Earth Quake in Kishtwar: జమ్మూకశ్మీర్ (Jammukashmir)లో కొద్ది రోజులుగా వరుస భూకంపాలు భయాందోళన కలిగిస్తున్నాయి. తాజాగా, ఆదివారం తెల్లవారుజామున 2:47 గంటలకు కిష్ట్ వార్ లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత 3.5గా ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) తెలిపింది. భూ అంతర్భాగంలో 10 కిలో మీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉందని పేర్కొంది. అర్ధరాత్రి వేళ ఒక్కసారి భూమి కంపించడంతో ప్రజలు ఆందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కిష్ట్ వార్ జిల్లాలో గత రెండు రోజుల్లో ఇది మూడో భూకంపం.


కాగా, శనివారం మధ్యాహ్నం కూడా 2:53 గంటల ప్రాంతంలో కిష్ట్ వార్ జిల్లాలోని 3.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. అంతకు ముందు శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలోనూ భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.2గా నమోదైంది. వరుసగా మూడుసార్లు భూమి కంపించినా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.


Also Read: మోదీ పర్యటన తరవాత లక్షద్వీప్‌కి పెరిగిన పాపులారిటీ, పర్యాటకానికి ఫుల్ డిమాండ్