Range Rover And Rolls Royce EMI Calculator: రోల్స్ రాయిస్ కార్లు ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ ఫీచర్లు కలిగిన కార్ల జాబితాలో ఉంటాయి. ఈ బ్రాండ్ కార్లు మన దేశంలో కూడా బాగా ప్రాచుర్యం పొందాయి. కానీ రోల్స్ రాయిస్ కొనడం అనేది సామాన్యుడు కలలో కూడా ఊహించలేని ఒక విషయం. అదే సమయంలో ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ కూడా భారతదేశంలో ప్రసిద్ధి చెందిన కారు. ప్రస్తుతం దేశంలో ఈ కారుకు చాలా డిమాండ్ ఉంది.
రేంజ్ రోవర్ ధర రోల్స్ రాయిస్ కంటే చాలా తక్కువ. కానీ రేంజ్ రోవర్ కొనడం కూడా సామాన్యుడికి కూడా కష్టం. ఎవరైనా ఈ కార్లను కొనుగోలు చేయాలనుకుంటే ఈ లగ్జరీ కార్లను కొంత డబ్బును డౌన్ పేమెంట్‌గా కట్టడం ద్వారా ఈఎంఐలో కొనుగోలు చేయవచ్చు.
రోల్స్ రాయిస్‌ను ఎలా కొనుగోలు చేయాలి?
రోల్స్ రాయిస్ కల్లినాన్ కొత్త మోడల్ ఇటీవలే భారత మార్కెట్లో లాంచ్ అయింది. భారతదేశంలో ఈ బ్రాండ్ విక్రయిస్తున్న అత్యంత ఖరీదైన కారు ఇదే. రోల్స్ రాయిస్ కల్లినాన్ ధర రూ.10.50 కోట్ల నుంచి మొదలై రూ.12.25 కోట్ల వరకు ఉంది. రోల్స్ రాయిస్ కల్లినాన్ కొనుగోలు చేయడానికి మీరు 10.85 కోట్ల రూపాయల రుణం తీసుకోవాలి. ఈ కారు లోన్‌పై బ్యాంకు వసూలు చేసే వడ్డీ రేటు ప్రకారం ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.
కల్లినన్‌ను కొనుగోలు చేయడానికి మీరు డౌన్‌పేమెంట్‌గా రూ. 1.20 కోట్లు డిపాజిట్ చేయాలి.
కారు రుణంపై బ్యాంకు తొమ్మిది శాతం వడ్డీని వసూలు చేసి నాలుగేళ్లపాటు బ్యాంకు నుంచి రుణం తీసుకుంటే మీరు ప్రతి నెలా రూ.27 లక్షలు ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది.
మీరు ఆరేళ్ల పాటు అదే లోన్ తీసుకుంటే ఈఎంఐ కింద నెలకు రూ.19.57 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.
Also Read: సింగిల్ ట్యాంక్ ఫుల్‌తో 1000 కిలోమీటర్లు నడిచే టాప్ 5 కార్లు - లిస్ట్‌లో ఏమేం ఉన్నాయి?
రేంజ్ రోవర్‌ని ఎలా కొనుగోలు చేయాలి?
భారత మార్కెట్లో రేంజ్ రోవర్‌కు సంబంధించి అనేక మోడల్స్ ఉన్నాయి. ఈ వాహనం 2.0 లీటర్ డైనమిక్ ఎస్ఈ డీజిల్ వేరియంట్ ఆన్ రోడ్ ధర రూ. 78.21 లక్షలుగా ఉంది. రేంజ్ రోవర్‌కు చెందిన ఈ వేరియంట్‌ను కొనుగోలు చేయడానికి మీరు రూ. 70.40 లక్షల రుణం తీసుకోవాలి.
రేంజ్ రోవర్ ఎవోక్‌ను కొనుగోలు చేయడానికి ఈ కారు ధరలో 10 శాతం అంటే రూ. 7.82 లక్షలను డౌన్ పేమెంట్‌గా బ్యాంకులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
మీరు నాలుగేళ్ల కాలవ్యవధితో, తొమ్మిది శాతం వడ్డీ రేటుతో రుణం తీసుకుంటే మీరు ప్రతి నెలా రూ.1.75 లక్షలు డిపాజిట్ చేయాలి.
మీరు ఈ రుణాన్ని ఆరేళ్ల కాలవ్యవధితో తీసుకుంటేమీరు ప్రతి నెలా రూ.1.27 లక్షలను చెల్లించాలి.
బ్యాంక్ పాలసీ, కారు రుణంపై వసూలు చేసే వడ్డీని బట్టి ఈ ధరలో కొంత వ్యత్యాసం ఉండవచ్చు. దీంతో పాటు బ్యాంకు నుంచి రుణం తీసుకోవడానికి మీ క్రెడిట్ స్కోర్ కూడా బాగుండాలి.
Also Read: రూ.10 లక్షల్లో బెస్ట్ సీఎన్‌జీ కార్లు ఇవే - ఆల్టో కే10 నుంచి పంచ్ వరకు!