Vida VX2 Go FB Price, Range And Features Telugu: హీరో మోటోకార్ప్‌కు చెందిన ఎలక్ట్రిక్ మొబిలిటీ బ్రాండ్ 'విడా', తన VX2 ఎలక్ట్రిక్ స్కూటర్ సిరీస్‌ను మరింత విస్తరించింది. ఈ కంపెనీ, కొత్తగా, విడా VX2 Go FB వేరియంట్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ ఎక్స్ షోరూమ్ ధరను రూ.1.13 లక్షలుగా నిర్ణయించారు. ఇప్పటి వరకు రిమూవబుల్ బ్యాటరీ వేరియంట్లతో అందుబాటులో ఉన్న VX2 శ్రేణిలో ఇప్పుడు ఫిక్స్‌డ్ బ్యాటరీ ఆప్షన్‌ను కూడా కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చింది.
3.1kWh బ్యాటరీ కొత్త విడా VX2 Go FBలో 3.1kWh సామర్థ్యం గల ఫిక్స్‌డ్ లిథియమ్ అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. ఈ బ్యాటరీని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే IDC ప్రమాణాల ప్రకారం 128 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ ప్రకటించింది. ఇంట్లో నేరుగా ప్లగ్ ఇన్ చేసి ఛార్జ్ చేసుకునే విధంగా ఈ బ్యాటరీని రూపొందించారు. దీంతో రిమూవబుల్ బ్యాటరీ అవసరం లేని వినియోగదారులకు ఇది మరింత అనుకూలంగా ఉంటుంది.
పనితీరు విషయానికి వస్తే, ఇప్పటికే ఉన్న 6kW పీక్ పవర్‌ను ఉత్పత్తి చేసే స్వింగ్ ఆర్మ్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌నే ఈ స్కూటర్‌లోనూ కొనసాగించారు. ఈ మోటార్ సహాయంతో స్కూటర్ గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంది. నగర ప్రయాణాలకు ఈ వేగం చాలినంతగా ఉంటుంది.
65 నిమిషాల్లోనే ఛార్జింగ్‌ఈ కొత్త వేరియంట్‌లో మరో ముఖ్యమైన ఆకర్షణ DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగిస్తే బ్యాటరీని 0 నుంచి 80 శాతం వరకు కేవలం 65 నిమిషాల్లోనే ఛార్జ్ చేయవచ్చని హీరో వెల్లడించింది. దీంతో రోజువారీ వినియోగంలో ఎక్కువసేపు ఛార్జింగ్ కోసం వేచి ఉండాల్సిన అవసరం తగ్గుతుంది.
ఇది కూడా చదవండి: కొత్త స్పెక్ట్రల్ గ్రీన్ కలర్‌తో టీవీఎస్ రైడర్ 125 డాక్టర్ డూమ్ ఎడిషన్ - ధర రూ.95,320
ఫీచర్లుఫీచర్ల పరంగా కూడా విడా VX2 Go FB ఆకట్టుకునే పరికరాలతో వస్తోంది. ఇందులో 4.3 అంగుళాల LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించారు. ఇది స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో పాటు టర్న్ బై టర్న్ నావిగేషన్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. అదనంగా 27.2 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ లభించడం వల్ల హెల్మెట్ లేదా ఇతర సామగ్రిని సులభంగా ఉంచుకోవచ్చు. పొడవైన సింగిల్ పీస్ సీటు వల్ల రైడర్‌తో పాటు వెనుక కూర్చునే ప్రయాణికుడికి కూడా సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవం లభిస్తుంది.
5 వేరియంట్లుఈ కొత్త ఫిక్స్‌డ్ బ్యాటరీ వేరియంట్ రాకతో విడా VX2 శ్రేణిలో మొత్తం ఐదు వేరియంట్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ స్కూటర్ నాలుగు బ్యాటరీ ఆప్షన్లతో విక్రయిస్తున్నారు. ప్రారంభ స్థాయి 2.2kWh బ్యాటరీ ప్యాక్ IDC ప్రమాణాల ప్రకారం 93 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తే, టాప్ ఎండ్ 4.4kWh బ్యాటరీ ప్యాక్‌తో ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 187 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది.
ఇది కూడా చదవండి: అథర్ రిజ్టా, బజాజ్ చేతక్‌కు కొత్త పోటీ - సింపుల్ 'అరైవ్' ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ఆసక్తికర వివరాలు
రిమూవబుల్ బ్యాటరీ లేదా ఫిక్స్‌డ్ బ్యాటరీ అనే రెండు ఎంపికలను వినియోగదారులకు అందించడం ద్వారా వారి అవసరాలకు తగ్గట్టు సరైన మోడల్‌ను ఎంచుకునే అవకాశం కల్పించామని విడా తెలిపింది. ఇంట్లోనే సులభంగా ఛార్జ్ చేసుకునే సౌకర్యం ఉన్న వారికి కొత్త VX2 Go FB మంచి ప్రత్యామ్నాయంగా నిలవనుంది. పెరుగుతున్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్లో మరింత మంది వినియోగదారులను ఆకర్షించేందుకు హీరో మోటోకార్ప్ తీసుకొచ్చిన ఈ కొత్త వేరియంట్ కీలకంగా మారే అవకాశముంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
