పోర్షే మనదేశంలో రెండు కార్లను లాంచ్ చేసింది. వీటిలో ఒకటి కొత్త మకాన్ మిడ్‌సైజ్ ఎస్‌యూవీ కాగా, రెండోది టేకాన్ ఎలక్ట్రిక్ క్రాస్ టురిస్మో/స్పోర్ట్స్ సెడాన్. ఇందులో మకాన్ మనదేశంలో బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ. దానికి కొన్ని అప్‌గ్రేడ్స్ చేసి దీన్ని లాంచ్ చేశారు. ఇప్పుడు వచ్చిన మకాన్ రేంజ్‌లో మకాన్, మకాన్ ఎస్, మకాన్ జీటీఎస్ కార్లు ఉన్నాయి.
మకాన్ జీటీఎస్‌లో 195 కేడబ్ల్యూ టర్బో చార్జ్‌డ్ 4 సిలిండర్ ఇంజిన్ అందించారు. మకాన్ ఎస్‌లో 2.9 లీటర్ వీ6 డెవలపింగ్ 280 కేడబ్ల్యూ అయితే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 4.6 సెకన్లలోనే అందుకోగలదు. అన్నిటికంటే వేగవంతమైన మకాన్ జీటీఎస్‌లో 2.9 లీటర్ వీ6 ఇంజిన్ అందించారు. దీని టాప్ స్పీడ్ 272 కిలోమీటర్లుగా ఉంది. ఇందులో సెవన్ స్పీడ్, డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ ఫీచర్లు ఉన్నాయి. ఆల్ వీల్ డ్రైవ్ ఫీచర్ కూడా ఇందులో ఉంది.
దీని ఎక్స్‌టీరియర్‌లో కూడా పలు మార్పులు చేశారు. ఎల్ఈడీ హెడ్‌లైట్స్‌ను ఇందులో అందించారు. ఈ కొత్త మకాన్ ధర రూ.83.21 లక్షల నుంచి ప్రారంభం కానుంది. అయితే ముందు వెర్షన్‌తో పోలిస్తే మరింత స్టాండర్డ్ ఎక్విప్‌మెంట్‌ను ఇందులో అందించారు.
టేకాన్‌తో పాటు టేకాన్ క్రాస్ ట్యురిస్మోను కూడా లాంచ్ చేశారు. పోర్షే లాంచ్ చేసిన మొదటి ఎలక్ట్రిక్ కారు టేకాన్‌నే. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే 456 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవచ్చు. 93.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ కూడా ఇందులో ఉంది. ఇందులో మొత్తం నాలుగు టచ్ యూనిట్లు ఉన్నాయి. స్టాండర్డ్ వేరియంట్‌లో ఎయిర్ సస్పెన్షన్, బోస్ ఆడియో సిస్టం వంటి ఫీచర్లు అందించారు.
టేకాన్‌లో మరో వేరియంట్ కూడా లాంచ్ అయింది. ఇందులో 79.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని అందించారు. కేవలం 20 నిమిషాల్లోనే ఈ బ్యాటరీ 80 శాతం చార్జింగ్ ఎక్కుతుంది. స్టాండర్డ్ వేరియంట్ అయితే 80 శాతం చార్జ్ కావడానికి 1.5 గంటల సమయం పడుతుంది. ఇందులో టర్బో ఎస్ మోడల్ 2.9 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. దీని ధర రూ.1.5 కోట్ల నుంచి ప్రారంభం కానుంది.
Also Read: TVS Raider: కొత్త బైక్ వచ్చేసింది.. రూ.80 వేలలో బెస్ట్.. అదిరిపోయే లుక్, ఫీచర్లు!
Also Read: అదిరిపోయిన కొత్త సెలెరియో లుక్.. ఎలా ఉందో చూసేయండి!
Also Read: Car Comparision: 2021 టొయోటా ఫార్ట్యూనర్ వర్సెస్ ఎంజీ గ్లోస్టర్.. ఏది బెస్ట్ అంటే?