Chicken Liver Benefits : చికెన్ ప్రోటీన్‌కి మంచి సోర్స్‌గా చెప్తారు. అందుకే దీనిని డైట్ చేసే వాళ్లు ప్రోటీన్ సోర్స్‌గా తీసుకుంటారు. అయితే దీనిని హెల్త్ గురించే కాదు.. టేస్ట్ గురించి కూడా చాలామంది చికెన్ తింటూ ఉంటారు. మరికొందరికి ఆదివారమంటే చికెనే ముందు గుర్తు వస్తుంటుంది. అయితే చికెన్‌ని ఎంత ఇష్టంగా తింటారో.. దాని లివర్ని కూడా కొందరు అంతే ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు. కానీ మరికొందరేమో దాని జోలికే వెళ్లరు. మరి చికెన్ లివర్ని తినొచ్చా? దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ లివర్ని బేషుగ్గా తినొచ్చని చెప్తున్నారు డైటీషియన్లు. మీరు నాన్‌వెజ్‌ని ఇష్టపడేవారు అయితే చికెన్ లివర్ మీకు మంచి ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుందని చెప్తున్నారు. దీనిలో హెల్త్‌కి ప్రయోజనాలు అందించే ఎన్నో న్యూట్రిషియన్స్ ఉంటాయంటున్నారు. ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ బి 12 వంటి న్యూట్రిషనల్ వాల్యూస్‌తో నిండి ఉంటుంది. అలాగే ఫోలేట్, కాపర్, సెలెనీయంతో నిండి ఆరోగ్యానికి పలు ప్రయోజనాలు అందిస్తుందని చెప్తున్నారు. ఇంతకీ దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే..
ఆరోగ్య ప్రయోజనాలివే..
మీకు రక్తహీనత ఉంటే.. చికెన్ లివర్ కచ్చితంగా తీసుకోవచ్చు. ఎందుకంటే దీనిలోని బి 12 రక్తహీనతను కంట్రోల్ చేస్తుంది. రక్తహీనతతో ఇబ్బంది పడే మహిళలు దీనిని తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. అలాగే ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. దీనివల్ల సీజనల్ వ్యాధులు దూరమవుతాయి. విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరచడంతో పాటు.. హెల్తీ స్కిన్‌ని ప్రమోట్ చేస్తుంది. లివర్ హెల్త్‌కి కూడా ఇది మంచిది.
పురుషులకు చాలా మంచిదట
సంతానోత్పత్తిని పెంచడంలో చికెన్ లివర్ మంచి ప్రయోజనాలు అందిస్తుంది. పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయిలు కూడా పెంచి.. లైంగికంగా హెల్తీగా ఉండేలా చేస్తుంది. స్ట్రెస్ ఉన్నవారు కూడా దీనిని రెగ్యూలర్‌గా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయట. అందుకే దీనిని హాయిగా తీసుకోవచ్చు. అయితే దీనిని ఎలా తీసుకోవచ్చు? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?
వాళ్లు తీసుకోకపోవడమే మంచిది..
వీటిని ఫ్రై చేసి మెయిన్ డిష్‌గా తీసుకోవచ్చు. లేదంటే సూప్స్ చేసుకుని తాగవచ్చు. గ్రిల్ చేసుకుని సైడ్ డిష్‌గా కూడా తీసుకోవచ్చు. కొన్ని ఆరోగ్య సమస్యలున్నవారు మాత్రం దీనికి దూరంగా ఉంటే మంచిది. హై కొలెస్ట్రాల్ సమస్యలతో ఇబ్బంది పడేవారు కచ్చితంగా దీనిని దూరం పెడితే మంచిది. సరిగ్గా కుక్ చేయకుండా ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోతాయి. అందుకే వీటిని వండేప్పుడు క్లీనింగ్ చాలా పర్ఫెక్ట్గా చేసి.. బాగా ఉడికించి తీసుకోవాలి. చిన్నపిల్లలకి కూడా దీనిని పెట్టొచ్చు. కానీ లిమిట్లో పెడితే మంచిదంటున్నారు.
Also Read : బరువు తగ్గేందుకు చికెన్ మంచిదా? పనీర్ మంచిదా? నిపుణులు సలహాలు ఇవే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.