New Bajaj Pulsar NS 125: 2024 పల్సర్ ఎన్‌ఎస్160, ఎన్‌ఎస్200లను పరిచయం చేసిన తర్వాత, బజాజ్ ఇప్పుడు భారతదేశంలో అప్‌డేట్ చేసిన పల్సర్ ఎన్‌ఎస్125ని కూడా విడుదల చేసింది. కొత్త పల్సర్ ఎన్ఎస్125 ఎక్స్ షోరూమ్ ధర రూ.1,04,922గా నిర్ణయించారు. దాని పాత మోడల్‌తో పోలిస్తే, బేబీ పల్సర్ ఇప్పుడు రూ. 5,000 ధర ఎక్కువ అయింది. మార్కెట్‌లో ఈ బైక్ హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్, టీవీఎస్ రెయిడర్ 125తో ఉంటుంది.


డిజైన్ ఇలా...
2024 బజాజ్ పల్సర్ ఎన్‌ఎస్125కి అదే అప్‌డేట్‌లు ఇచ్చారు. ఈ మోటార్‌సైకిల్ మస్కులర్ డిజైన్ అలాగే ఉంచారు. ముందు డిజైన్, ఇంధన ట్యాంక్, సైడ్ ప్యానెల్‌లు అలాగే ఉంటాయి. కంపెనీ హెడ్‌లైట్ ఇంటర్నల్స్‌ను అప్‌డేట్ చేసింది. ఇది థండర్ ఆకారంలో ఉన్న ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్ (DRL)తో కూడా వస్తుంది.


ఏ ఫీచర్లు అందించారు?
ఈ మోటార్‌సైకిల్ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో వస్తుంది. ఇది ప్రయాణంలో ఎస్ఎంఎస్, కాల్ నోటిఫికేషన్లు, ఫోన్ బ్యాటరీ స్థాయి, ఇతర నోటిఫికేషన్‌లను యాక్సెస్ చేయడానికి రైడర్‌కు సహాయపడుతుంది. పల్సర్ ఎన్‌ఎస్1625లొ యూఎస్‌బీ పోర్టు, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉన్నాయి.


2024 పల్సర్ ఎన్‌ఎస్125లో 125 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ అందించారు. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో రానుంది. ఈ ఇంజన్ 11.8 బీహెచ్‌పీ పవర్, 11 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. సస్పెన్షన్ కోసం బైక్ సంప్రదాయ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక వైపున మోనోషాక్ సస్పెన్షన్ యూనిట్‌ను పొందుతుంది. మోటార్‌సైకిల్ సింగిల్ ఛానల్ ఏబీఎస్ సిస్టమ్‌తో ముందు డిస్క్, వెనుక డ్రమ్ బ్రేక్‌లతో వస్తుంది. ఇందులో 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ అందించారు.


Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?



Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?