Maruti Brezza 2026 Finance Plan | మీరు ఒక కొత్త కాంపాక్ట్ SUV కొనాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే మీ బడ్జెట్ పరిమితంగా ఉంటే కొత్త మారుతి సుజుకి బ్రెజ్జా మీకు మంచి ఆప్షన్ కావచ్చు. ఈ కారును మీరు కేవలం రూ. 1 లక్ష డౌన్ పేమెంట్ చెల్లించి కొనుగోలు చేయవచ్చు. ఆ తర్వాత మిగిలిన పేమెంట్‌ను కార్ లోన్ రూపంలో తిరిగి చెల్లించవ్చు. ప్రతి నెలా EMI చెల్లిస్తూ కారును మీ సొంతం చేసుకోవచ్చు. మీరు ఏ వేరియంట్ కొనుగోలు చేస్తారనే దానిపై EMI విలువ ఆధారపడి ఉంటుంది.

Continues below advertisement

మారుతి బ్రెజ్జా 2026ని ఇటీవల అనేక కొత్త అప్‌డేట్‌లతో లాంచ్ చేశారని తెలిసిందే. మారుతి కంపెనీ దీని ఎక్స్‌టీరియర్‌లో స్వల్ప మార్పులు చేసింది. దాంతో ఈ SUV గతంలో కంటే మరింత మోడ్రన్, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇందులో కొత్త స్మోక్ క్రోమ్ ఫ్రంట్ గ్రిల్, కొత్త ఫ్రంట్ బంపర్, కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్, కొన్ని ఇతర మార్పులు చేశారు. అయితే మారుతి బ్రెజ్జా గుర్తింపు చెక్కుచెదరకుండా ఉండేందుకు దీని ఓవర్‌ఆల్ డిజైన్‌ను మాత్రం మునుపటిలాగే ఉంచారు.

కొత్త బ్రెజ్జా ఇంటీరియర్, ఫీచర్లు

Continues below advertisement

కొత్త మారుతి బ్రెజ్జా ఇంటీరియర్‌లో పలు మార్పులు చేశారు. ఇందులో మునుపటి కంటే పెద్దదైన 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ అండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, మెరుగైన క్వాలిటీ ఉన్న డాష్‌బోర్డ్, కొత్త అప్‌హోల్స్టరీ డిజైన్, ప్రీమియం ఫినిషింగ్ ఉన్నాయి. దీని వల్ల క్యాబిన్ గతంలో కంటే మరింత మోడ్రన్, సౌకర్యవంతంగా అనిపిస్తుంది.

Also Read: : ఫిక్స్‌డ్ బ్యాటరీతో విడా VX2 కొత్త వేరియంట్ విడుదల, 65 నిమిషాల్లోనే ఛార్జింగ్‌.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే

కొత్త బ్రెజ్జాలో కొత్త, మోడ్రన్ ఫీచర్లు ఇచ్చారు. ఇందులో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, LED హెడ్‌లైట్స్, పుష్ బటన్ స్టార్ట్, అనేక సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. కంపెనీ సేఫ్టీపై కూడా ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో కొత్త అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లను చేర్చింది.

కొత్త బ్రెజ్జాలో కస్టమర్లకు కొత్త ఇంజిన్ ఆప్షన్లు లభిస్తాయి. మొదటగా ఇందులో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఇచ్చారు. ఇది మెరుగైన పెర్ఫార్మెన్స్ కోసం తయారు చేశారు. 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ CNG ఆప్షన్ అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్ ఇంజిన్‌తో 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ వస్తుండగా.. CNG వేరియంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.

కారు కొనుగోలుకు ఎంత డౌన్ పేమెంట్ చెల్లించాలి?

మీరు బ్రెజ్జా ఏదైనా బేస్ లేదా ప్రారంభ వేరియంట్ కొనుగోలు చేయాలంటే రూ. 1 లక్ష డౌన్ పేమెంట్ కట్టి, మిగిలిన మొత్తాన్ని బ్యాంక్ నుండి కారు లోన్ తీసుకోవాలి. బ్రెజ్జా LXi టర్బో MT ఆన్-రోడ్ ధర సుమారు రూ. 8.25 లక్షలు ఉంటే.. రూ. 1 లక్ష చెల్లించిన తర్వాత దాదాపు రూ. 7.25 లక్షల లోన్ తీసుకోవాలి. బ్యాంక్ 10 శాతం వార్షిక వడ్డీ రేటుతో 5 సంవత్సరాలకు లోన్ ఇస్తే, మీ EMI నెలకు దాదాపు రూ. 15,404 అవుతుంది.

మీరు LXi MT వేరియంట్ కొనుగోలు చేస్తే, దీని ఆన్-రోడ్ ధర 9.31 లక్షలు ఉంటుంది. రూ. 1 లక్ష డౌన్ పేమెంట్ తర్వాత రూ. 8.31 లక్షల వరకు కార్ లోన్ తీసుకోవాలి. 5 సంవత్సరాల కాలపరిమితికి EMI నెలకు దాదాపు రూ. 17,656 కట్టాలి. టాప్ వేరియంట్ల ధర, లోన్ తీసుకుమే మొత్తం పెరిగేకొద్దీ EMI కూడా పెరుగుతుంది.

Also Read: మహీంద్రా విజన్ S నుంచి స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ వరకు.. ఈ నెలలో మార్కెట్‌లోకి రానున్న కొత్త కార్లు ఇవే

కార్ లోన్ తీసుకునే ముందు వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు మరియు లోన్ నిబంధనలను పోల్చి చూడండి. ఆఖరి EMI,  మొత్తం చెల్లింపులో స్వల్ప వ్యత్యాసం ఉండవచ్చు. డౌన్ పేమెంట్ ఎంత ఎక్కువగా ఉంటే, అంత తక్కువ లోన్ తీసుకుంటారు. మీ మంత్లీ EMI కూడా తగ్గిపోతుంది.

కొత్త బ్రెజ్జా కొనుగోలు సరైన నిర్ణయమేనా?

 ఆకర్షణీయమైన డిజైన్, మోడ్రన్ ఫీచర్లు, మంచి మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్, బెస్ట్ ఫైనాన్స్ ఆప్షన్లు ఉన్న కాంపాక్ట్ SUV కోరుకుంటే కొత్త మారుతి బ్రెజ్జా సరిగ్గా సరిపోతుంది. తక్కువ డౌన్ పేమెంట్, సులభమైన EMIల కారణంగా తొలిసారి కారు కొనుగోలు చేయడానికి ప్లాన్ చేస్తున్న కస్టమర్లకు కూడా ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.