Walk in interview: గుజరాత్ రాష్ట్రం వాపిలోని ఈఎస్ఐసీ హాస్పిటల్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్‌ రెసిడెంట్ పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. దీనిద్వారా 13 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో పీజీ లేదా పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మార్చి 7వ తేదీన ఇంటర్వ్యూకి హాజరు కావాల్సిఉంటుంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను సంబంధిత చిరునామాలో ఉదయం 9గంటల నుంచి 11:00  వరకు రిపోర్టు చేయాలి. 


వివరాలు..


ఖాళీల సంఖ్య: 13


* సీనియర్‌ రెసిడెంట్ పోస్టులు


పోస్టుల కెటాయింపు: జనరల్-08, ఓబీసీ-03, ఎస్సీ-01, ఈడబ్ల్యూఎస్-01.


➥ అనస్తీషియా: 02


➥ ఐ: 01


➥ మెడిసిన్: 03


➥ ఆర్థోపెడిక్స్: 01


➥ పీడియాట్రిక్: 02


➥ రేడియాలజీ: 01


➥ సర్జరీ: 03


అర్హత: సంబంధిత విభాగంలో పీజీ లేదా పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 07.03.2024 నాటికి 45 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీహెచ్ అభ్యర్థులకు వయో సడలింపులు వర్తిస్తాయి. 


ఎంపిక విధానం: అర్హత, అనుభవం & ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


వేతనం: నెలకు రూ.1,21,454.


వేదిక: ESIC Hospital , Selvassa Road, Chanod, Vapi, Distt.- Valsad (Gujarat).


వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీ: 07.03.2024.


రిపోర్టింగ్ సమయం: ఉదయం 9:00  నుంచి 11:00  వరకు.


Notification


Website


ALSO READ:


ఎంప్లాయిస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పోరేషన్ కేరళలో సూపర్‌ స్పెషలిస్ట్ పోస్టులు
Walk in interview: ఎంప్లాయిస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పోరేషన్, కేరళ ఒప్పంద ప్రాతిపదికన సూపర్‌ స్పెషలిస్ట్, స్పెషలిస్ట్, సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. దీనిద్వారా 22 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యు యేట్‌ డిగ్రీ, డీఎన్‌బీ, డిప్లొమా, ఎంబీబీఎస్‌లో టీసీఎమ్‌సీ రిజిస్ట్రేషన్‌ ఉండాలి. దాంతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హలు. సరైన అర్హతలున్నవారు మార్చి 4వ తేదీన ఇంటర్వ్యూకి హాజరు కావాల్సిఉంటుంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను సంబంధిత చిరునామాలో ఉదయం 9గంటలకు రిపోర్టు చేయాలి. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.


ఎయిమ్స్‌లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు - అర్హతలు, ఎంపిక వివరాలు ఇలా
న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ సంస్థల్లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్(నార్‌సెట్‌)- 6 నోటిఫికేషన్ విడుదలైంది. డిప్లొమా (జీఎన్‌ఎం)తో పాటు రెండేళ్ల పని అనుభవం లేదా బీఎస్సీ (ఆనర్స్‌) నర్సింగ్/ బీఎస్సీ నర్సింగ్/ బీఎస్సీ (పోస్ట్ సర్టిఫికేట్)/ పోస్ట్-బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. స్టేట్/ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌లో నర్సులుగా రిజిస్టరైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మార్చి 17 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. నార్‌సెట్‌-6 స్కోరు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉద్యోగాల ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...