Kia car discount offers August 2026: కొత్త కారు కొనాలని చూస్తున్నారా? అయితే, ఈ నెల (ఆగస్టు 2026)లో కారు కొనుగోలు చేసేవారికి కియా ఇండియా భారీ ఆఫర్లు ప్రకటించింది. ఎంపిక చేసిన మోడళ్లపై నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ ప్రయోజనాలు, కార్పొరేట్ ఆఫర్లు అందిస్తోంది. కొన్ని కార్లపై ఉచితంగా అదనపు వారంటీ కూడా లభిస్తోంది.

Continues below advertisement

కియా ఇండియా, ప్రస్తుతం తన ఉనికిని మరింత బలోపేతం చేసుకుంటోంది. కొత్త సైరోస్ EVతో పాటు ఫ్లాగ్‌షిప్ సోరెంటో SUVని కూడా తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇదే సమయంలో ప్రస్తుత మోడళ్లపై ఆఫర్లను ప్రకటించింది. కియా EV6 & EV9 మినహా మిగతా మోడళ్లపై ఏదో ఒక రూపంలో ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. 

Kia Carens Clavisకియా కారెన్స్ క్లావిస్‌పై అత్యధికంగా రూ.1.20 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. 2026 మోడల్‌పై రూ.10,000 నగదు తగ్గింపు, రూ.20,000 లాయల్టీ ప్రయోజనం, రూ.15,000 వరకు కార్పొరేట్ ఆఫర్ & రూ.30,000 వరకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్ ఉన్నాయి.

Continues below advertisement

2025 మోడల్ కారెన్స్ క్లావిస్‌పై రూ.75,000 వరకు నగదు తగ్గింపు లభిస్తుంది. దీనికి అదనంగా లాయల్టీ, ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి; కార్పొరేట్ ఆఫర్ మాత్రం ఉండదు. 2025 మోడల్ టర్బో పెట్రోల్ వేరియంట్లకు ఉచిత అదనపు వారంటీ కూడా అందిస్తున్నారు. ఈ కారు ధర రూ.11.27 లక్షల నుంచి రూ.21.67 లక్షల వరకు ఉంది.

ఇది కూడా చదవండి: Maruti Victoris S-CNG.. రూ.1 లక్ష ఎక్కువైనా ఎందుకు కొనాలి? మైలేజీతో లెక్క మారిపోతుంది!

Kia Carnivalకియా కార్లలో అత్యధిక ప్రయోజనాలు కార్నివాల్‌పై ఉన్నాయి. ఈ ప్రీమియం ఎంపీవీపై రూ.1.50 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. 2026 మోడళ్లపై రూ.1 లక్ష వరకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ ఆఫర్ & రూ.50,000 వరకు కార్పొరేట్ ఆఫర్ ఉన్నాయి. 2025 మోడల్‌పై రూ.20,000 స్క్రాపేజ్ ఆఫర్ ఉంది. కార్నివాల్ ధర రూ.59.65 లక్షలు.

Kia Carens Clavis EVకారెన్స్ క్లావిస్ ఈవీపై రూ.55,000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. 2026 మోడల్‌ కొంటే రూ.20,000 లాయల్టీ ప్రయోజనం, రూ.15,000 వరకు కార్పొరేట్ ఆఫర్ & రూ.20,000 ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ ప్రయోజనం అందుతాయి. ఈ కారు ధర రూ.18.04 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఉంది.

Kia Syrosకియా సైరోస్‌ రూ.50,000 వరకు బెనిఫిట్స్‌ అందిస్తుంది. 2026 మోడల్‌పై రూ.10,000 వరకు నగదు తగ్గింపు, రూ.15,000 వరకు కార్పొరేట్ ఆఫర్ & రూ.20,000 ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ ఆఫర్ ఉంది. 2025 మోడల్‌పై రూ.50,000 వరకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ ప్రయోజనం లభిస్తుంది. సైరోస్‌ కొనేవాళ్లకు ఉచిత అదనపు వారంటీ కూడా ఆఫర్‌ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి

Kia Sonet కియా సోనెట్‌పై రూ.45,000 వరకు ప్రయోజనాలు అందుతాయి. 2026 మోడల్‌పై రూ.10,000 వరకు నగదు తగ్గింపు, రూ.15,000 వరకు కార్పొరేట్ ఆఫర్ & రూ.20,000 వరకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్ లభిస్తుంది. సోనెట్ ధర రూ.7.41 లక్షల నుంచి రూ.14.37 లక్షల వరకు ఉంది.

Kia Seltosఈ నెలలో, కొత్త తరం కియా సెల్టోస్‌ రూ.40,000 వరకు మిగిలిస్తుంది. ఇందులో రూ.20,000 లాయల్టీ ప్రయోజనం & రూ.20,000 స్క్రాపేజ్ బోనస్ ఉన్నాయి. ఈ కారు ధర రూ.11 లక్షల నుంచి రూ.21.82 లక్షల వరకు ఉంది.

Kia Carensకియా కారెన్స్‌పై రూ.35,000 వరకు బెనిఫిట్స్‌ ఆఫర్‌ ఉంది. 2026 మోడల్‌పై రూ.15,000 వరకు కార్పొరేట్ ఆఫర్ & రూ.20,000 వరకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్ ఉంది. 2025 మోడల్‌పై స్క్రాపేజ్ ఆఫర్ మాత్రమే ఉంది. కియా కారెన్స్‌ ధర రూ.11.02 లక్షల నుంచి రూ.12.88 లక్షల వరకు ఉంది.

పైన చెప్పిన ధరలన్నీ ఎక్స్‌షోరూమ్ ధరలు. ఆఫర్లు.. నగరం, డీలర్‌షిప్‌, స్టాక్‌ ఆధారంగా మారవచ్చు, కొనే ముందు స్థానిక డీలర్‌ను సంప్రదించడం మంచిది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.