MG Astor Hybrid Plus: ఎంజీ ఆస్టర్ హైబ్రిడ్ ప్లస్ కారును దాని గ్లోబల్ లాంచ్‌కు ముందు టీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఎంజీ జెడ్5 అని కూడా పిలుస్తారని తెలుస్తోంది. కొత్త తరం ఆస్టర్ హైబ్రిడ్ టెక్నాలజీని పొందగలగడం పెద్ద విషయం. ఈ హైబ్రిడ్ సిస్టమ్ పెట్రోల్ ఇంజన్, ఎలక్ట్రిక్ మోటారుతో అట్కిన్సన్ సైకిల్‌పై నడుస్తుంది. ఇది 1.83 కేడబ్ల్యూహెచ్ కెపాసిటీతో ఎన్‌సీఎం లిథియం-అయాన్ బ్యాటరీని ఉపయోగిస్తుంది.
ఎంజీ ఆస్టర్ హైబ్రిడ్ ప్లస్‌ను భారత్‌లో కూడా లాంచ్ కానుందని తెలుస్తోంది. ఇంతకుముందు ఈ కారు విషయంలో ఈవీ, హైబ్రిడ్ రెండింటినీ పరిశీలిస్తున్నామని జేఎస్‌డబ్ల్యూ, ఎంజీ మోటార్ తెలిపాయి. కొత్త ఆస్టర్ అప్‌డేట్ అయిన డిజైన్‌తో వస్తుంది. ఇది చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. కారు ఫ్రంట్ లుక్ సన్నగా ఉండే హెడ్‌ల్యాంప్‌లతో రాబోతోంది.
Also Read: మహీంద్రా థార్ 5 డోర్స్ వెర్షన్ ROXXలో అదిరిపోయే ఫీచర్ - సేల్స్ దుమ్ములేపాలని టార్గెట్
ఆస్టర్ బంపర్‌పై పెద్ద కట్, హెడ్‌ల్యాంప్‌లు దాని లుక్‌ను మరింత వైడ్‌గా చేస్తాయి. ఇది భారత మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ క్రెటా, సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, హైరైడర్, టిగన్‌లకు గట్టి పోటీని ఇవ్వబోతోంది.
కొత్త ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, గ్రిల్‌ను అనుసంధానించడం ద్వారా కొత్త ఆస్టర్ ముందు భాగంలో పెద్ద మార్పులు చేసింది. ఇది కాకుండా కొత్త అల్లాయ్ వీల్స్, టెయిల్ లైట్లు కూడా అందించనున్నారు. అలాగే డ్యాష్‌బోర్డ్‌లో ఇన్ఫోటైన్‌మెంట్, ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ కోసం డ్యూయల్ స్క్రీన్ సెటప్ అందుబాటులో ఉంటుంది.
ధర ఎంత ఉండవచ్చు?
ఎంజీ మోటార్స్ ఈ కారును రాబోయే కొద్ది నెలల్లో లాంచ్ చేసే అవకాశం ఉంది. దీంతో పాటు కొత్త అప్‌డేట్‌లు, కొత్త పవర్‌ట్రెయిన్‌తో, ఇది అధిక ధరతో ళాంచ్ కానుంది. ప్రస్తుత పెట్రోల్ మోడల్ ధర 17,890 యూరోల (సుమారు రూ. 16.61 లక్షలు) నుంచి ప్రారంభమవుతుంది. మార్కెట్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఎంజీ ఆస్టర్ హైబ్రిడ్‌ను దాదాపు 25,000 యూరోల (రూ. 23.20 లక్షలు)కి పరిచయం చేయవచ్చు.
Also Read: 4 లక్షల స్కూటర్లు వెనక్కి తీసుకుంటున్న సుజుకి- మీ దగ్గర ఉంటే వెంటనే షోరూమ్‌కి తీసుకెళ్లండి