొందింది. ఈ నిర్మాణం ఐసీఈ, హైబ్రిడ్‌తో సహా విభిన్న బాడీ టైప్స్, ఇంజిన్ ఆప్షన్లను సపోర్ట్ చేస్తుంది. ఈ ప్లాట్‌ఫారమ్ ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌కు కూడా సపోర్ట్ చేయడం విశేషం. రెనో ఇండియాలో రూ.5,300 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. ఈ ఆర్కిటెక్చర్ రెనో మూడు వరుసల ఎస్‌యూవీ కోసం కూడా ఉపయోగపడుతుంది. టాటా సఫారీ, మహీంద్రా ఎక్స్‌యూవీ700, జీప్ మెరిడియన్, హ్యుందాయ్ అల్కజార్‌లకు పోటీగా ఉంటుంది.


కొత్త తరం రెనో డస్టర్ పవర్‌ట్రెయిన్
కొత్త డస్టర్ ఎస్‌యూవీతో పాటు రెనో తన ఇంధన సామర్థ్య హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను కూడా భారతదేశంలో లాంచ్ చేయనుంది. కొత్త తరం డాసియా డస్టర్ 3 పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో రానుంది. వాటిలో రెండు హైబ్రిడ్ టెక్నాలజీతో ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఇండియా స్పెక్ మోడల్ బలమైన హైబ్రిడ్ ఇంజిన్‌ను పొందే అవకాశం ఉంది. ఇది 94 హెచ్‌పీ, 1.6 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో 49 హెచ్‌పీ ఎలక్ట్రిక్ మోటారు, స్టార్టర్ జనరేటర్‌ను మిక్స్ చేస్తుంది. ఇది 1.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో రానుంది. రీజనరేటివ్ బ్రేకింగ్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది. ఈ ఎస్‌యూవీ సిటీ మోడ్‌లో 80 శాతం సమయం ఎలక్ట్రిక్‌లో మాత్రమే నడుస్తుంది.


2024 డేసియా డస్టర్
ఇది కొత్త టీసీఈ 130 ఇంజన్‌తో వస్తుంది. ఇది 48వీ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో 1.2 లీటర్ 3 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. ఇది 130 హెచ్‌పీ కంబైన్డ్ పవర్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఫ్రంట్ వీల్ డ్రైవ్ కలిగి ఉంది. ఈ మోడల్ ఆప్షనల్ ఆల్ వీల్ డ్రైవ్ లేఅవుట్‌తో కూడా అందుబాటులో ఉంది. ఇది ఏడబ్ల్యూడీ టెర్రైన్ మోడ్ సెలెక్టర్‌తో వస్తుంది. ఈ కారు నాలుగు డ్రైవింగ్ మోడ్‌లను కలిగి ఉంది. స్నో, మడ్/శాండ్, ఆఫ్ రోడ్, ఎకోలో రానుంది. ఈ ఎస్‌యూవీ గ్రౌండ్ క్లియరెన్స్ 217 మిల్లీమీటర్లుగా ఉంది.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply


Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!