New Gen Honda Amaze: హోండా కార్స్ ఇండియా తదుపరి తరం అమేజ్ సెడాన్‌ను ఈ ఏడాది చివర్లో దీపావళి పండుగ సందర్భంగా దేశంలో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. హోండా అమేజ్ కొత్త తరం మోడల్ మారుతి సుజుకి డిజైర్, హ్యుందాయ్ ఆరా, టాటా టిగోర్‌లకు ఇది పోటీ ఇవ్వనుంది. కొత్త అప్‌డేట్‌తో కంపెనీ ఎంట్రీ లెవల్ సెడాన్ డిజైన్, ఆర్కిటెక్చర్ పరంగా పూర్తిగా మార్చబడుతుంది. 2024 హోండా అమేజ్‌లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయో తెలుసుకుందాం.
2024 హోండా అమేజ్ ప్లాట్‌ఫారమ్
మూడో తరం హోండా అమేజ్ సిటీ సెడాన్, ఎలివేట్ ఎస్‌యూవీ కోసం ఉపయోగించిన ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తుంది. అమేజ్ పొట్టి వీల్‌బేస్‌కు అనుగుణంగా ప్లాట్‌ఫారమ్ కొద్దిగా అప్‌డేట్ చేస్తున్నారు. సెడాన్ మొత్తం పొడవు నాలుగు మీటర్ల కంటే తక్కువగా ఉంటుంది. హోండా సిటీ వీల్ బేస్ 2600 మిల్లీమీటర్లు కాగా, హోండా ఎలివేట్ వీల్‌బేస్ 2650 మిల్లీమీటర్లుగా ఉంది. ప్రస్తుత హోండా అమేజ్ వీల్‌బేస్ 2470 మిల్లీమీటర్లు కాగా, ఇది సిటీ సెడాన్ కంటే 130 మిల్లీమీటర్లు తక్కువ కావడం విశేషం.
2024 హోండా అమేజ్ డిజైన్
కొత్త తరం అమేజ్ స్టైలిష్, ప్రీమియం డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇది గ్లోబల్ మార్కెట్‌లో కంపెనీ విక్రయిస్తున్న పెద్ద కార్ల డిజైనర్ తరహాలో ఉంటుంది. ఉదాహరణకు 2018లో లాంచ్ అయిన రెండో తరం అమేజ్ అప్పటి అకార్డ్ సెడాన్ తరహా స్టైలింగ్‌ను పొందింది.
2024 హోండా అమేజ్ ఫీచర్లు
తదుపరి తరం హోండా అమేజ్ కొత్త క్యాబిన్‌ను పొందుతుంది. ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇది ఎలివేట్ ఎస్‌యూవీ తరహాలో ఉంటుంది. ధరలను తక్కువగా ఉంచడానికి, భారతదేశంలోని ఇతర హోండా కార్లలో ఉన్న అనేక ఇతర ఫీచర్లు ఈ కారులో చూడవచ్చు.
2024 హోండా అమేజ్ ఇంజన్ స్పెసిఫికేషన్లు
తదుపరి తరం హోండా అమేజ్ పెట్రోల్ మోడల్‌లో మాత్రమే వస్తుంది. ఇది ఇప్పటికే ఉన్న నేచురల్లీ యాస్పిరేటెడ్ 1.2 లీటర్ 4 సిలిండర్ ఇంజన్‌తో అందుబాటులో ఉంటుంది. ఈ ఇంజన్ ప్రస్తుత తరం మోడల్‌తో అత్యధికంగా 89 బీహెచ్‌పీ పవర్‌ని, 110 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో పెయిర్ అయింది. హోండా భారతదేశంలో డీజిల్ ఇంజిన్‌లను నిలిపివేసింది. కాబట్టి హోండా అమేజ్ కారు ఇకపై భారతదేశంలో డీజిల్ పవర్‌ట్రెయిన్‌తో కనిపించదు.
Also Read: మొదటిసారి అలాంటి కారు తయారు చేయనున్న టెస్లా - భారతదేశం కోసమే!