NIACL Assistant Admitcard: న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్(NIACL) అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న మెయిన్స్ రాతపరీక్ష అడ్మిట్‌కార్డులను ఏప్రిల్ 6న విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్‌కార్డులను అందుబాటులో ఉంచారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం దేశంలోని ప్రధాన కేంద్రాల్లో ఏప్రిల్‌ 13న ఆన్‌లైన విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి తుది ఎంపికలు చేపడతారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.37,000 జీతంగా చెల్లిస్తారు. అంతకు ముందు మార్చి 2న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష తేదీ వరకూ హాల్‌టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి.


NIACL అసిస్టెంట్ మెయిన్స్ పరీక్ష హాల్‌టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..


➥ NIACL మెయన్స్ పరీక్ష హాల్‌టికెట్ల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి - newindia.co.in


➥ అక్కడ హోంపేజీలో, 'Recruitment' విభాగాన్ని సందర్శించాలి.


➥ ఆ తర్వత వచ్చే పేజీలో, 'Assistant Recruitment Excercise' విభాగంలోకి వెళ్లాలి. 


➥ NIACL అసిస్టెంట్ మెయిన్స్ పరీక్ష హాల్‌టికెట్లకు సంబంధించిన పేజీ ఓపెన్ అవుతోంది.  


➥ అభ్యర్థులు అక్కడ తమ రిజిస్ట్రేషన్ నెంబరు లేదా రూల్ నెంబర, పాస్‌వర్డ్ లేదా పుట్టినతేదీ వివరాలు నమోదుచేయాలి.  


➥ అభ్యర్థులకు సంబంధించిన హాల్‌టికెట్లు కంప్యూటర్ స్క్రీన్ మీద దర్శనమిస్తాయి.


➥ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకొని పరీక్షరోజు వెంట తీసుకెళ్లాలి.


NIACL - మెయిన్స్ పరీక్ష హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


మెయిన్స్ పరీక్ష విధానం..
పరీక్ష ఆబ్జెక్టివ్ మరియు డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది. టెస్ట్ ఆఫ్ రీజనింగ్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్, టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్‌నెస్, టెస్ట్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్, టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీ మీద ప్రశ్నలు అడుగుతారు. మొత్తం200 ప్రశ్నలకు గాను 250 గరిష్ట మార్కులు. ప్రతి ప్రశ్నకు 1.25 మార్కు ఉంటుంది మరియు ప్రశ్న వెయిటేజీలో ¼ తప్పు సమాధానానికి పెనాల్టీ ఉంటుంది.


న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్(NIACL) అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఈ ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌ను వెలువడిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 300 అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మార్చి 2న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. పరీక్ష ఫలితాలను మార్చి 21 విడుదల చేశారు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించినవారికి ఏప్రిల్ 13న మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు.


ALSO READ:


SSC CPO Results: ఢిల్లీపోలీస్, సీఏపీఎఫ్ ఎస్‌ఐ తుది ఫలితాలు విడుదల
ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ విభాగాల్లో సబ్ ఇన్‌స్పెక్టర్(SI) ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఎస్‌ఎస్‌సీ సీపీవో 2023 తుది ఎంపిక ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏప్రిల్ 6న వెల్లడించింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మొత్తం 1865 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. కాగా 1786 మందితో కూడిన జాబితాను మాత్రమే స్టాప్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. వివిధ కారణాల వల్ల 79 మంది ఫలితాలను విత్‌హెల్డ్‌లో ఉంచింది. ఫలితాలతోపాటు కేటగిరీలవారీగా కటాఫ్ మార్కుల వివరాలను కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటించింది.
ఫలితాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..