Nissan Gravite CNG Real Mileage: నిస్సాన్ గ్రావైట్ CNG ఇచ్చే నిజమైన మైలేజీ ఎంతో తెలుసా? నగరంలో కంటే హైవేపైనే మంచి ఫలితం వచ్చింది. వాస్తవ రోడ్లపై నిర్వహించిన పరీక్షలో ఈ కారు ఆకట్టుకునే ఇంధన సామర్థ్యాన్ని నమోదు చేసింది. నగరంలో 15.9km/kg మైలేజీ ఇచ్చింది. హైవేపై ఏకంగా 25.1km/kg మైలేజీ సాధించింది. రెండు పరిస్థితులను కలిపి చూస్తే సగటు మైలేజీ 20.5km/kgగా నమోదైంది.

Continues below advertisement

నిస్సాన్ గ్రావైట్‌ను 2026 ఫిబ్రవరిలో భారత మార్కెట్లో విడుదల చేశారు. మన దేశంలో అందుబాటులో ఉన్న చౌకైన మూడు వరుసల MPVల్లో ఇది కూడా ఒకటి. ఈ ఏడాది మే నుంచి గ్రావైట్‌కు డీలర్ స్థాయిలో CNG కిట్‌ను అందిస్తున్నారు. Motozen తయారు చేసిన ఈ కిట్‌కు ప్రభుత్వం & ICAT అనుమతులు ఉన్నాయి.

రూ.83,000 కే CNG కిట్ఈ CNG కిట్ ప్రారంభ ధర రూ.83,000గా ఉంది. CNG విడిభాగాలపై మూడేళ్లు లేదా 1,00,000km వరకు థర్డ్‌ పార్టీ వారంటీని అందిస్తున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. స్పేర్ వీల్‌ను బూట్‌ ఫ్లోర్ కింద అమర్చారు.

Continues below advertisement

గ్రావైట్ CNGలో 1.0 లీటర్, మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇదే ఇంజిన్‌ను రెనాల్ట్ ట్రైబర్‌లో కూడా ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజిన్‌కు 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. పెట్రోల్‌తో నడిచినప్పుడు ఇంజిన్ 72hp శక్తిని & 96Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇది కూడా చదవండి: ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?

అయితే CNGతో నడిచినప్పుడు ఇంజిన్ ఎంత శక్తిని ఉత్పత్తి చేస్తుందో నిస్సాన్ ఇంకా వెల్లడించలేదు. CNG మైలేజీకి సంబంధించిన గణాంకాలను కూడా ఈ కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు.

రెండు ట్యాంకులుగ్రావైట్‌లో రెండు CNG ట్యాంకులు ఉన్నాయి. వీటిని బూట్‌లో ఒకదానిపై ఒకటి నిలువుగా అమర్చారు. ఒక్కో ట్యాంక్ సామర్థ్యం 25 లీటర్లు. రోడ్‌ టెస్ట్‌లో.. ఖాళీ ట్యాంక్‌లో 7.7kg CNG నింపగలిగారు. అయితే ఈ పరిమాణం అన్ని సందర్భాల్లో ఒకేలా ఉండదు. CNG పంప్ వద్ద ఒత్తిడి & బయట ఉష్ణోగ్రతను బట్టి నింపే పరిమాణంలో మార్పు ఉండొచ్చు.

20.5km/kg సగటు మైలేజీని పరిగణనలోకి తీసుకుంటే.. పూర్తి CNG ట్యాంక్‌తో వాస్తవ పరిస్థితుల్లో సుమారు 150 నుంచి 160km వరకు ప్రయాణించవచ్చు.

మైలేజీ పరీక్షను సాధారణ పద్ధతిలో కాకుండా ప్రత్యేకంగా నిర్వహించారు. CNG ట్యాంక్‌ను పూర్తిగా ఖాళీ చేసి 2kg CNG నింపారు. అనంతరం నగర రోడ్లపై గ్యాస్ పూర్తయ్యే వరకు కారును నడిపారు. ఇదే విధానాన్ని హైవే పరీక్షలోనూ అనుసరించారు. రెండు పరీక్షల్లోనూ గ్రావైట్‌ను పూర్తిగా CNG మోడ్‌లోనే నడిపారు.

ఇది కూడా చదవండి: Maruti Victoris S-CNG.. రూ.1 లక్ష ఎక్కువైనా ఎందుకు కొనాలి? మైలేజీతో లెక్క మారిపోతుంది!

పరీక్షకు ముందు, కంపెనీ సూచించిన స్థాయిలో టైర్లలో గాలి ఒత్తిడి ఉండేలా చూసుకున్నారు. నవీ ముంబై పరిసరాల్లో నిర్ణయించిన నగర & హైవే మార్గాల్లో కారును నడిపారు. పరీక్ష సమయంలో కారులో డ్రైవర్ మాత్రమే ఉన్నారు. ఏసీని ఫ్యాన్ స్పీడ్ 2లో ఉంచారు. ఉష్ణోగ్రతను అత్యల్ప స్థాయిలో సెట్ చేశారు.

ఆడియో సిస్టమ్, సూచికలు, వైపర్లు వంటి ఇతర ఎలక్ట్రికల్ పరికరాలను సాధారణ వినియోగదారుల మాదిరిగానే ఉపయోగించారు. మధ్యమధ్యలో డ్రైవర్లను మార్చడం ద్వారా డ్రైవింగ్ విధానంలో వచ్చే తేడాలను కూడా తగ్గించారు.

ఈ లెక్కల ప్రకారం చూస్తే.. తక్కువ ధరలో మూడు వరుసల MPVతో పాటు CNG ఆప్షన్‌ కూడా కోరుకునేవాళ్లకు గ్రావైట్ ఆసక్తికరమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా హైవేపై 25.1km/kg మైలేజీ నమోదు చేయడం దీని ప్రధాన ఆకర్షణగా చెప్పొచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.