New Car Tips: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఆన్‌లైన్‌లో కొత్త కార్లను కొనుగోలు చేసే ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. ఇది డిజిటల్ షోరూమ్ లాంటిది. ఇక్కడ మీకు అనేక రకాల ఆప్షన్లు, ఆఫర్లు, డీల్స్ ఉన్నాయి. మీరు ఇకపై ఒక డీలర్‌షిప్ నుంచి మరొక డీలర్‌షిప్‌కు వెళ్లవలసిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో కారు కొనేటప్పుడు కొన్ని టిప్స్ పాటించాలి.


రీసెర్చి చాలా ముఖ్యం
ఆన్‌లైన్‌లో కొత్త కారును కొనుగోలు చేయడానికి చాలా పరిశోధన అవసరం. ఫీచర్లు, వేరియంట్లు, ధరలతో పాటు విస్తృత శ్రేణి మోడళ్లపై లోతైన సమాచారాన్ని అందించే అనేక ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి. ఇది మార్కెట్ ట్రెండ్‌లను అర్థం చేసుకోవడంలో, విభిన్న మోడల్‌లను కంపేర్ చేయడం, వివిధ కార్ల ధరలను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా యూజర్ రివ్యూలు, నిపుణుల అభిప్రాయాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఇది మెరుగైన నిర్ణయం తీసుకోవడంలో సహాయపడుతుంది.


ప్రాసెస్‌ను అర్థం చేసుకోవాలి
ఆన్‌లైన్‌లో కొత్త కారు కొనుగోలు ప్రక్రియను అర్థం చేసుకోవడం చాలా అవసరం. కార్ లోన్, వెహికల్ రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ వివరాలు, పేమెంట్ రూల్స్ వంటి అన్ని అవసరమైన డాక్యుమెంట్‌ల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రాథమిక విచారణ నుంచి డెలివరీ వరకు లావాదేవీలో ఉన్న దశలను అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ పరిజ్ఞానం కొనుగోలు ప్రక్రియను సులభతరం చేయడమే కాకుండా లూప్ హోల్స్ బారిన పడకుండా చేస్తుంది.


విశ్వసనీయ రిటైలర్లను ఎంచుకోండి
మీ ఆన్‌లైన్ కార్ షాపింగ్ విశ్వసనీయత మీరు ఎంచుకున్న రిటైలర్‌పై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అందువల్ల క్వాలిటీ చెక్, సరైన సమాచారం, కస్టమర్ సెంట్రిక్ పథకాల కోసం జనాదరణ పొందిన ప్లాట్‌ఫారమ్‌లను మాత్రమే ఎంచుకోండి.


నిపుణుల సలహాలు తీసుకోండి
ఆన్‌లైన్‌లో కొత్త కారును కొనుగోలు చేసే ప్రక్రియలో గందరగోళం ఏర్పడినప్పుడల్లా, ఆటోమొబైల్ నిపుణుల నుంచి సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. వారు మీకు కారు మోడల్, ఫైనాన్సింగ్ ఆప్షన్లు, వారంటీ నిబంధనలను బాగా వివరించగలరు. తద్వారా మీరు కొత్త కారును కొనుగోలు చేయడంలో సంతృప్తికరమైన, సురక్షితమైన అనుభవాన్ని పొందవచ్చు.


డీలర్‌షిప్ ఆఫర్‌లను కంపేర్ చేయండి
ఆన్‌లైన్‌లో కొత్త కారును కొనుగోలు చేసే ప్రక్రియలో ధర తగ్గింపులు, ఫైనాన్సింగ్, సర్వీస్, ఎక్స్‌టెండెడ్ వారంటీ, రాయితీలు, అదనపు యాక్సెసరీల సమాచారంతో సహా వివిధ డీలర్‌షిప్‌ల నుంచి ఆఫర్‌లను జాగ్రత్తగా సరిపోల్చండి. ఇది మీకు ఉత్తమ ఆప్షన్‌ను ఎంచుకోవడాన్ని సులభతరం చేస్తుంది.


బడ్జెట్ ముఖ్యం
కారును కొనుగోలు చేసే ముందు మీ అవసరాన్ని, బడ్జెట్‌ను నిర్ణయించుకోండి. ఆపై మీ బడ్జెట్‌కు అనుగుణంగా వివిధ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో కార్ మోడల్‌లు, వాటి స్పెసిఫికేషన్‌లను అర్థం చేసుకోండి. వాటిని మీ అవసరాలతో సరిపోల్చండి. దీని తర్వాత మాత్రమే ఖచ్చితమైన నిర్ణయం తీసుకోండి.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply


Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!